Husband Tonsures Wifes Head :ప్రేమించి పెళ్లి చేసుకుని భార్యకు భర్త శిరోముండనం చేశాడు ఓ వ్యక్తి. ఈ నెల 2న తూర్పుగోదావరి జిల్లా ఈ ఘటన చోటు చేసుకుంది. తనపై కక్ష పెంచుకున్న వైఎస్సార్సీపీ నేతలు, తన భర్త చేత ఈ దారుణాన్ని చేయించారని బాధితురాలు ఆరోపించింది. తన ఆవేదన వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమాల్లో వీడియో విడుదల చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే,
Victim Allegations on YSRCP Leaders :ఓ అధ్యాపకుడిపై అత్యాచారం కేసు పెడితేనే తనకు న్యాయం చేస్తామని, తన భర్తతో కాపురం ఉంటుందని కొంతమంది వైఎస్సార్సీపీ నాయకులు రెండు సంవత్సరాల క్రితం ఒత్తిడి తీసుకొచ్చారని, దానికి అంగీకరించకపోవడంతో కక్ష పెంచుకుని తన భర్తతో శిరోముండన దురాగతానికి పాల్పడ్డారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం పెదకొండేపూడిలో ఈ నెల 2న భర్త అభిరామ్ చేతిలో శిరోముండనానికి గురైన షేక్ ఆషా తన ఆవేదన వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వీడియో వైరల్ అయ్యింది.
రెండో పెళ్లికి అడ్డుపడిన భార్య - శిరోముండనం చేసిన భర్త
వైఎస్సార్సీపీ నేతలను వదలను - న్యాయ పోరాటం చేస్తా : "చినకొండేపూడికి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు నన్ను పిచ్చి దాన్ని చేసి నా భర్తతోనే చంపేయాలనుకున్నారు. భర్త, అత్తమామలను వారే రెచ్చగొట్టారు. నా భర్త ఆస్తి నాకు, నా ఐదు సంవత్సరాల బిడ్డకు దక్కకుండా చేసింది కూడా ఇద్దరు వైఎస్సార్సీపీ నాయకులే. నా భర్త అభిరామ్ నాపై దాడి చేసే సమయంలో అత్త మామలతో పాటు ఆడపడచు చినకొండేపూడిలోని వైసీపీ నాయకుడి ఇంట్లోనే ఉన్నారు. ఒకచేత్తో కత్తి, మరోచేత్తో ట్రిమ్మర్‌తో వచ్చిన భర్త రాంబాబు ముందుగా నన్ను ఇంట్లో పెడరెక్కలు విరిచి కట్టేశాడు. వైసీపీ నాయకుల అండ ఉంది నిన్ను చంపేస్తే పది రోజుల్లోనే జైలు నుంచి బయటకు తీసుకొస్తారు.
ప్రజాప్రతినిధి తల్లిని కూడా వదలకుండా అల్లరి చేస్తున్నావు. చచ్చిపో అంటూ ముందుగా కత్తి బయటకు తీశాడు. నేను కేకలు వేయడంతో ఒక వ్యక్తి నా భర్తను నిలదీశాడు. దీంతో నేను ఏమైనా చేసుకుంటానంటూ కత్తి లోపల పెట్టి ట్రిమ్మర్‌తో శిరోముండనం చేశాడు. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స నిమిత్తం పోలీసులు నన్న పెడితే అక్కడికి సదరు వైసీపీ నాయకుల అనుచర వర్గం వచ్చి పేర్లు బయటపెడితే ప్రాణాలకు ముప్పే అని హెచ్చరించారు. వైసీపీ పెద్దల పేర్లు బయటపెడతాననే భయంతో ఆస్పత్రి నుంచి స్టేట్‌హోం (State Home)కు తరలించారు. కోర్టుకు తీసుకెళ్లే సమయంలో కూడా సొంత వాహనాలు ఏర్పాటు చేశారు. మీడియాతో కూడా మాట్లాడనివ్వలేదు. కుట్రకు పాల్పడిన వైసీపీ నాయకులను వదిలేది లేదు. దీనిపై న్యాయపోరాటం చేస్తా"నని బాధితురాలు వీడియోలో పేర్కొన్నారు.
సీతానగరం శిరోముండనం కేసు - నిందితుల క్వాష్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు