తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణ ఎంసెట్ : తొలి విడత సీట్ల కేటాయింపు - ఈ లింక్​పై క్లిక్ ​చేసి చెక్​ చేసుకోండి! - TG EAPCET Seat Allotment 2024 - TG EAPCET SEAT ALLOTMENT 2024

TG EAPCET Seat Allotment 2024: తెలంగాణలో ఇంజినీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఫస్ట్ ఫేజ్​లో వెబ్ ఆప్షన్లు పూర్తి చేసిన విద్యార్థులకు ఈరోజున(జులై 19) సీట్లను కేటాయిస్తున్నారు. మరి అది ఎలా చెక్​ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

TG EAPCET Seat Allotment 2024
TG EAPCET Seat Allotment 2024 (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 19, 2024, 5:24 PM IST

TG EAPCET First Phase Seat Allotment 2024: తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో బీటెక్‌/బీఈ సీట్ల భర్తీకి ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి విడతలో భాగంగా ఇప్పటికే ధ్రువపత్రాల పరిశీలనతో పాటు వెబ్​ ఆప్షన్లు ఎంచుకున్న వారికి శుక్రవారం(జులై 19) రోజున సీట్లను కేటాయిస్తున్నారు. విద్యార్థులు తాము సీట్లు పొందే కాలేజీ వివరాలను అధికార వెబ్ సైట్​ ద్వారా తెలుసుకోవచ్చు. మరి అది ఎలా తెలుసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో బీటెక్‌/బీఈ సీట్ల భర్తీకి.. జులై 4 నుంచి ఇంజినీరింగ్‌ తొలి విడత ప్రక్రియ ప్రారంభం అయ్యింది. జులై 6 నుంచి 13 వరకు తొలి విడత సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌, జులై 8 నుంచి 15 వరకు తొలి విడత వెబ్‌ ఆప్షన్లకు అవకాశం ఇచ్చారు. తాజాగా నేడు (జులై 19న) ఇంజినీరింగ్‌ తొలి విడత సీట్లు కేటాయిస్తున్నారు.

తొలి విడత సీట్ల కేటాయింపు ఇలా చెక్ చేసుకోండి:

  • ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం వెబ్ ఆప్షన్లు ఎంచుకున్న అభ్యర్థులు ముందుగా అధికార వెబ్​సైట్​ https://eapcet.tsche.ac.in/ వెబ్ సైట్​లోకి వెళ్లాలి.
  • స్క్రీన్​ మీద కనిపించే ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్​మెంట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • అక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్​టికెట్ తో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.
  • ఆ తర్వాత సబ్మిట్ బటన్​పై క్లిక్​ చేస్తే.. మీరు సీటు పొందిన కాలేజీ వివరాలు డిస్ ప్లే అవుతాయి.
  • ఆ తర్వాత ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

ఆరోజు నుంచే సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్:జులై 19న తొలి విడత సీట్ల అలాట్​మెంట్​ ప్రక్రియ తర్వాత.. జులై 26వ తేదీ నుంచి ఇంజినీరింగ్‌ సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియ షురూ కానుంది. జులై 27న రెండో విడత కౌన్సెలింగ్‌ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ చేపడతారు. జులై 27, 28 తేదీల్లో రెండో విడత వెబ్‌ ఆప్షన్లకు అవకాశం ఇస్తారు. ఇక జులై 31వ తేదీన రెండో విడత సీట్ల కేటాయింపు ఉంటుందని అధికారులు తెలిపారు.

మూడో విడత అప్పుడే:జులై 31న ఇంజినీరింగ్‌ రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి చేసి ఆ తర్వాత ఆగస్టు 8 నుంచి మూడో విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభిస్తారు. ఆగస్టు 9వ తేదీన సర్టిఫికెట్ల వెరిఫికేషన్​ ఉంటుంది. ఆగస్టు 9, 10 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. ఆగస్టు 13న సీట్ల కేటాయింపు ఉంటుంది.

ఇంటర్నల్​ స్లైడింగ్​ అప్పుడే: ఇక ఆగస్టు 21 నుంచి కన్వీనర్‌ కోటా ఇంటర్నల్‌ స్లైడింగ్‌కు ఛాన్స్ ఉంటుందని అధికారులు వివరించారు. ఆగస్టు 22 వెబ్‌ ఆప్షన్ల ఫ్రీజింగ్​తో పాటు 26వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. ఆగస్టు 27, 28 తేదీల్లో కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 28న స్పాట్‌ అడ్మిషన్ల గైడ్స్ లైన్స్ విడుదల కానున్నాయి.

ఇవీ చదవండి:

అసిస్టెంట్​ మేనేజర్​ ఉద్యోగాలు- లక్షా40వేలు జీతం!- పూర్తి వివరాలివే

ఏజ్​ బార్ అవుతోందని భయంగా ఉందా? ఈ స్ట్రాటజీ పాటిస్తే - కోరుకున్న ఉద్యోగం గ్యారెంటీ!

ABOUT THE AUTHOR

...view details