How to Avoid Online Shopping Frauds : చాలా మంది కొనుగోలుదారులు కొన్ని రోజులుగా వెయిట్ చేస్తున్న దసరా పండుగ సీజన్ వచ్చేసింది. దీంతో ఈ- కామర్స్ సంస్థలు అన్ని చాలా బిజీబిజీగా కస్టమర్స్ కొనుగోళ్లతో గడిపేస్తున్నాయి. ఎందుకంటే ఈ-మార్కెట్లో వస్తువు ధర మార్కెట్లో ఉన్న రేటు కంటే భారీ తగ్గింపు ధరలకు ఇస్తుంటారు. ఎక్కువ మొత్తంలో వస్తువులు ఉండటం, కొనుగోలుదారులు అదే స్థాయిలో ఉండటంతో కొన్ని ఈ-కామర్స్ సంస్థలు ముందుగానే సేల్ విషయంలో వారికి ఈ కామర్స్ యాప్స్ నుంచి నోటిఫికేషన్ పంపిస్తాయి. ఇదే విషయాన్ని ఆసరాగా తీసుకొని సైబర్ నేరగాళ్లు గోల్‌మాల్‌కు పాల్పడుతున్నారు. ఒక వస్తువు పరిమితంగానే ఉందని, దాన్ని వెంటనే కొనుగోలు చేయకపోతే ఆఫర్ ఉండదని చెబుతూ మెయిల్స్, మెసేజ్‌లు పంపిస్తారు. ఇలాంటి వాటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని బ్యాంక్‌బజార్.కామ్ కొన్ని సూచనలు చేస్తోంది.
సైబర్ నేరగాళ్ల పని : పండుగ వచ్చిందంటే చాలు దాదాపు 10 రోజుల నుంచి ఆన్‌లైన్ షాపింగ్స్ సందడే కనిపిస్తుంది. మార్కెట్ రేటు కన్నా అతి తక్కువ ధరలకే వస్తువులను అందిస్తామని చెబుతూ ఈ-కామర్స్ సంస్థలు కస్టమర్స్‌ను ఆకట్టుకునే పనిలో పడతాయి. ఈ భారీ డిస్కౌంట్లను ఆసరాగా తీసుకొని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇవి కూడా భారీ తగ్గింపు ధరలే అని భ్రమపడేలా మనకు ఇ-మెయిల్, సందేశాలు ఫోన్లకు వస్తుంటాయి.
ఉదాహరణకు చెప్పుకోవాలంటే సతీశ్‌కు ఒక ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ నుంచి ప్రత్యేక తగ్గింపు ధర ఇస్తున్నట్లుగా ఇ-మెయిల్ వచ్చింది. కానీ ఆ ఆఫర్ కేవలం రెండు గంటలే అందుబాటులో ఉంటుందని, వస్తువులు సైతం పరిమితంగానే ఉన్నాయనేది దాని సారాంశం. ఈ సమాచారం చూసిన సతీశ్ మంచి అవకాశం ఎందుకు మిస్ చేసుకోవాలి. పైగా భారీ తగ్గింపు ధరలు ఉన్నాయని భావిస్తాడు. వెంటనే వచ్చిన సందేశం మెసేజ్ లింక్ ఓపెన్ చేసి, తన క్రెడిట్ కార్డు వివరాలు అన్నీ ఇచ్చేస్తాడు. కార్డు నుంచి డబ్బులు పోయిన ఎలాంటి కన్ఫర్మేషన్ మెసేజ్ రాలేదు. అప్పుడే సతీశ్‌కు బాగా తెలిసింది. తాను మోసపోయానని, ఇలాంటి సంస్థలు ఏవీ ఆ ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఇవ్వడం లేదని.