ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"ఇది మంచి ప్రభుత్వం" - 100 రోజుల్లో సాధించిన విజయాలపై ప్రజల్లోకి నేతలు - CM Good Government Programme - CM GOOD GOVERNMENT PROGRAMME

Idi Manchi Prabhutvam Program in AP : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి100 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో నేతలు 'ఇది మంచి ప్రభుత్వం' అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మంత్రులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలపై ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరిస్తున్నారు. ప్రభుత్వ పథకాల కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు.

CM GOOD GOVERNMENT PROGRAMME
CM GOOD GOVERNMENT PROGRAMME (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 22, 2024, 10:25 AM IST

Idi Manchi Prabhutvam Program in AP :కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తిచేసుకున్నవేళ రాష్ట్రవ్యాప్తంగా "ఇది మంచి ప్రభుత్వం" కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి నేతలు ఇంటింటికి వెళ్లి ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. 100 రోజుల్లో ప్రభుత్వం సాధించిన విజయాలపై వివరిస్తున్నారు.

సంక్షోభంలోనూ సంక్షేమం : కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తోందని కృష్ణా జిల్లా ఘంటసాలలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. నెల్లూరు జిల్లా రామతీర్ధంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. పార్వతీపురం మన్యం జిల్లా గోపాలపురంలో పర్యటించిన మంత్రి సంధ్యారాణి సంక్షోభంలోనూ సంక్షేమం చంద్రబాబుకే సాధ్యమన్నారు. అనకాపల్లి జిల్లా ఎల్లవరంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు.

ఎదురుదాడులకు దిగితే తాటతీస్తా - ప్రతి నెలా 'పేదల సేవలో' : సీఎం చంద్రబాబు - CM Chandrababu Tour

ప్రభుత్వ పథకాలపై అవగాహన :ఏలూరు జిల్లా నూజివీడులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి పార్థసారథికి వరద బాధితుల సహాయార్థం పలువురు విరాళాలు అందించారు. కాకినాడ జిల్లా గజ్జనపూడిలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యప్రభ పాల్గొన్నారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే బుచ్చిబాబు పర్యటించారు. వైఎస్సార్ జిల్లా లింగాల మండలం లోపటన్నుతలలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో టీడీపీ నేత బీటెక్ రవి పాల్గొన్నారు. రాష్ట్రాన్ని సంక్షేమం వైపు నడిపిస్తున్న ఘనత చంద్రబాబుది అని అన్నమయ్య జిల్లా సంబేపల్లిలో మంత్రి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు.

320కే కిలో వస్తుందంటే ఆలోచించొద్దా - కల్తీ నెయ్యితో దేవుడికి నైవేద్యం పెడతారా?: సీఎం చంద్రబాబు - CM Chandrababu on TTD Laddu Issue


కరపత్రాలు పంపిణీ చేసిన నేతలు :శ్రీ సత్యసాయి జిల్లా రొల్ల మండలం హోట్టేబెట్టలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు పాల్గొన్నారు. సోమందేపల్లి మండలం గుడిపల్లిలో 20 లక్షల రూపాయలతో సీసీ రోడ్లకు మంత్రి సవిత భూమి పూజ చేశారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వ కార్యక్రమాలను వివరించారు. అనంతపురం జిల్లా గడేకల్లులో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ హాజరయ్యారు.

'ఇది మంచి ప్రభుత్వం'- ప్రకాశం జిల్లాలో ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు - Chandrababu Prakasam District Tour

ABOUT THE AUTHOR

...view details