తెలంగాణ

telangana

ETV Bharat / state

'నీవు లేని జీవితం నాకొద్దు' - బతుకైనా చావైనా నీతోనే - భర్త మృతితో ఆత్మహత్య చేసుకున్న భార్య - WIFE SUICIDE DUE TO HUSBAND DEATH

ఇద్దరు ప్రేమికుల విషాద గాథ - రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన భర్త - అది తట్టుకోలేని భార్య కూడా మృతి

Wife Committed Suicide After Husband Death
Wife Committed Suicide After Husband Death (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 15, 2024, 7:05 PM IST

Wife Committed Suicide After Husband Death : ప్రేమతో వారిద్దరి మనసులు కలిశాయి. వివాహ బంధంతో ఒక్కటయ్యారు. జీవితాంతం ఒకరికొకరు కష్టసుఖాల్లో తోడునీడగా ఉండాలని భావించారు. కానీ ఆ ఇద్దరి ప్రేమికుల అన్యోన్యతను చూడలేకపోయిందేమో విధి. ఆనందంగా సాగిపోతున్న దంపతుల బంధాన్ని రోడ్డు ప్రమాద రూపంలో చిదిమేసింది. భార్య నుంచి భర్తను దూరం చేసింది. ఈ వార్త విన్న ఆమె గుండె తట్టుకోలేకపోయింది. తన భర్త లేని ఈ భూ ప్రపంచంపై నేనుండలేనంటూ తానూ ప్రాణాలు విడిచింది. ఈ హృదయ విదారక ఘటన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే,

రోడ్డు ప్రమాదంలో భర్త మృతి : శ్రీకాకుళం జిల్లాలోని లావేరు మండలం కేశవరాయనపాలెం గ్రామానికి చెందిన నాయిని చంటికి ఎచ్చెర్ల మండలంలోని సంతసీతారాంపురం పంచాయతీ నందిగాంకు చెందిన భవానీతో పరిచయం ఏర్పడింది. కొద్ది రోజులకు ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఏడాదిన్నర కిందట వివాహ బంధంతో ఇరువురు ఒక్కటయ్యారు. ఆ దంపతులు ఇద్దరూ కోటి ఆశలతో నూతన జీవితాన్ని ప్రారంభించారు. ఎంతో అన్యోన్యతతో ప్రేమా నురాగాలతో మెలుగుతున్నారు. కష్టసుఖాల్లో ఒకరిఒకరు తోడుగా ఉంటూ వారి జీవితం సాగింది. చంటి దసరా రోజున ఉదయం టిఫిన్ తీసుకొచ్చేందుకు బైక్​పై బయలు దేరగా మురపాక సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం విధితమే.

భార్య ఆత్మహత్య : భర్త నాయిని చంటి మరణ వార్త విన్న అతని భార్య భవానీ ఆదివారం ఉదయం విషపదార్థం సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స కోసం హుటాహుటిన శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత మృతి చెందింది. దీంతో ఒక్కసారిగా కేశవరాయనపాలెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వైద్యులు భవాని మృతదేహానికి శవపరీక్ష నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు వేరు వేరుగా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఆన్​లైన్ పేమెంట్​తో మొదలైన లవ్​స్టోరీ - భర్త, పిల్లలను వదిలి లండన్​ నుంచి వచ్చేలా చేసింది

వాషింగ్‌ మెషిన్‌ బాగు చేయించలేదని - ఫ్యాన్​కు ఉరివేసుకుని భార్య ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details