తిరుమల ఆలయంలో కొనసాగుతున్న రద్దీ- 'అప్పటివరకూ వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు' (ETV Bharat) Huge Devotees Rush At Tirumala:తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. వేసవి సెలవులు ముగింపు దశకు చేరుకోవడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. ఎస్‍ఎస్‍డీ టోకెన్లు లేకుండా క్యూలైన్లలో వచ్చిన భక్తులు సర్వదర్శనం కోసం నిరీక్షిస్తున్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు గంటలపాటు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
3 కిలోమీటర్ల మేర క్యూలైన్లలో బారులు తీరిన భక్తులు:ముఖ్యంగా శుక్ర, శని, ఆదివారాల్లో సామాన్య భక్తులు స్వామివారిని దర్శించుకోవాలంటే 30 నుంచి 40 గంటల సమయం క్యూలైన్‌లలో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో శుక్రవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు, నారాయణగిరి ఉద్యానవనాల్లో నిర్మించిన షెడ్లు భక్తులతో నిండిపోయాయి. దీంతో భక్తులు రింగు రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు సుమారు 3 కిలోమీటర్ల మేర క్యూలైన్లలో బారులు తీరారు. క్యూలైన్‌లలోకి ప్రవేశించే పురుషులతోపాటు మహిళలు, వృద్ధులు, వికలాంగులు సుదీర్ఘ సమయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉండక తప్పడం లేదు.
ఏపీలో కొత్త ముఖ్యమంత్రితో సత్సంబంధాలు నెలకొల్పుతాం - శ్రీవారి సన్నిధిలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య - CM REVANTH VISITED TIRUMALA TODAY
వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు:శ్రీవారి దర్శనం కోసం దాదాపు 24 గంటలు, అంతకంటే ఎక్కువ కూడా సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో క్యూ లైన్లలో ఉన్న భక్తులకు అధికారులు తాగునీరు, అన్నప్రసాదాలు, పాలు అందిస్తున్నారు. శ్రీవారి దర్శనానికి టోకెన్లు లేని భక్తులకు ఆలయ అధికారులు 24గంటల సమయం కేటాయించారు. బాటగంగమ్మ ఆలయం నుంచి క్యూలైన్లలోకి అనుమతినిచ్చారు. వీరికి శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది. ఈ రద్దీ వారాంతం వరకు కొనసాగే అవకాశం ఉంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని, సామాన్యులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు వీఐపీ బ్రేక్ దర్శనాన్ని రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. శుక్ర, శని, ఆదివారాలలో జూన్ 30 వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది.
శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్ - మళ్లీ ఆ సేవలు ప్రారంభం! - చాలా సులభంగానే దర్శనం! - TTD Accept VIP Break Darshan