Illegal Products Frauds In Hyderabad :సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉంటున్నా, ఈ కేటుగాళ్లు ఈజీగా బురిడీ కొట్టించేస్తున్నారు. రకరకాల పేర్లు చెప్పి బాధితుల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. సైబర్‌మాయగాళ్ల చేతిలో మోసపోతున్న కేసులు రోజుకు కనీసం పదుల సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయి.
తాజాగా సికింద్రాబాద్‌లోని ఓ వ్యక్తికి సైబర్ నేరగాళ్లు కాల్ చేసి మేము ముంబయి పోలీసులమని, మీ పేరు మీద వచ్చిన పార్శిల్లో అక్రమ ప్రొడక్ట్స్ ఉన్నాయని చెప్పారు. ముంబయి కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. అది పోలీసులకు చెప్పకుండా గోప్యంగా ఉంచాలంటే రూ. 19 లక్షల 39 వేలు ట్రాన్స్ఫర్ చేయాలని డిమాండ్ చేశారు. అతన్ని స్కైప్ కాల్ ద్వారా విచారణకు హాజరు కావాలని సూచించారు.
సైబర్ బాధితులకు ఊరట - కేసుల పరిష్కారంపై ఈనెల 9న మెగా లోక్అదాలత్
Cyber Frauds In Hyderabad: భయంతో బాధితుడు స్కైప్ ద్వారా విచారణకు హాజరయ్యాడు. సైబర్‌నేరగాళ్లు సీబీఐ, ఆర్బీఐ డాక్యుమెంట్స్‌తో ముంబయి పోలీసుల యూనిఫార్మ్స్, ఐడీ కార్డ్స్‌తో విచారణ చేశారు. ఈ విషయాన్ని ఎవరికీ తెలియకుండా గోప్యంగా ఉంచుతామని బాధితుడిని నమ్మించారు. ఈ కేసులో ఎన్ఓసీ సర్టిఫికేట్ జారీ చేసేందుకు రూ. 19 లక్షల 39 వేలు పంపించాలని డిమాండ్ చేశారు. నగదు ట్రాన్స్ఫర్ చేసిన కొన్ని నిమిషాల్లో రిఫండ్ చేస్తామని నమ్మబలికారు.