Hero Shivaji Support to TDP Leader Prathipati Pullarao in Chilakaluripet :ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒకవైపు కూటమి నాయకులు ప్రచారాలతో హోరెత్తిస్తుంటే మరోవైపు సినీ నటులు వారికి మద్దతుగా నిలుస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రజలకు వివరిస్తున్నారు. సీఎం జగన్ పరిపాలనలో జరిగిన అన్యాయాలు, అరాచకాలను ప్రజలకు తెలుపుతూ ముందుకు సాగుతున్నారు.
Shivaji Comments on Jagan :జగన్‌రెడ్డి మరోసారి సీఎం అయితే రాష్ట్రంలో ఎవరి భూములు మిగలనివ్వరని సినీనటుడు శివాజీ హెచ్చరించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చింది దాని కోసమని, కబ్జా కోరుల చేతుల్లో అదొక ఆయుధంగా మారబోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం మురికివాడలో కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావుకు మద్దతుగా ఆయన కుమారుడు శరత్‌తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి టీడీపీ సూపర్ సిక్స్ పథకాల గురించి వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. శరత్, శివాజీలకు మురికిపాడు గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతలు పట్టారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ప్రజలే పవన్ కల్యాణ్‌కు కుటుంబసభ్యులు: వరుణ్ తేజ్ - Varun Tej Election Campaign
Land Titling Act Shivaji Comments :సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్రంలో ఎక్కడెక్కడ భూములున్నాయి, వాటిని ఎలా కబ్జా చేయాలి అనే విషయంపై దృష్టి పెట్టారని శివాజీ ఆరోపించారు. భూరక్షణ పేరుతో భక్షిస్తారని పేర్కొన్నారు. భూ సర్వేలు చేసి భూములు గుట్టుమట్లు తెలుసుకున్నారని వ్యాఖ్యానించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ద్వారా వాటికి ఎసరు పెట్టే పని మొదలు పెట్టారని ఆరోపించారు.