Hyderabad Tyagaraja Aradhana Music Festival 2025 : 10వ హైదరాబాద్ త్యాగరాజ ఆరాధనా సంగీతోత్సవం (HTAMF) 2025 రెండో నాడు అమూల్యమైన కర్ణాటక శాస్త్రీయ సంగీత కీర్తనల నిధిని అఖండ వారసత్వ సంపదగా మనకు అందించిన సద్గురు త్యాగరాజ స్వామికి నివాళిని అర్పించింది.
ముందుగా – హరికథా ప్రక్రియ ఆత్మను అత్యున్నత కళారూపంగా వెలికి తెచ్చిన శ్రీమతి విశాఖ హరి గారి శిష్యులు కు. శాకంబరి కామేశ్‌తో హరికథా ప్రదర్శనతో సాయంత్రపు కార్యక్రమం ప్రారంభమైంది. వీరికి చి. కె. రాఘవన్ వయొలిన్ పైన, చి. వేదాంత్ మృదంగం పైన వాద్యసహకారం అందించారు.
ఘనంగా హైదరాబాద్ త్యాగరాజ ఆరాధనా సంగీతోత్సవం (ETV Bharat) అలరించిన ప్రత్యేక కూచిపూడి నృత్య రూపకం : సాయంత్రపు ప్రధాన అంశంగా విద్వాన్ తాళ్లూరి నాగరాజు, తాళ్లూరి లలిత్‌లతో వేణుగాన కచేరీ అద్భుతంగా సాగింది. వీరికి వయొలిన్ పైన విద్వాన్ భట్టి పవన్ సింగ్, మృదంగం పైన విద్వాన్ డా.ఆర్.శ్రీకాంత్ చక్కటి వాద్యసహకారం అందించారు. అనంతరం విధూషి శ్రీవిద్య అంగర 'మనోమంథన' పేరుతో రూపొందించిన ఒక ప్రత్యేక కూచిపూడి నృత్యపు అంశాన్ని ప్రదర్శించారు. వారి అభినయం ద్వారా అనేక భావాలను పలికించిన తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ మంత్ర ముగ్ధులను చేసింది. ఈ రెండో రోజు కార్యక్రమానికి తగిన ముగింపుని ఇచ్చింది.
విద్వాంసులకు ఘన సన్మానం : త్యాగరాజ ఆరాధనా సంగీతోత్సవం (HTAMF) కార్యక్రమానికి ముఖ్య ఆహ్వానితులుగా విచ్చేసిన కూచిపూడి సరళకుమారి, డాక్టర్ రఘు పర్వేలను మాజీ ఇన్‌కమ్ ట్యాక్స్ కమిషనర్, సీతారామ శర్మ ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న విద్వాంసులను సన్మానించారు. హైదరాబాద్ నగర సాంస్కృతిక రంగానికి తలమానికంగా ఇంత విస్తృత స్థాయికి ఎదిగిన ఈ సంగీతోత్సవాన్ని ఒక తపస్సులా నిర్వహిస్తున్న సంస్కృతి ఫౌండేషన్ వారిని అభినందించారు.
శిల్పారామం వేదికగా హైదరాబాద్ త్యాగరాజ ఆరాధనా సంగీతోత్సవం - ఐదు రోజుల పండగ