KTR Son Himanshu Rao Song : 'నా సూర్యుడివి, నా చంద్రుడివి, నా దేవుడివి నువ్వే.. నా కన్నులకి నువ్వు వెన్నెలవి, నా ఊపిరివి నువ్వే. నువ్వే కదా నువ్వే కదా.. సితార నా కలకి. నా నాన్న నువ్వు నా ప్రాణం అనిన సరిపోదట ఆ మాట. నా నానీకై ప్రాణం ఇవనూ.. ఇదిగో ఇది నా మాట.' అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మనవడు, కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావు యానిమల్ సినిమాలోని పాటను ఆలపించారు. ఆ పాట ద్వారా తన నాన్నపై ఉన్న ప్రేమ, గౌరవాన్ని చూపించారు. తనతో ఉన్న జ్ఞాపకాలను ఫొటోల రూపంలో ప్లే చేస్తూ హిమాన్షు సొంతంగా గానం చేశారు. ఈ వీడియో కేటీఆర్ మాటలు ప్రకారం చూస్తే ఈ ఏడాది జులైలో పుట్టినరోజు సందర్భంగా చేసి హిమాన్షు చేసి ఉంటారని తెలుస్తోంది. ఇప్పుడు ఈ వీడియో సాంగ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.
కేటీఆర్ ట్వీట్ :ఇప్పుడు ఈ వీడియోను కేటీఆర్ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. తన సంతోషాన్ని ట్వీట్ రూపంలో షేర్ చేసుకున్నారు. "కష్టతరమైన సంవత్సరంలో నాకు లభించిన ఉత్తమ బహుమతి. ధన్యవాదాలు బింకు @TheHimanshuRaoK. నీ గానం నాకు చాలా నచ్చింది. జులైలో నా పుట్టినరోజు కోసం నా కుమారుడు దీన్ని రికార్డు చేసినట్లు తెలుస్తోంది. కానీ అది సరిపోదని భావించి విడుదల చేయకుండా తప్పించుకున్నాడు. నేను గత వారం మాత్రమే మొదటిసారి విన్నాను. తండ్రిగా చాలా గర్వంగా ఉంది" అంటూ ఎక్స్ వేదికగా వీడియోతో పాటు ట్వీట్ చేశారు.