ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెంపుడు కుక్కను అలా బయటకు తీసుకెళ్తున్నారా? - ఫైన్ కట్టడానికి సిద్ధంగా ఉండండి!

కుక్కే కదా అని ఇంటి బయటకు తీసుకెళ్తే 1000 రూపాయలు ఫైన్ - కమిషర్లకు ఆదేశాలు

Dog Fine In Ghmc
Dog Fine In Hyderabad (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 4 hours ago

DOG Dog Fine In Hyderabad :కుక్కే కదా అని ఇంటి బయటకు తీసుకెళ్లి వెళ్తే అది ఊరికే ఉండకుండా బహిరంగ మలవిసర్జన చేస్తే, దాని యజమానుల జేబుకు చిల్లులు పడ్డట్లే. మున్సిపల్ సిబ్బంది విధించే రూ.1000 జరిమానా కట్టాల్సిందే. ఏమిటీ ఈ విడ్డూరం అనుకుంటున్నారా? మున్సిపల్ చట్టంలోని ఉన్న ఈ నిబంధనను ఇక మీదట రాష్ట్రంలోని అన్ని పట్టణ స్థానిక సంస్థలో కఠినంగా అమలు చేయనున్నారు. ఈ మేరకు మున్సిపల్ శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ టి. కె. శ్రీదేవి జీహెచ్ ఎంసీ మినహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల కమిషర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఆయా జిల్లాల కలెక్టర్లకూ సమాచారం ఇచ్చారు.

పట్టణాల పరిశుభ్రతే దీని ప్రధానోద్దేశం:ఇదే నిబంధన జీహెచ్ ఎంసీ పరిధిలో ఇప్పటికే అమల్లో ఉంది. పట్టణాల్లో పరిసరాల అపరిశుభ్రతకు శునకాల మలవిసర్జన ఓ కారణం. వీధి కుక్కల సంగతి పక్కనపెడితే కనీసం పెంపుడు కుక్కల విషయంలోనైనా వాటి యజమానులు జాగ్రత్తగా ఉండేలా చూడటం మున్సిపల్ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రధాన ఉద్దేశం. దీని ప్రకారం ఏదైనా పెంపుడు శునకం వీధిలో మలవిసర్జన చేస్తే దాని యజమానికి రూ. 1000/- వరకు జరిమానా విధించవచ్చు. ఈ జరిమానా ఆయా మున్సిపాలిటీలను బట్టి మారుతూ ఉంటుంది. ఎవరైనా తమ పెంపుడు శునకాలను రోడ్లమీదకు వదిలేస్తే అవి అక్కడ మలవిసర్జన చేస్తే వాటి యజమానులే దాన్ని తొలగించి శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఒకవేళ శుభ్రం చేయకపోతే రూ. వెయ్యి వరకు చెల్లించాల్సిందే.

ABOUT THE AUTHOR

...view details