ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : 11 hours ago

Updated : 11 hours ago

ETV Bharat / state

మామిడి చెట్లు తొలగిస్తుండగా బయటపడిన భారీ సొరంగం - చూసేందుకు ఎగబడుతున్న స్థానికులు - Huge Tunnel In Mango Farm

Huge Tunnel Discovered in Mango Farm: మామిడి చెట్లు తొలగిస్తుండగా ఓ సొరంగం బయట పడింది. ఈ ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఈ సొరంగాన్ని చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఆ సొరంగం బెలూం గుహలను పోలి ఉందని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

huge_tunnel_in_mango_farm
huge_tunnel_in_mango_farm (ETV Bharat)

Huge Tunnel Discovered in Mango Farm :నంద్యాల జిల్లాలో పంట పొలంలో ఓ సొరంగం బయటపడింది. బేతంచర్ల మండలం ఎంబాయి గ్రామానికి చెందిన రైతు శేఖర్ తన పొలంలో మామిడి పంటను సాగు చేశారు. ప్రస్తుతం మామిడి చెట్లు తొలగించి వేరే పంటలు సాగు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఓ చెట్టును తొలగిస్తుండగా సొరంగం బయట పడింది. ఆ సొరంగం బెలూం గుహలను పోలి ఉంది. అంతా చీకటిగా ఉండటంతో లోపలికి వెళ్లేందుకు స్థానికులు భయపడుతున్నారు. ఈ సొరంగాన్ని చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున ఆ పంట పొలంలోకి చేరుకుంటున్నారు.

మామిడి చెట్లు తొలగిస్తుండగా బయటపడిన భారీ సొరంగం - చూసేందుకు ఎగబడుతున్న స్థానికులు (ETV Bharat)
Last Updated : 11 hours ago

ABOUT THE AUTHOR

...view details