ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కథ అడ్డం తిరిగింది - హనీట్రాప్​లో దోపిడీకి గురైన రియల్టర్ - crime news

Honey Trap Through Social Media: హనీ ట్రాప్‌ వలలో శివారెడ్డి అనే వ్యక్తి దోపిడీకి గురయ్యాడు. హైదరాబాద్​కు చెందిన బిల్డర్‌ శివారెడ్డికి వరంగల్‌కు చెందిన యువతితో పరిచయం ఏర్పడి కొంతకాలం తర్వాత విడిపోయారు. ఆ యువతి కర్నూలుకు చెందిన శ్రీనివాసరెడ్డిని పెళ్లి చేసుకుంది. దీంతో ఆమెను గతంలో తీసుకున్న వీడియోలతో శివారెడ్డి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ విషయం శ్రీనివాసరెడ్డికి తెలియడంతో పథకం ప్రకారం అనూరెడ్డి అనే యువతితో కలసి శివారెడ్డిని ట్రాప్‌ చేశాడు.

Honey_Trap_Through_Social_Media
Honey_Trap_Through_Social_Media

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 28, 2024, 12:25 PM IST

Honey Trap Through Social Media: సామాజిక మాధ్యమాల వినియోగం విరివిగా పెరగడంతో, దీనిని ఆసరాగా చేసుకుని నేరాలకు పాల్పడుతున్న వారి సంఖ్య సైతం భారీగా పెరుగుతోంది. ఫేక్​ ప్రొఫైల్స్​ క్రియేట్ చేసి ట్రాప్​ చేస్తున్నారు. ప్రేమ అంటూ మంచిగా మాట్లాడుతూ ముగ్గులోకి దించుతున్నారు. ఒకసారి వారికి చిక్కితే ఇక అంతే సంగతి. ఫొటోలు చూపించి బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభిస్తారు. అడిగినంత ఇవ్వకపోతే వాటిని సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తాం అంటూ బెదిరింపులకు పాల్పడతారు. తాజాగా ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్​లో వెలుగులోకి వచ్చింది.

సోషల్ మీడియా వేదికగా ఓ యువతి ద్వారా హనీ ట్రాప్ చేసి దోపిడీకి పాల్పడిన ఘటన కర్నూలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. హైదరాబాదుకు చెందిన ఓ బిల్డర్ శివారెడ్డికి వరంగల్​కు చెందిన ఓ యువతితో గతంలో పరిచయం ఉంది. అయితే శివారెడ్డి ఆమెతో కొంత కాలం కలిసిమెలిసి తిరిగాడు. ఆ తర్వాత ఆమెను వదిలేయడంతో ఆ యువతి కర్నూలుకు చెందిన శ్రీనివాసరెడ్డి అనే మరో వ్యక్తితో పరిచయం పెంచుకుంది.

హనీట్రాప్​లో పడి కొకైన్ స్మగ్లింగ్.. అడ్డంగా బుక్కైన వ్యక్తి.. రూ.28కోట్ల డ్రగ్స్ సీజ్

కొద్ది కాలానికి శ్రీనివాసరెడ్డిని పెళ్లి చేసుకుంది. శ్రీనివాసరెడ్డిని పెళ్లి చేసుకున్నట్లు శివారెడ్డికి తెలిసింది. దీంతో అప్పటి నుంచి ఆ యువతిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. గతంలో తన దగ్గర ఉన్న వీడియోల ద్వారా బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే శివారెడ్డి బెదిరింపులు తాళలేక ఆ యువతి విషయం మొత్తం శ్రీనివాసరెడ్డికి చెప్పింది. దీంతో శ్రీనివాసరెడ్డి పక్కా ప్లాన్ ప్రకారం, అనూరెడ్డి అనే మరో యువతి ద్వారా సోషల్ మీడియా వేదికగా శివారెడ్డిని హానీ ట్రాప్ చేశారు.

శివారెడ్డి పూర్తిగా ప్రేమలో మునిగాడని తెలుసుకున్నాక కర్నూలుకు పిలిపించారు. కర్నూలు అబ్బాస్ నగర్​లోని ఓ గదికి పిలిపించి, శివారెడ్డిని కొట్టారు. ఆ తర్వాత హిజ్రాలతో బెదిరించి, వారితో శివారెడ్డి ఉన్నట్లు ఫొటోలు తీశారు. ఆ తర్వాత అతని వద్ద ఉన్న వాచ్, బంగారు చైన్ తీసుకున్నారు. వీటితో పాటు కొన్ని ప్రామిసరీ నోట్లు సైతం రాయించుకున్నట్లు సమాచారం.

అనంతరం హిజ్రాలతో ఉన్న ఫొటోలు చూపించి మరోసారి బ్లాక్ మెయిల్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో శివారెడ్డి పోలీసులను ఆశ్రయించాడు. శివారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు శ్రీనివాసరెడ్డిని, అనూరెడ్డిని, వీరికి సహకరించిన ప్రసాద్, వెంకటేశ్వర్లు, ఇద్దరు హిజ్రాలు, మరో యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. వీరందరిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. వీరికి సహకరించిన మరో యువతి, ఇద్దరు వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

New Rules for Social Media in India 2023 : 'ఫొటోలు పెట్టొద్దు.. రీల్స్‌ చేయొద్దు'.. భద్రతా బలగాలకు వార్నింగ్​

ABOUT THE AUTHOR

...view details