Homeless Shelter Centre Problems in Mahabubnagar : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పురపాలిక కేంద్రాల్లో అనాథలు నానా తిప్పలు పడుతున్నారు. నా అనుకునే వారు లేకపోయినా, బతకడానికి స్థలం లేక రోడ్లపై సేదతీరుతున్నారు. నిరాశ్రయుల కోసం ఏర్పాటు చేసే షెల్టర్ జోన్ల కోసం ప్రభుత్వ స్థలాలు గుర్తించి, ప్రతిపాదనలు పంపాలని సీడీఎంఏ ఆదేశాలు జారీ చేసినా, ఉమ్మడి జిల్లాలో ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. షెల్టర్ జోన్లు లేక అనాథలు, నిరాశ్రయులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 19 పురపాలికలు ఉంటే, నిరాశ్రయుల కోసం కేవలం మహబూబ్‌నగర్‌లో మాత్రమే షెల్టర్ జోన్ ఏర్పాటు చేశారు. కొన్ని రోజులుగా అవి కూడా మూతపడడంతో అనాథలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండలకు, వానలకు, చలికి తట్టుకోలేక పదుల సంఖ్యలోఅనాథలుమృతి చెందుతున్నారు. రైల్వే స్టేషన్ సదుపాయం ఉన్న మహబూబ్‌నగర్, జడ్చర్ల, గద్వాల పట్టణాల్లో నిరాశ్రయులు ఎక్కువగా ఉంటున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు రైల్వే స్టేషన్ సమీపంలోనే తచ్చాడుతూ జీవనం సాగిస్తున్నారు.
Food distribution: అనాధ పిల్లలకు ఆహారం పంపిణీ
"2014లో పైలట్ ప్రాజెక్ట్ కింద అనాథల కోసం షెల్టర్ స్కీమ్‌ను విడుదల చేయడం జరిగింది. అయితే ఇది మున్సిపల్ వారికి అప్పజెప్పటంతో మున్సిపల్, మెప్మా వీరిద్దరి సమక్షంలో దీన్ని నిర్వహిస్తున్నారు. పట్టణంలో ఎవరైతే నిరాశ్రయులు, ఇళ్లులేని వారు ఉంటారో, వేరే దగ్గర నుంచి ఇక్కడ ఉపాధి హామీ కూలీ పనుల కోసం వచ్చే వారి కోసం మూడు నెలలు ఉండటానికి ఈ షెల్టర్ ఏర్పాటు చేశారు. గత కొన్ని రోజుల క్రితం చిన్న పిల్లను ఎవరో కిడ్నాప్ చేయడంతో పోలీసుల ఆదేశాల మేరకు ఈ షెల్టర్‌లోకి రానివ్వట్లేదు." -రాజేందర్ నాయక్, ఆశ్రమ నిర్వాహకుడు