ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చిరు వ్యాపారులపై బుడమేరు ఎఫెక్ట్​ - పరిహారంతో పాటు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని వేడుకోలు - Flood Damage to Businessmen in AP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 11, 2024, 8:01 AM IST

Updated : Sep 11, 2024, 9:56 AM IST

Flood Damage to Businessmen in AP: బుడమేరు ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని చిరు వ్యాపారుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అకస్మాత్తుగా వచ్చిన వరదలతో అటు కుటుంబాన్ని ఇటు వ్యాపార సమాగ్రిని కాపాడుకోలేక నిస్సహాయస్థితిలోకి వెళ్లిపోయారు. వరదలు తగ్గుముఖం పట్టడంతో తమ దుకాణాల పరిస్థితిని చూసి చిన్న చిన్న వ్యాపారులు కన్నీరు పెట్టుకుంటున్నారు.

Flood Damage to Businessmen in AP
Flood Damage to Businessmen in AP (ETV Bharat)

బుడమేరు వరదతో చిరువ్యాపారులకు తీవ్ర నష్టం (ETV Bharat)

Flood Damage to Businessmen in AP :విజయవాడలో 10 రోజుల పాటు విలయాన్ని సృష్టించిన వరద మెల్లగా తగ్గడంతో ప్రజలు ఉపిరి పీల్చుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వరద ప్రభావం చూపడంతో అన్నిరంగాల ప్రజలు నష్టపోయారు. ముఖ్యంగా చిరు వ్యాపారులు దారుణంగా దెబ్బతిన్నారు. కిరాణా దుకాణాలు, ఫర్నిచర్ షాపులు, లామినేషన్ షాపులు, ఫోటో స్టూడియోలు, బియ్యం దుకాణాలు, ప్లేవుడ్, కప్ బోర్డులు అమర్చే దుకాణాలు, హార్డ్ వేర్ దుకాణాలు, పాన్ షాపులుఇలా ఒకటేమిటి చిరు వ్యాపారాలన్నీ వరద దెబ్బకు విలవిల్లాడాయి.

ఎక్కడి సామాన్లు అక్కడే వరదలకు నానిపోయాయి. వరదలు వచ్చాక దుకాణం లోపలికి వెళ్లే అవకాశం లేకపోవడంతో వస్తువులన్నీ పాడైపోయాయి. వరద నీటికి నానిపోయి వస్తువులు, పుస్తకాలు చివికిపోయాయి. అజిత్ సింగ్ నగర్, పైపుల రోడ్డు, ప్రకాశ్ నగర్, కండ్రిగ, పాయకాపురం, వాంబే కాలనీ, శాంతినగర్, స్వాతి సెంటర్, సితార సెంటర్ ఇలా అన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తడిసిపోయిన, నానిపోయిన ఉపకరణాలు, మిషన్లు చూసి వారు లబోదిబోమంటున్నారు.

ప్రకాశం బ్యారేజీ వద్ద పడవలను వెలికి తీసేందుకు ప్లాన్‌-బి - నేడు అమలు - REMOVAL OF BOATS AT PRAKASAM

10 నుంచి 15 లక్షల వరకు నష్టం : సింగ్ నగర్, పైపుల రోడ్డులో చిరువ్యాపారులది మరింత దయనీయమైన పరిస్థితి. దుకాణాలతో పాటు వీరి ఇళ్లు కూడా ముంపు బారిన పడటంతో వీరిపై దెబ్బ మీద దెబ్బ పడింది. రెండూ నష్టపోవడంతో వీరంతా రోడ్డుపైకి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి నుంచి ఎలా గట్టెక్కాలో తెలియక వీరు ఆందోళన చెందుతున్నారు. ఒక్కొక్కరు 10 నుంచి 15 లక్షల వరకు నష్టపోయారు. అసలే నెలవారీ రుణ వాయిదాలు కట్టుకోలేక ఇబ్బందులు పడుతున్న తమకు వరద పోటు జీవన్మరణ సమస్యగా మారిందని వాపోతున్నారు. తమతో పాటు దుకాణాల్లో పని చేసే కూలీల పరిస్థితి అయోమయంగా మారిందని చిరు వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు.

వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని వేడుకోలు : వరద దెబ్బతో సమస్తం కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని చిరు వ్యాపారులు కోరుతున్నారు. నష్ట పరిహారంతో పాటు వడ్డీ లేని రుణాలు ఇచ్చి తాము మళ్లీ నిలదొక్కుకునేలా ప్రభుత్వం తోడ్పాటు అందించాలని వీరు వేడుకుంటున్నారు.

వరద భయం నుంచి తేరుకుంటున్న విజయవాడ - Vijayawada Recover From Flood

బుడమేరు గండి ప్రాంతంలో చంద్రబాబు- వైసీపీ నేరస్థుల రాజకీయ ముసుగు తొలగిస్తానంటూ హెచ్చరిక - CM Chandrababu Inspected Budameru

Last Updated : Sep 11, 2024, 9:56 AM IST

ABOUT THE AUTHOR

...view details