Hibiscus Flower changing Three colour in One day In Srikakulam District :సహజంగా పూలు రోజంతా ఒకే రంగులో కనిపిస్తాయి. సూర్యోదయం అప్పుడు తాజా వికసించి, మధ్యానం ఎండకు కొంచం వల్లిపోయినా మళ్లీ సాయంత్రానికి పొద్దున ఎలా ఉందో అదే రంగులో ఉంటుంది. కానీ శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం గొర్రిబంద గ్రామానికి చెందిన ఎస్.కృష్ణమూర్తి పెరటిలోని మందారం జాతి మొక్కకు చెందిన పుష్పాలు ఒకే రోజులో మూడు రంగుల్లోకి మారుతున్నాయి. నమ్మడానికి సంకొచిస్తన్నారా.. కానీ నమ్మాల్సిందే.
ఈ మందార ఉదయం తెలుపు రంగులో, మధ్యాహ్నం గులాబీ రంగు, సాయంత్రం ఎరుపు రంగులో కనిపించి అందర్నీ ఆకర్షిస్తున్నాయి. ఈ మొక్కను ఒడిశా రాష్ట్రం గుణుపురం నుంచి ఏడాదిన్నర కిందట తెచ్చుకున్నానని యజమాని కృష్ణమూర్తి తెలిపారు. హైబిస్కస్ మ్యూటాబిలిస్ జాతికి చెందిన పత్తి మందారం మొక్కలు రంగులు మారుస్తాయని ఉద్యానశాఖ అధికారిణి మంగమ్మ వివరించారు. ఇవి దక్షిణ చైనాలో మాత్రమే ఉండేవని, ప్రస్తుతం అన్ని దేశాల్లోనూ పెరుగుతున్నాయని, మన ప్రాంతంలో అరుదేనని వెల్లడించారు. ఈ మొక్కలను కాన్ఫెడరేట్ రోజ్, డిక్సి రోజ్‌మల్లౌ, కాటన్‌రోజ్, కాటన్ రోజ్‌మల్లౌ పేర్లతోనూ పిలుస్తారని పేర్కొన్నారు.
12ఏళ్ల తర్వాత విరబూసిన నీలకురింజి పువ్వులు- చూసేందుకు రెండు కళ్లు చాలవ్! - Neelakurinji Flowers