Hero Raj Tarun Reaction on Lavanya Allegations :లావణ్యతో వివాదం తననే కాదు తన కుటుంబాన్ని కూడా తీవ్రంగా బాధించిందని యువ కథానాయకుడు రాజ్ తరుణ్ అన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న లావణ్యపై న్యాయపోరాటం చేస్తానని రాజ్ తరుణ్ స్పష్టం చేశారు. లావణ్య ఆరోపణల్లో నిజం లేదని, తన వద్ద ఉన్న అన్ని ఆధారాలను కోర్టుకు సమర్పిస్తానని తెలిపారు. తన తాజా చిత్రం 'తిరగబడరా స్వామి' చిత్రం ఆగస్టు 2న విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌కు మాల్వీ మల్హోత్రాతో కలిసి రాజ్ తరుణ్ హాజరయ్యారు.
ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు :లావణ్య ఆరోపణలపై పోలీసులు తనకు నోటీసులు ఇచ్చారని, వాటికి సమాధానం చెప్పినట్లు పేర్కొన్న రాజ్ తరుణ్ లావణ్య చేస్తున్న గర్భస్రావం ఆరోపణలపై పోలీసులు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. తన అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకొని లావణ్య లాంటి వాళ్లు లబ్ధి పొందాలని చూస్తున్నారని రాజ్ తరుణ్ పేర్కొన్నారు.
మరోవైపు ఇదే వివాదంపై స్పందించిన నటి మాల్వీ మల్హోత్రా లావణ్య ఒక క్రిమినల్‌గా తయారైందని ఆరోపించింది. ప్రెస్ మీట్ జరుగుతుండగా ప్రసాద్ ల్యాబ్‌కు వచ్చిన లావణ్య రాజ్ తరుణ్‌ను కలిసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ప్రివ్యూ థియేటర్ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ఈ నెల 18లోపు విచారణకు హాజరవ్వండి - హీరో రాజ్‌తరుణ్‌కు పోలీసుల నోటీసులు - Police Issued Notices to Raj Tarun
"మన అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకుని ఇంత చేస్తే ఎవరికైనా బాధగా ఉంటుంది. నేను మనిషినే కదా. నేను ఎఫెక్ట్ అవుతాను. నాకు వాళ్లలాగ ఆరోపణలు చేసి, మీడియా ట్రయల్స్ చేసే ఉద్దేశం అస్సలు లేదండి. ఆరోపణలు చేసే వారు బయటకు వచ్చి మాట్లాడతారు. నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి నేను దేనికి భయపడాల్సిన అవసరం లేదు. లీగల్‌గా వెళ్తా. ఇన్ని రోజుల నుంచి చేస్తున్న ఆరోపణలు, మాటలు విన్నారు కానీ ఒక్కరోజైనా ఆధారాలు అడిగారా?" - రాజ్‌తరుణ్, హీరో
లావణ్య తీవ్ర ఆరోపణలు : కాగా రాజ్‌తరుణ్ నకు ప్రపోజ్ చేసి 2014లో పెళ్లి చేసుకున్నాడని, తన కుటుంబం రూ.70లక్షలు ఇచ్చిందని, 2016లో తాను గర్భం దాల్చితే రాజ్‌తరుణ్ అబార్షన్ చేయించాడని తీవ్ర ఆరోపణలు చేసింది. మాల్వీ పరిచయం అయ్యాకే రాజ్ ఆమె నుంచి దూరమయ్యాడని తెలిపింది. దీంతో పోలీసులు అతనిపై, మాల్వీ మల్హోత్రపై కేసు నమోదు చేశారు. నార్సింగి పోలీసులు నోటీసులు పంపించారు. జులై 18లోపు తమ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో పోలీసులు వెల్లడించారు. బీఎన్ఎస్ఎస్ 45 కింద రాజ్‌తరుణ్‌కు నార్సింగి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే లావణ్య ఫిర్యాదుతో రాజ్ తరుణ్‌పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
రాజ్ తరుణ్‌కు రూ.70 లక్షలు ఇచ్చాను - నాకు అబార్షన్ కూడా చేయించాడు : నటి లావణ్య - FIR FILED AGAINST ACTOR RAJ TARUN
హీరో రాజ్ తరుణ్‌పై కేసు నమోదు - తానే అబార్షన్ చేయించాడన్న లావణ్య - Police File A Case Actor Raj Tarun