ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కిడ్నీ రాకెట్ వార్తలపై హోంమంత్రి అనిత ఆగ్రహం - హాస్పిటల్​పై చర్యలు తీసుకోవాలని ఆదేశం - Home Minister On Kidney Racket - HOME MINISTER ON KIDNEY RACKET

Home Minister Anitha on Kidney Racket: విజయవాడలో కిడ్నీ రాకెట్ వార్తలపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు.గుంటూరు కలెక్టర్, ఎస్పీ, విజయవాడ పోలీస్ కమిషనర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్లతో మంత్రి అనిత ఫోన్లో మాట్లాడారు. డబ్బులు ఆశ చూపి కిడ్నీ కొట్టేసిన ఆస్పత్రిపై చర్యలకు ఆదేశించారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు నిఘా పెట్టాలన్నారు. బాధితుడి ఫిర్యాదుపై హోంమంత్రి ఆదేశాలతో పోలీసులు విచారణ చేపట్టారు.

Home Minister Anitha on Kidney Racket
Home Minister Anitha on Kidney Racket (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 9, 2024, 4:45 PM IST

Home Minister Anitha on Kidney Racket: విజయవాడలో కిడ్నీ రాకెట్​పై మీడియాలో వస్తున్న వార్తలకు స్పందించిన హోం మంత్రి అనిత, అధికారులను ఆరా తీశారు. గుంటూరు కలెక్టర్, గుంటూరు ఎస్పీ, విజయవాడ పోలీస్ కమిషనర్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్​తో మంత్రి అనిత ఫోన్లో మాట్లాడారు. డబ్బులు ఆశ చూపి కిడ్నీ కొట్టేసిన ఆసుపత్రిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఇటువంటి ఘటనలపై పోలీసులు నిఘా పెట్టాలని ఆదేశించారు.

బాధితుడిని విచారించిన పోలీసులు: హోంమంత్రి ఆదేశాలతో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేపట్టారు. కిడ్నీ రాకెట్‌లో మోసపోయిన మధుబాబును పోలీసులు విచారిస్తున్నారు. గుంటూరు నగరంపాలెం అధికారులు లోతుగా విచారణ మొదలు పెట్టారు. ఇప్పటికే పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

రూ. 30 లక్షలకు ఆశ చూపి కిడ్నీ కొట్టేశారు - విజయవాడలో వెలుగు చూసిన మోసం - Kidney racket Frauds in Vijayawada

ఇదీ జరిగింది:విజయవాడలో కిడ్నీ రాకెట్‌ మోసాలు వెలుగు చూశాయి. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ పోషణ కోసం కిడ్నీ అమ్మేందుకు ఒప్పుకున్నాడు. అయితే కిడ్నీ తీసుకుని తనను మోసం చేశారని గుంటూరుకు చెందిన గార్లపాటి మధుబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నీ ఇస్తే డబ్బులు ఇస్తామని చెప్పి విజయవాడలోని ఓ ఆస్పత్రిలో ఆపరేషన్‌ చేశారని తెలిపారు. అయితే ఆపరేషన్ పూర్తయ్యాక కేవలం లక్షా పదివేలు ఇచ్చారని వాపోయారు. మిగిలిన డబ్బులు ఇవ్వాలని అడిగితే తనను బెదిరిస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. తనలాగే డబ్బు ఆశ చూపి నెలకు ఐదు నుంచి 10 మందికి కిడ్నీ ఆపరేషన్లు చేస్తున్నారని బాధితుడు ఆరోపించారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు ఎఫ్​ఐఆర్ నమోదు చేసినట్లు గుంటూరు పశ్చిమ డీఎస్పీ మహేష్ తెలిపారు. కిడ్నీ రాకెట్ ముఠాపై ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. నగరంపాలెం పోలీస్ స్టేషన్​లో బాధితుడు మధుబాబును విచారించిన డీఎస్పీ, కిడ్నీ మార్పిడికి సంబంధించిన వివరాలు, జరిగిన సంప్రదింపులు, లావాదేవీల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీస్ స్టేషన్​లో ఐపీసీ పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Kidney Racket: విజయవాడలో మరో కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు.. పోలీసులకు వరుసగా ఫిర్యాదులు

ఆరోపణలు అవాస్తవం: కిడ్నీ రాకెట్ వార్తలపై శరత్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ అధినేత డాక్డర్ శరత్ బాబు స్పందించారు. కిడ్నీ రాకెట్ ఆరోపణలు అవాస్తవమన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే కిడ్నీ మార్పిడి చేశామని ఆయన తెలిపారు. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం కంచడం గ్రామానికి చెందిన కేతినేని వెంకటస్వామికి జూన్ 15న కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేశామని అన్నారు. వెంకటస్వామి కుటుంబ మిత్రుడైన మధుబాబు కిడ్నీ దానం చేశారని, కిడ్నీ విక్రయాలపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని శరత్‌బాబు పేర్కొన్నారు. ఇందులో ఎటువంటి ఆర్ధిక లావాదేవీలు జరగలేదన్నారు.

Kidney Smuggling gang arrest: ఆసుపత్రిలో స్వీపర్​.. దళారిగా మారి కిడ్నీ రాకెట్​.. నలుగురు అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details