హైదరాబాద్ పరిధిలో హైడ్రా దూకుడు - రాంనగర్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత - Hydra Demolitions in Ramnagar - HYDRA DEMOLITIONS IN RAMNAGAR
Hydra Focus On Ramnagar Illegal Constructions: హైదరాబాద్ పరిధిలో హైడ్రా ప్రకంపనలు సృష్టిస్తోంది. అక్రమ నిర్మాణాలు కనిపిస్తే చాలు విరుచుకుపడుతోంది. చెరువు పరిధిలో ఉన్నా, నాలాపై ఉన్నా రంగంలోకి దిగుతూ కూల్చివేతలకు తెగబడుతోంది. తాజాగా రాంనగర్‌లోని మణెమ్మకాలనీలో నాలాలపై నిర్మించిన నిర్మాణాలను ధ్వంసం చేసింది.
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 30, 2024, 11:54 AM IST
Hydra Demolition Ramnagar Illegal Constructions :హైదరాబాద్‌లోని అడిక్‌మెట్ డివిజన్ రాంనగర్‌లో హైడ్రా కూల్చివేతలకు దిగింది. రాంనగర్ చౌరస్తాలోని మణెమ్మ కాలనీలో నాలాను ఆక్రమించి నిర్మించిన కొన్ని కట్టడాలను రెండు రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. దీనిపై నివేదిక సమర్పించాలని జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. నిర్మాణాలు అక్రమమే అని నిర్ధరించిన అనంతరం హైడ్రా అధికారులు ఇవాళ ఉదయం కూల్చివేతలు చేపట్టారు. దీంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.