Hyderabad Metro Phase 2 Route Map Expansion Finalized :హైదరాబాద్‌లో మెట్రో ఫేజ్ 2 విస్తరణకు కొత్తగా రూట్ మ్యాప్ ఖరారైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశాల మేరకు ఫేజ్ 2 రూట్ మ్యాప్‌ను సిద్దం చేసిన మెట్రో అధికారులు, 70 కిలో మీటర్లు కొత్త మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేలా ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు.
మెట్రో రెండో దశ కొత్త మార్గాలపై అధికారుల మేధోమథనం - చాంద్రాయణగుట్టలో విమానాశ్రయ జంక్షన్!
హైదరాబాద్ నగరంలో ఎక్కువ మంది ప్రయాణికులకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉండేలా, సిటీలోని నలుమూలాలకు అన్ని ప్రాంతాల నుంచి ఎయిర్ పోర్ట్ కనెక్ట్ అయ్యేలా కొత్త ప్రతిపాదిత మార్గాలను(New Proposed Routes) తయారుచేశారు. దీంతో సామాన్యుల నుంచి సంపన్నుల వరకు మెట్రో రైలు ప్రయాణం మరింత చేరువయ్యే అవకాశం ఉందని మెట్రో అధికారులు భావిస్తున్నారు.
Hyderabad Metro Services :నగరంలో హైదరాబాద్ మెట్రో ప్రస్తుతం మూడు కారిడార్లలో 69 కిలోమీటర్లు అందుబాటులో ఉంది. మియాపూర్ నుంచి ఎల్బీ నగర్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్, నాగోల్ నుంచి రాయదుర్గంవరకు అందుబాటులో ఉండి నిత్యం లక్షలాది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తోంది. అయితే ఫేజ్ 2 విస్తరణలో భాగంగా సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్(Jubilee Bus Station) నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న రెండో కారిడార్‌ను చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు వరకు పొడిగించనున్నారు. దాంతోపాటు మరో నాలుగు కారిడార్లలో మెట్రో రైలు మార్గాన్ని సిద్ధం చేయనున్నారు.
కొత్త మెట్రో రైలు రూట్ మ్యాప్ - 70 కి.మీ ప్రతిపాదనలు
క్రమ సంఖ్య | కారిడార్ | ప్రారంభ మెట్రో స్టేషన్ | చివరి మెట్రో స్టేషన్ | మొత్తం దూరం(కిమీ) |
01 | 2 | ఎంజీబీఎస్ | ఫలక్‌నుమా | 5.5 |
02 | ఫలక్‌నుమా | చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్ | 1.5 | |
03 | 4 | నాగోల్ | శంషాబాద్ ఎయిర్‌పోర్టు | 29 |
04 | మైలార్‌దేవ్‌పల్లి | రాజేంద్ర నగర్ వద్ద ప్రతిపాదిత హైకోర్టు | 4 | |
05 | 5 | రాయదుర్గం | అమెరికన్ కాన్సులేట్ | 8 |
06 | 6 | మియాపూర్ | పటాన్చెరు | 14 |
07 | 7 | ఎల్బీ నగర్ | హయత్ నగర్ | 8 |