ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్​పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు- స్పీకర్​ కార్యాలయానికి ఆదేశాలు - MLAS DISQUALIFICATION CASE - MLAS DISQUALIFICATION CASE

TG High Court on MLAs Disqualification Case : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ కార్యాలయానికి ఆదేశాలు జారీ చేసింది.

TG HC on MLAs Disqualification Case
TG HC on MLAs Disqualification Case (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 9, 2024, 12:28 PM IST

Updated : Sep 9, 2024, 1:43 PM IST

MLA Defection Case in Telangana :తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతలపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయానికి హైకోర్టు ఆదేశాలిచ్చింది. లేదంటే తామే సుమోటో కేసుగా తీసుకుని విచారిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇవాళ విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. బీఆర్​ఎస్​ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్‌ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పార్టీ ఫిరాయించిన వారిపై చట్టప్రకారం అనర్హత వేటు వేసేలా స్పీకర్​ను ఆదేశించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్​రెడ్డి సైతం పిటిషన్‌ దాఖలు చేశారు. పార్టీ ఫిరాయించిన వారిపై మూడు నెలల్లో అనర్హత వేటు వేయాలంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నాయని, అయినా స్పీకర్‌ పట్టించుకోవట్లేదని పిటిషనర్ల తరపు న్యాయవాది వెల్లడించారు. స్పీకర్​ను ఆదేశించే అధికారం హైకోర్టుకు లేదని, స్పీకర్ ఇండిపెండెంట్ ట్రైబ్యునల్ అని ప్రతివాదుల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గత నెల విచారణను ముగించిన ధర్మాసనం తీర్పు రిజర్వ్‌ చేసింది. ఈ మేరకు 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ కార్యాలయ కార్యదర్శికి ఆదేశాలిస్తూ ఇవాళ తీర్పు వెల్లడించింది.

హైకోర్డు తీర్పుతో ఉప ఎన్నిక‌లు త‌థ్యం : హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ మంత్రి హరీశ్​రావు స్పందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్​ వేదికగా ట్వీట్​ చేశారు. ఎమ్మెల్యేల అన‌ర్హ‌త పిటిష‌న్లపై తెలంగాణ హైకోర్డు ఇచ్చిన తీర్పును స్వాగ‌తిస్తున్నట్లు తెలిపారు. ఈ తీర్పు కాంగ్రెస్ అప్ర‌జాస్వామ్య విధానాల‌కు చెంప పెట్టు అని వ్యాఖ్యానించారు. హైకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అన‌ర్హ‌త‌కు గురికావ‌డం త‌థ్యమని హరీశ్​రావు పేర్కొన్నారు. హైకోర్డు తీర్పు ప్ర‌జాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్పూర్తిని నిల‌బెట్టేలా ఉందని, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అన‌ర్హ‌త‌కు గురై ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉప ఎన్నిక‌లు రావ‌డం త‌థ్యమని ఆశాభావం వ్యక్తం చేశారు. అన‌ర్హ‌త కార‌ణంగా ఉప ఎన్నిక‌లు జ‌రిగే నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్​ఎస్​ గెలుపు త‌థ్యమని ధీమా వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా శాస‌న‌ స‌భాప‌తి నాలుగు వారాల్లో నిర్ణ‌యం తీసుకుని ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడ‌తార‌ని ఆశిస్తున్నామని తెలిపారు.

'శ్రీశైలం దేవస్థానానికి సమాంతరంగా ప్రైవేట్ ట్రస్ట్ పేరుతో ఆలయ నిర్మాణమా?' - AP HC on Srisailam Temple Lands

మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై ఎస్సీ,ఎస్టీ కేసుపై హైకోర్టు స్పందన ఇదే

Last Updated : Sep 9, 2024, 1:43 PM IST

ABOUT THE AUTHOR

...view details