How To Apply NTR Bharosa Pension Scheme 2024: ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలో వచ్చిన తర్వాత పింఛన్లు పెంచి అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు నేడు రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, వివిధ రకాల చేతి వృత్తిదారులకు పింఛన్లు స్వయంగా వారి ఇంటి వద్దే పంపిణి చేస్తున్నారు. రాష్ట్రంలో ఇంకా కొంత మంది అర్హతలు ఉన్నప్పటికీ పింఛన్లు పొందడం లేదు. ప్రభుత్వం ఎవరికి పింఛన్లు అందిస్తోంది..? అర్హులెవరూ?, ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అనే విషయాలు మీకోసం..
అర్హులు ఎవరంటే?
- వృద్ధులు
- వితంతువులు
- నేత కార్మికులు
- తోలు కార్మికులు
- చెప్పులు కుట్టేవారు
- మత్స్యకారులు
- ఒంటరి మహిళలు
- హిజ్రాలు (లింగమార్పిడి వ్యక్తులు)
- హెచ్‌ఐవీ బాధితులు
- డ్రమ్మర్లు
- చేతివృత్తులవారు
ఎవరికి ఎంత పెన్షన్?
- సాధారణ లబ్ధిదారులు: నెలకు రూ. 4,000
- వికలాంగులు: నెలకు రూ. 6,000
- పూర్తిగా వికలాంగులు: నెలకు రూ. 15,000
- దీర్ఘకాలిక వ్యాధులు (ఉదా. కిడ్నీ, తలసేమియా): నెలకు రూ. 10,000
సంపద సృష్టిస్తాం - పెంచిన ఆదాయం పంచుతాం: సీఎం చంద్రబాబు
ఆఫ్లైన్లో అప్లై చేసుకోండిలా
1. పింఛన్లకు సంబంధించి ప్రభుత్వ అధికారిక పోర్టల్ https://sspensions.ap.gov.in/SSP/Home/Indexని సందర్శించండి .
2. ఆ పోర్టల్లో NTR భరోసా పెన్షన్ యోజన దరఖాస్తు ఫారమ్ ఎంపిక చేసుకుని డౌన్‌లోడ్ చేయండి.
3. ఆ ఫారమ్‌నుని ప్రింట్ తీసుకుని మీ పూర్తి వివరాలు నింపండి. పేరు, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్ మొదలైన అన్ని అవసరమైన వివరాలను నింపాలి.
4. చిరునామా రుజువు, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్ వంటి అవసరమైన పత్రాలను దరఖాస్తుకు జత చేయండి.