ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దీపావళికి క్రాకర్స్​ షాప్​ పెట్టాలనుకుంటున్నారా? - అనుమతి ఎలా పొందాలంటే! - HOW TO APPLY FOR CRACKERS SHOP

బాణసంచా విక్రయించే దుకాణాదారులకు పలు సూచనలు చేసిన జీహెచ్ఎంసీ కమిషనర్ - నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు

how-to-apply-for-crackers-shops
how to apply for crackers shops (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 24, 2024, 10:26 PM IST

GHMC Commissioner Instructions To Who Want To Set Up Crackers Shops :దీపావళికి బాణసంచా విక్రయించే దుకాణాదారులకు జీహెచ్ఎంసీ కమిషనర్ పలు సూచనలు చేశారు. హైదరాబాద్‌ నగరంలో దీపావళి పండుగకు బాణసంచా విక్రయించే దుకాణాదారులు తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి (GHMC Commissioner Ilambarithi) తెలిపారు. అలాగే రిటైల్ దుకాణాలకు 11 వేల రూపాయలు, హోల్ సేల్ దుకాణాలకు 66 వేల రూపాయలు లైసెన్స్ ఫీజు నిర్ణయించినట్లు కమిషనర్ ప్రకటించారు. బాణసంచా షాప్​లను ఫుట్‌పాత్‌లు, జనావాసాల మధ్య ఏర్పాటు చేయవద్దని పేర్కొన్నారు.

HOW TO APPLY FOR CRACKERS SHOP: అదే విధంగా స్టాల్స్‌కు ఏర్పాటు చేసే విద్యుత్‌కు సంబంధించి నాణ్యమైన పరికరాలు ఉపయోగించాలని వెల్లడించారు. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే అందుకు దుకాణాల యజమానులే బాధ్యత వహించాలని కమిషనర్ స్పష్టం చేశారు. నగరంలోని కాలనీలు, బస్తీలకు దూరంగా మైదానాలు, పెద్ద హాల్స్‌లో తగిన ఫైర్ సేప్టీతో షాపులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రతి స్టాల్ వద్ద చుట్టు పక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జీహెచ్​ఎంసీ కమిషనర్ సూచించారు.

బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు - 8 మందికి గాయాలు - Blast in Fire Crackers Factory

దీపావళికి షాపులు ఏర్పాటు చేసుకునే వారంతా నిర్ణీత ఫీజును చెల్లించి జీహెచ్ఎంసీ (Greater Hyderabad Municipal Corporation) నుంచి ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుందని కమిషనర్‌ తెలిపారు. తాత్కాలిక ట్రేడ్ ఐడెంటిఫికేషన్ నంబర్‌ (Temporary Trade Identification Number) కోసం సిటిజన్ సర్వీస్ సెంటర్, లేదా జీహెచ్ఎంసీ వెబ్‌సైట్‌ www.ghmc.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి జారీ చేసిన ఉత్తర్వులు, న్యాయస్థానాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వులను కచ్చితంగా దుకాణాదారులు పాటించాలని స్పష్టం చేశారు.

కొన్ని టపాసుల అమ్మకాలపై ఇప్పటికే నిషేధం ఉందని గుర్తుచేశారు. వాటి అమ్మకాలకు ఎటువంటి అనుమతి లేదన్నారు. నిబంధనలు ఉల్లంఘించే దుకాణాదారుల తాత్కాలిక ట్రేడ్ లైసెన్స్ సర్టిఫికెట్ రద్దు చేస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి హెచ్చరించారు.

టపాసులతో మోతమోగిన బెజవాడ- అనారోగ్య సమస్యలకు అవకాశమంటున్న నిపుణులు

బాణసంచా నిప్పురవ్వలు పడి దగ్ధమైన ఇళ్లు - ఎమ్మెల్యే ఫ్లెక్సీ వల్ల ఘటన స్థలికి వెళ్లలేకపోయిన ఫైర్ ఇంజిన్!

ABOUT THE AUTHOR

...view details