తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణలో ఒక్కో కుటుంబంపై ఎంత అప్పు ఉందంటే? - ఆ రుణాల్లో దేశంలోనే టాప్​​

దేశంలోనే అత్యధికంగా అప్పుల్లో ఉన్నది తెలంగాణ కుటుంబాలు - ఒక్కో కుటుంబంపై సగటున రూ.1,29,599 అప్పు - నివేదిక వెల్లడించిన నాబార్డ్

Telangana First in Family Debts
Telangana First in Family Debts (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 12, 2024, 2:20 PM IST

Telangana First in Family Debts : దేశంలోనే అత్యధికంగా అప్పుల్లో ఉన్నది తెలంగాణ వాసులేనని నాబార్డ్​ ఆల్​ ఇండియా రూరల్​ ఫైనాన్షియల్​ ఇంక్లూజన్​ సర్వే 2021-22లో వెల్లడించింది. ఒక్కో కుటుంబంలో సగటు సభ్యుల సంఖ్య 3.8 నుంచి 4.1కి చేరినట్లు తెలిపింది. ఇదే సంస్థ 2016-17లో విడుదల చేసిన సర్వేలో ఈ సంఖ్య 3.8 ఉండేది. ఇదే ఆంధ్రప్రదేశ్​లో అయితే 3.5 నుంచి 3.7కి చేరింది. ఈ క్రమంలో జాతీయ సగటు 4.3గా ఉంది. దేశంలో అత్యధికం అయితే ఉత్తరప్రదేశ్​లో 5, బిహార్​లో 4.8 వరకు ఒక్కో కుటుంబంలో ఉన్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి.

రాష్ట్రంలో ఒక్కో కుటుంబంపై సగటున రూ.1,29,599 అప్పు ఉందని తాజా నివేదిక వెల్లడించింది. ఇదే నివేదిక జాతీయ సగటు రూ.90,372గా చెప్పింది. రాష్ట్రంలో అప్పుల్లో ఉన్న కుటుంబాల సంఖ్య 79 శాతం నుంచి 92 శాతానికి పెరిగింది. ఈ క్రమంలో జాతీయ సగటు 52 శాతంగా ఉంది. దేశంలోనే అప్పుల్లో ఉన్న కుటుంబాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​ (తెలుగు రాష్ట్రాలు)లనే తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఇందులో తెలంగాణ 92 శాతం, ఏపీ 86 శాతం కుటుంబాలు అప్పుల్లో ఉన్నాయి.

తెలంగాణ కుటుంబాల అప్పుల వివరాలు :

  • తెలంగాణలోని ఒక్కో కుటుంబ నెలవారీ సగటు ఆదాయం రూ.7,811 నుంచి రూ.12,065కి పెరిగింది. ఈ క్రమంలో జాతీయ సగటు రూ.8,059 నుంచి రూ.12,698కి చేరింది.
  • కుటుంబ నెలవారీ సగటు మిగులు ఇదివరకు రూ.998గా ఉండగా, ఇప్పుడు రూ.781కి పడిపోయింది. పంజాబ్​లో కుటుంబానికి నెలకు రూ.5,683 ఆదాయం మిగులుతుంది. బిహార్​, ఝార్ఖండ్​, ఏపీ, తెలంగాణలోని కుటుంబాల వద్ద మిగులు ఆదాయం అతితక్కువ.
  • వ్యవసాయ కుటుంబ నెలవారీ సగటు ఆదాయం రూ.8,951 నుంచి రూ.13,874కి చేరింది. అదే క్రమంలో జాతీయ సగటు రూ.8,931 నుంచి రూ.13,661కి పెరిగింది. అంటే జాతీయ సగటు కంటే తెలంగాణ వ్యవసాయ కుటుంబ నెలవారీ సగటు ఎక్కువ. ఇది పంజాబ్​లో ఎక్కువ. ఒక్కో రైతు కుటుంబానికి రూ.31,433 ఆదాయం ఉంది.
  • కుటుంబ నెలవారీ సగటు వినియోగ వ్యయం రూ.6,813 నుంచి రూ.11,284కి చేరింది. అదే జాతీయ సగటు రూ.6,646 నుంచి రూ.1,262కి పెరిగింది.
  • 2021-22 వ్యవసాయ సంవత్సరంలో రుణం తీసుకున్న కుటుంబాలు 73 శాతం. అదే క్రమంలో జాతీయ సగటు 42 శాతం. ఈ విషయంలో ఏపీ, తెలంగాణ తొలి రెండు స్థానాలలో ఉన్నాయి.
  • రాష్ట్రంలో కౌలుకి తీసుకున్న వ్యవసాయ కుటుంబాలు 5.6 శాతం. కౌలుకు ఇచ్చినవి 1.8 శాతం.
  • తెలంగాణలోని 54 శాతం కుటుంబాలు ఎంతో కొంత మొత్తాన్ని పొదుపు చేస్తున్నాయి. ఇది జాతీయ సగటు 66 శాతం.
  • వ్యవసాయ సంవత్సరంలో ఒక్కో కుటుంబం పొదుపు చేసిన సగటు మొత్తం రూ.18,381. అదే జాతీయ సగటు రూ.20,139గా ఉంది. అత్యధికంగా జమ్ముకశ్మీర్​లో రూ.53,140ని పొదుపు చేస్తున్నారు.
  • ఈ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 92 శాతం కుటుంబాలు గ్రామాల్లో, శాతం సెమీ అర్బన్​ ప్రాంతంలో ఉన్నాయి.
  • తెలంగాణలో వ్యవసాయ కుటుంబాల సంఖ్య 55 శాతం, వ్యవసాయేతర కుటుంబాల సంఖ్య 45 శాతంగా ఉంది.
  • వ్యవసాయ కుటుంబం అధీనంలో ఉన్న సగటు భూ విస్తీర్ణం 1 హెక్టార్​ నుంచి 0.9 హెక్టార్​కి తగ్గిపోయింది. ఇది జాతీయ సగటు 0.7 హెక్టార్లుగా ఉంది.
  • తెలంగాణలో 20 శాతం కుటుంబాలు సంవత్సరంలో ఏదో ఒక రంగంలో పెట్టుబడి పెడుతున్నాయి. ఈ విషయంలో జాతీయ సగటు 27 శాతం. దేశంలో ఎక్కువగా యూపీ, మిజోరంలో 36 శాతం కుటుంబాలు పెట్టుబడులు పెడుతున్నాయి.
  • వ్యవసాయ కుటుంబాల చేతుల్లో ఇంటిజాగాతో కలిపి ఉన్న సగటు భూ విస్తీర్ణం 1.01 హెక్టార్ల నుంచి 0.80 హెక్టార్లకు పడిపోయింది. వ్యవసాయేతర కుటుంబాల చేతుల్లో ఉన్న సగటు విస్తీర్ణం 0.20 హెక్టార్ల నుంచి 0.08 హెక్టార్లకు తగ్గిపోయింది.
  • గ్రామాల్లో స్వయం సహాయక సంఘాలు అందుబాటులో ఉన్నట్లు చెప్పిన కుటుంబాలు 76 శాతం. తమ కుటుంబాల్లో కనీసం ఎవరో ఒకరు ఎస్​హెచ్​జీ సభ్యులుగా ఉన్నట్లు చెప్పిన కుటుంబాలు 58.2 శాతం.
  • 2021-22 వ్యవసాయ సంవత్సరంలో తెలంగాణలోని ఒక్కో కుటుంబం వివిధ ఆస్తులను సగటున రూ.58,895 పెట్టుబడి పెట్టగా, జాతీయ సగటు రూ.47,111. అదే జమ్ముకశ్మీర్​లో ఇది రూ.96,943గా ఉంది.
  • తమ గ్రామంలో ఏదో ఒక జీవనోపాధి మార్గాలు అందుబాటులో ఉన్నట్లు కుటుంబాలు 16.9 శాతం. తమ కుటుంబంలో కనీసం ఒక్క సభ్యుడైనా దాంతో అనుసంధానమైనట్లు చెప్పిన కుటుంబాలు 7.9 శాతంగా ఉన్నాయి.
  • గ్రామంలో రైతు ఉత్పత్తి సంఘాలు అందుబాటులో ఉన్నట్లు చెప్పిన కుటుంబాలు 8.4 శాతం, తమ కుటుంబంలో కనీసం ఒక్కరైనా అందులో ఉన్నట్లు చెప్పిన కుటుంబాలు 4.3 శాతం.

Telangana Debts in 2022-23 : పెరుగుతున్న రుణభారం.. 2022-23లో రూ.20 వేల కోట్ల మార్కు దాటిన అప్పు

అప్పులు త్వరగా తీర్చలేకపోతున్నారా? చాలా ఇబ్బందిగా ఉందా? ఈ టిప్స్ పాటిస్తే మీ ప్రాబ్లమ్​ సాల్వ్! - Clearing Debt Tips

ABOUT THE AUTHOR

...view details