ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరద బాధితులకు ఆపన్న హస్తం - భాష్యం 4 కోట్లు, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ 3 కోట్లు - HUGE DONATIONS TO AP CMRF - HUGE DONATIONS TO AP CMRF

HUGE DONATIONS TO AP CMRF: వరదలతో నిర్వాసితులైన బాధితులకు ఆపన్న హస్తం అందించేందుకు దాతలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును, మంత్రి లోకేశ్​ను కలిసి పలువురు విరాళాలు అందజేశారు. వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకోవ‌డానికి ముందుకొచ్చిన దాత‌ల‌ను సీఎం అభినందించారు.

DONATIONS TO AP CMRF
DONATIONS TO AP CMRF (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 13, 2024, 9:38 PM IST

HUGE DONATIONS TO AP CMRF: వ‌ర‌దల వల్ల నిరాశ్రయులైన బాధితుల‌ను ఆదుకోవ‌డానికి తాముసైతం అంటూ పలువురు దాత‌లు ముందుకొచ్చి ప్రభుత్వానికి విరాళాలు అంద‌జేశారు. అమరావతి స‌చివాల‌యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి చెక్కుల‌ను అందించారు. భాష్యం పేరమ్మ ఛారిటబుల్ ట్రస్ట్ తరపున భాష్యం రామకృష్ణ రూ. 4 కోట్లు, ఎస్ఆర్ఎం యూనివ‌ర్సిటీ డాక్టర్ పి. స‌త్యనారాయ‌ణ‌ రూ.3 కోట్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైస్ మిల్లర్ల అసోసియేష‌న్ రూ. 2 కోట్లు, బెకామ్ ఇన్ ఫ్రా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత బొల్లినేని కృష్ణమోహన్ రూ. 1.25 కోట్లు, తులసీ సీడ్స్ ప్రవేటు లిమిటెడ్ అధినేత తులసీ రామచంద్ర ప్రభు రూ.1 కోటి, ఆ సంస్థ ఉద్యోగులు ఒక రోజు వేతనం విరాళంగా ఇచ్చిన 5 లక్షలా 43 వేల రూపాయలు అందించారు.

సీఎం సహాయనిధికి మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు 50లక్షల రూపాయలు విరాళం అందించారు. ఈ మేరకు సీఎంను కలిసి కంభంపాటి చెక్కు అందచేశారు. తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ నేతృత్వంలో ప్రజలు, దాతల నుంచి సేకరించిన కోటి 63 లక్షల రూపాయల చెక్కును మంత్రి లోకేష్‌కు ఇచ్చారు. ఎన్.జీ.రంగా యూనివర్సిటీ టీచింగ్, నాన్ టీచింగ్, రిటైర్డ్ ఉద్యోగులు 50 లక్షలు, డెక్కన్ ఫైన్ కెమికల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ కె.వి.ఎల్పీ.రాజు, ప్రెసిడెంట్ ఏ.ఎన్.వీరారెడ్డి 50 లక్షలు విరాళంగా ఇచ్చారు.

సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఛైర్మన్ ఏఎస్ఎన్ ప్రసాద్ 32 లక్షల 49 వేలు, ఎస్ఆర్.కెఆర్ ఇంజనీరింగ్ అండ్ ప్రసాద్ కన్ స్ట్రక్షన్స్ ప్రసాద రాజు 25 లక్షలు, తణుకు మాజీ ఎమ్మెల్యే వైటి రాజా కుమారుడు యలమర్తి అవినాష్ 20 లక్షలు, జయలక్ష్మీ ఫెర్టిలైజర్స్ 20 లక్షలు, సిరి సీడ్స్ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ అరిమిల్లి వివేకానంద 10 లక్షలు, చుండూరి మ‌ధుసూధ‌న్ రావ్‌ 10 ల‌క్షలు అందజేశారు.

సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు విరాళాల వెల్లువ - దాతలను అభినందించిన చంద్రబాబు - HUGE DONATIONS TO CMRF AP

శ్రీకాంత్ ఫ్లౌర్ ఇండ‌స్ట్రీస్ శ్రీకాంత్‌ 5 ల‌క్షలు, ఏలూరు రామ‌చంద్రా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌ కె. సాయి రోహిత్‌ 5 ల‌క్షలు, మీ సేవా ప్రతినిధులు 5 లక్షలు, ఎక్స్ సైనిక్ వెల్పేర్ అసోసియేష‌న్ వెంక‌ట‌రెడ్డి 3 ల‌క్షల 30 వేలు, డాక్టర్ శివ‌ప్రసాద్ హార్ట్ క్లినిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పి.రోసీ సిరీష్‌ 3 ల‌క్షల రూపాయల చెక్‌ను చంద్రబాబుకు అందించారు.

కనకదుర్గా ఫైనాన్స్ లిమిటెడ్ 3 లక్షలు, మన్నవ సుబ్బారావు తల్లి సీపీఎం మాజీ ఎమ్మెల్యే పుత్తుంబాక భారతి 3 బంగారు గాజులు, అసోసియేష‌న్ ఫ‌ర్ ఏపీ పెన్షన‌ర్స్ సెటిల్డ్ ఎట్ హైద‌రాబాద్ టీ.ఎం.బీ.బుచ్చిరాజు 2 ల‌క్షలు, ఏటుకూరు మాజీ సర్పంచి ఉగ్గిరాల సీతారామయ్య 2 లక్షలు, ఎస్. ల‌క్ష్మీనారాయ‌ణ 2 ల‌క్షలు, డి. ద‌శ‌ర‌థ రామానాయుడు 1ల‌క్షా 23 వేలు, న‌ర‌సింహా రెడ్డి 1ల‌క్షా 20 వేలు, కేపీఆర్ రాజేశ్వరీ 1 ల‌క్షా 11వేలు, తెనాలి వాక‌ర్స్ క్లబ్ 1 ల‌క్షా 15 వేల రూపాయలు విరాళంగా ఇచ్చారు. వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకోవ‌డానికి ముందుకొచ్చిన దాత‌ల‌ను సీఎం అభినందించారు.

వరద బాధితులకు మేమున్నాం అంటూ విరాళాల వెల్లువ - వారందరికీ లోకేశ్ కృతజ్ఞతలు - Donations To AP Flood Victims

ABOUT THE AUTHOR

...view details