ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహిళలపై అఘాయిత్యానికి పాల్పడాలంటే భయపడాలి : హోంమంత్రి అనిత - Home Minister Anitha Interview

Home Minister Vangalapudi Anitha Interview: రాష్ట్ర మంత్రులుగా ఎంపిక చేసిన వారికి ఇవాళ సీఎం చంద్రబాబు శాఖలు కేటాయించారు. అనంతరం సచివాలయంలో ఉన్న చంద్రబాబును అనిత కలిశారు. హోంమంత్రి శాఖను కేటాయించడంపై సీఎంకు అనిత కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆమె పలు విషయాలను వెల్లడించారు.

Home Minister Vangalapudi Anitha Interview
Home Minister Vangalapudi Anitha Interview (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 14, 2024, 10:39 PM IST

మహిళలపై అఘాయిత్యానికి పాల్పడాలంటే భయపడేలా చర్యలుంటాయి : హోంమంత్రి అనిత (ETV Bharat)

Home Minister Vangalapudi Anitha Interview:రాష్ట్రంలో గంజాయి స్మగ్లర్లు, సరఫరాదారులపై ఉక్కుపాదం మోపుతామని హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఆడబిడ్డల భద్రతకు అధిక ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఈ విషయంలో మహిళా సంఘాల సూచనలు కూడా తీసుకుంటామని చెప్పారు. మహిళలపై అఘాయిత్యం చేయాలంటేనే భయపడేలా చర్యలుంటాయని ఆమె తెలిపారు. మహిళల భద్రత విషయంలో మహిళా సంఘాల సూచనలు తీసుకుంటామన్నారు. లేని దిశ చట్టాన్ని ఉన్నట్లు గత ప్రభుత్వం అభూత కల్పనలు సృష్టించిందని ఆమె మండిపడ్డారు.

కేంద్రమంత్రులుగా రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ బాధ్యతలు - రాష్ట్రానికి శుభవార్త - Rammohan Naidu charge as Minister

పోలీసు అధికారులపై కక్ష సాధింపు చర్యలు ఉండవని, తప్పు చేసిన వారిని గాడిలో పెట్టడం తమ బాధ్యతగా భావిస్తున్నామని అనిత పేర్కొన్నారు. పోలీసులు ప్రజల కోసం చట్టప్రకారం పనిచేయాలని సూచించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వేతనాలు, బకాయిల విషయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డ పోలీసుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్నారు. పోలీసు శాఖను కిందిస్థాయి నుంచి ప్రక్షాళన చేస్తామని ఆమె వెల్లడించారు. గతంలో పోలీసులు నాపైనే అట్రాసిటీ కేసు పెట్టారని హోంమంత్రి గుర్తు చేశారు. చాలా మంది ఐపీఎస్‌లు జగన్‌కు, వైఎస్సార్సీపీకి తొత్తులుగా పనిచేశారని ఆమె విమర్శించారు.

గత ఐదేళ్లలో చాలామంది ఐపీఎస్‌లు వారి గౌరవాన్ని తగ్గించుకున్నారని అన్నారు. ఐపీఎస్‌లు, పోలీసు అధికారుల గౌరవాన్ని పెంచేలా మా పాలన ఉంటుందని అనిత స్పష్టం చేశారు. పోలీసు అధికారులు చట్టప్రకారం నడుచుకోవాలని హోంమంత్రి హెచ్చరించారు. ఇప్పటికీ వైఎస్సార్సీపీ ఆలోచనలతోనే పనిచేసే అధికారులను ఉపేక్షించమని తెలిపారు. అన్యాయం చేసిన వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపాలన్నారు.

రాష్ట్రానికి పునర్వైభవం- ఎన్డీఏ హామీల అమలు మొదలైంది : పవన్ కల్యాణ్ - Pawan Kalyan on Chandrababu Signs

గత ప్రభుత్వ హయాంలో పోలీసులతో ఎన్నో బాధలు పడ్డామని అన్నారు. మహిళలపై దాడుల విషయంలో డీజీపీకి వినతిపత్రం కూడా ఇవ్వనివ్వలేదని మండిపడ్డారు. త్వరలో ప్రోటోకాల్‌లో వస్తానని ఆరోజే పోలీసులకు చెప్పానని అనిత గుర్తు చేశారు. ఏ ఆడపిల్లకూ అన్యాయం జరగకూడదని అందరూ భద్రంగా ఉండాలని ఆమె సూచించారు. పోలీసులకు ఇవ్వాల్సిన బకాయిలపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. నేను బాధ్యతలు తీసుకున్నాక బకాయిలపై సమీక్షించి నిర్ణయం తీసుకుంటానని హోంమంత్రి స్పష్టం చేశారు.

వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనూ మహిళలకే హోం మంత్రి పదవి దక్కగా చంద్రబాబు కూడా హోంమంత్రిగా మహిళనే నియమించారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచి ఈ మంత్రివర్గంలో పదవి దక్కించుకున్న ఏకైక ఎమ్మెల్యే వంగలపూడి అనిత. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎంతో మంది సీనియర్ నేతలు ఉన్నప్పటికీ పార్టీ పట్ల ఆమె చూపిన విధేయత వల్ల చంద్రబాబు ఆమెకు మంత్రి పదవిని కేటాయించారు. ఏకంగా హోంమంత్రిని చేశారు.

టీచర్ టూ.. హోమ్ మినిస్టర్ - వంగలపూడి అనిత విజయ ప్రస్థానం - AP Home Minister Vangalapudi Anitha

ABOUT THE AUTHOR

...view details