Huge Demand For TG Fancy Number Plates in Telangana : రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ టీఎస్ నుంచి టీజీకి మార్చే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ ఫ్యాన్సీ నంబర్ల కోసం రవాణా శాఖ అధికారులు వేలం ప్రారంభించారు. దీంతో వాహనదారులు అధిక మొత్తంలో వాటిని పాడుకున్నారు. ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ ప్రధాన కార్యాలయంలోని జరిగిన కార్యక్రమంలో ఒక్కరోజే ఏకంగా సూమారు రూ.44 లక్షల ఆదాయం సమకూరింది. కొంత మంది పాత వాహనాల నంబర్లకు అప్డేట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఫ్యాన్సీ నంబర్లకు డిమాండ్ భారీగా పెరిగిపోతుంది.
ఇవాళ ఒక్కరోజే ప్యాన్సీ నంబర్లకు వచ్చిన నగదు వివరాలు:
క్రమ సంఖ్య | ప్యాన్సీ నంబర్ ప్లేట్ | వచ్చిన నగదు(రూపాయల్లో) |
1 | టీజీ 09 9999 | 25,50,002 |
2 | టీజీ 09 ఏ 0006 | 2,76,000 |
3 | టీజీ 09 ఏ 0005 | 1,80,200 |
4 | టీజీ 09 ఏ 0019 | 1,20,019 |
5 | టీజీ 09 9799 | 1,16,111 |
6 | టీజీ 09 ఏ 0009 | 1,10,009 |
Fancy Number Plates in Telangana : పైన తెలిపిన ఫ్యాన్సీ నంబర్లతో పాటు ఇతర నంబర్లకు వచ్చిన ఆదాయం మొత్తం రూ.43,70,284లు వచ్చిందని రవాణా శాఖ అధికారి రమేష్ తెలిపారు. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నా వారికి టీజీ నంబర్ ప్లేట్ లభిస్తోందని పేర్కొన్నారు. ఫిబ్రవరి నెలలో టీఎస్‌ను టీజీగా కాంగ్రెస్ ప్రభుత్వం మార్చింది. పాత వాహనాలకు టీఎస్ పేరు మీదే కొనసాగుతాయని మోటారు వాహన యూనియన్ నేతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రవాణా శాఖ అధికారులు వెల్లడించారు.