Hyderabad Emerging as Gaming Hub: ఒకప్పుడు మైదానంలో వేగంగా కాళ్లు పరిగెత్తేవి. కానీ ఇప్పుడు అంతా చేతివేళ్లతో వేగంగా ఆడటానికి అలవాటు పడ్డుతున్నాయి. చేతిలో ఫోనే మైదానంలా మారిపోయిన ఈ రోజుల్లో, సరదాగా ఆడిన ఆటలు కొందరిని గేమర్గా మారేలా చేస్తున్నాయి. లక్షల మందిని దాటుకుని కొందరు గేమర్లు తమ ప్రతిభతో అబ్బురపరుస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో అలాంటి జాతీయ స్థాయి బాటిల్ గ్రౌండ్ మొబైల్ సిరీస్ పోటీ జరుగుతున్న నేపథ్యంలో ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.
హైదరాబాద్‌ను గేమింగ్‌పరంగానూ హబ్‌గా మార్చేందుకు అనేక అవకాశాలు ఉన్నాయి. గతంలో మొబైల్ ఆటలను విదేశాల్లో అక్కడి థీమ్స్‌తో తయారు చేసేవారు. కానీ, ఇప్పుడు మన నేపథ్యానికి తగ్గ ఆటలు మనవాళ్లతోనే ఇక్కడ డిజైన్ చేయిస్తున్నాయి. ఇందుకోసం డెవలపర్లు, స్టూడియోలు కావాలి. అంకుర సంస్థల ఏర్పాటు చేసేందుకు ఇంక్యుబేటర్లు కావాలి. అందుకోసమే రాయదుర్గంలో భారీ ఎత్తున ఇమేజ్ టవర్ సిద్ధమవుతోంది.
సుమారు 16 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక సౌకర్యాలతో గేమింగ్, యానిమేషన్ కోసం ఈ టవర్‌ను తీర్చిదిద్దుతున్నారు. ఈ టవర్ అందుబాటులోకి వస్తే రాకతో కొత్తగా సుమారు 20వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంటుందని అంచన. గేమింగ్ రంగంలో 2025 నాటికి 2.5 లక్షల ఉద్యోగ అవకాశాలు ఉంటాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
హెచ్చరిక : ఫోన్లో ఈ గేమ్ ఆడిన వారు ఆత్మహత్య చేసుకుంటారు! - మీ పిల్లలు ఆడుతున్నారేమో చూడండి! - What is Blue Whale Challenge
హైటెక్స్‌లో బీజీఐఎస్ పోటీల్లో గేమర్లు: భారత్‌లో గేమింగ్ మార్కెట్ ఏటా 20 శాతం వృద్ధితో 2028 నాటికి 7.5 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని మార్కెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో 15.4 బిలియన్ల భారతీయులు గేమ్స్ డౌన్‌లోడ్ చేసుకున్నారు. మన దేశంలో 568 మిలియన్ల మంది మొబైల్ గేమర్లు ఉన్నారు. మొబైల్ గేమ్ డౌన్‌లోడ్లలో భారత దేశానిదే అగ్రస్థానం. చైనా తర్వాత అత్యధికంగా మొబైల్ గేమర్లు భారత్‌లోనే ఉన్నారు. 2021లో 1.5 లక్షలున్న ఈ స్పోర్ట్స్ గేమర్లు 2022 నాటికి 6 లక్షలకు చేరుకున్నారు. 2027 నాటికి 1.5 మిలియన్లకు చేరుకుంటారని ఓ అంచనా.
"మా సంస్థ భారత్‌లో 2021లో అడుగు పెట్టింది. 160 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాం. వచ్చే రెండు మూడేళ్లలో మరో 150 కోట్లను భారత్‌లో పెట్టుబడి పెట్టనున్నట్లు గత ఆగస్టులో ప్రకటించాం. ఇటీవల క్రాఫ్టన్ ఇండియా గేమింగ్ ఇక్యుబేటర్ని ఏర్పాటు చేశాం. ఇటీవల బుల్లెట్ ఎకో ఇండియా, గరుగ సాగా భారత్ నేపథ్యం ఉన్న ఇతివృత్తంతో గేమ్స్ విడుదల చేశాం. దానికి మంచి స్పందన వచ్చింది." -తరుణ్ పాఠక్, అసోసియేట్ డైరెక్టర్, ఈస్పోర్ట్స్, క్రాఫ్టన్
నేను కొన్ని గేమ్స్ ఆడిన తర్వాత ఇటువైపుగా ఆసక్తి ఏర్పడింది. ఆడేటప్పుడు ఉత్సాహం, వ్యూహాలతో పాటు విభిన్నమైన ప్రపంచంలో లీనమయ్యే అనుభూతి కలుగుతుంది. అందులో భాగంగానే నాకు గేమింగ్ అభిరుచిగా మారింది. ఈ రంగం కెరీర్ అంటే మొదట మా తల్లిదండ్రులు కంగారు పడ్డారు. పరిశ్రమ పెరుగుతున్న తీరు, ఈ స్పోర్ట్స్, గేమ్ డెవలప్‌మెంట్ పాత్రల పెరుగుదలతో వస్తున్న అవకాశాలను చూసి ఇప్పుడు వారు అర్థం చేసుకున్నారని ఓ గేమ్ డెవలపర్ వెల్లడించారు.
పే త్రూ పేరెంట్ - ఇక మీ పిల్లలు డబ్బు వృథా చేయరు