RAM CHARAN AT KADAPA DARGAH: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కడపకు చేరుకున్నారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి కడప విమానాశ్రయం చేరుకున్నారు. రామ్ చరణ్ వస్తున్నారని తెలుసుకొని ఆయన అభిమానులు, జనసేన అభిమానులు పెద్ద సంఖ్యలో విమానాశ్రయం వద్ద సందడి చేశారు. రామ్ చరణ్‌కు ఘనంగా స్వాగతం పలికారు.
కడపలో హీరో రామ్‌చరణ్ సందడి - ఆలయంతో పాటు దర్గా సందర్శన - RAM CHARAN AT KADAPA DARGAH
పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలలో భాగంగా ముషాయిర కార్యక్రమంలో పాల్గొన్న రామ్ చరణ్
RAM CHARAN AT KADAPA DARGAH (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 18, 2024, 7:53 PM IST
విమానాశ్రయం నుంచి వాహనంలో బయలుదేరి కడప నగరంలోని విజయదుర్గ దేవాలయానికి వెళ్లారు. అక్కడ అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడ నుంచి నేరుగా కడప పెద్ద దర్గాకు చేరుకున్నారు. పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలలో భాగంగా ముషాయిర కార్యక్రమంలో హీరో రామ్ చరణ్ పాల్గొన్నారు. పెద్ద దర్గాలో చాదర్ సమర్పించారు. దర్గా విశిష్టతను పీఠాధిపతులను అడిగి తెలుసుకున్నారు.