ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పూటుగా తాగి వంట మరచిన హాస్టల్‌ వార్డెన్‌ - ఆకలితో అలమటించిన విద్యార్థులు - HOSTEL WARDEN DRANK ALCOHOL

విద్యార్థులకు భోజనం పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డెన్ - మధ్యాహ్న భోజనంపై నిలదీసినా మద్యం మత్తులో స్పందించని వార్డెన్ - విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందకపోవడంపై సీఎం ఆగ్రహం

Hostel Warden Did Not Cook Lunch For Students in Satya Sai District
Hostel Warden Did Not Cook Lunch For Students in Satya Sai District (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 26, 2025, 7:47 PM IST

Updated : Jan 26, 2025, 7:59 PM IST

Hostel Warden Did Not Cook Lunch For Students in Satya Sai District : శ్రీ సత్యసాయి జిల్లాలోని బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులు ఆకలితో అలమటించారు. వార్డెన్ నిర్వాకం వల్ల సికేపల్లి హాస్టల్​ విద్యార్థులు మధ్యాహ్నం భోజనం లేక ఆకలితో అల్లాడారు. మద్యం సేవించిన హాస్టల్‌ వార్డెన్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండించలేదు. దీంతో పిల్లలు ఆకలితో అలమటించారు.

మద్యం మత్తులో స్పందించని వార్డెన్: అన్నం ఎందుకు వండలేదు? అని ప్రశ్నిస్తే బయటకు వెళ్లి తినుకోండి అని వార్డెన్ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని విద్యార్థులు చెప్పారు. విద్యార్థులు చేసేదేమీ లేక కొంతమంది తమ వద్ద ఉన్న డబ్బుతో బయట నుంచి తెచ్చుకొని తిన్నారు. వార్డెన్ మాత్రం తనకేమీ తెలియదు అన్నట్లు మద్యం మత్తులో తూగుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బాలుర వసతి గృహంలో మొత్తం 110 మంది విద్యార్థులు ఉన్నారు. భోజనం వండకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరారు.

పూటుగా తాగి వంట మరచిన హాస్టల్‌ వార్డెన్‌ - ఆకలితో అలమటించిన విద్యార్థులు (ETV Bharat)

ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు: సత్యసాయి జిల్లా సీకేపల్లి వసతి గృహంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందని విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu Naidu) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై జిల్లా కలెక్టర్​తో మాట్లాడిన సీఎం, అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వసతి గృహంలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండని వార్డెన్, సంబంధిత ఉద్యోగులు తీరుపై మండిపడ్డారు. విషయం తెలిసిన వెంటనే విద్యార్థులకు భోజనం సమకూర్చినట్లు కలెక్టర్ చంద్రబాబుకు వివరించారు.

హాస్టల్‌ వార్డెన్‌ సస్పెన్షన్ : ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేసి నిర్లక్ష్యం వహించిన అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాలతో సీకే పల్లి బీసీ హాస్టల్​లో విద్యార్థులకు భోజనం పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డెన్‌ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు వార్డెన్‌ నారాయణస్వామిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు ఇచ్చారు. వార్డెన్ నిర్లక్ష్యం వల్ల 110 మంది హాస్టల్ విద్యార్థులకు ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్న భోజనంపై నిలదీసినా మద్యం మత్తులో వార్డెన్ స్పందించలేదు

Girls Missing: వసతి గృహం నుంచి ఇద్దరు బాలికలు మిస్సింగ్..ఏమైంది..!

అంతా మహిళా ప్రజాప్రతినిధులే అయినా బీసీ హాస్టల్​లో బాలికలకు కష్టాలు

Last Updated : Jan 26, 2025, 7:59 PM IST

ABOUT THE AUTHOR

...view details