- ప్రకాశం బ్యారేజ్ వద్ద దెబ్బతిన్న గేట్లు పరిశీలించిన మంత్రి నిమ్మల
- బోట్లు ఢీకొనడం, ఖానాలు దెబ్బతినడం వల్ల బ్యారేజ్‌కు ప్రమాదం లేదు: నిమ్మల
- ప్రకాశం బ్యారేజ్ గేట్లు కొట్టుకుపోయానని తప్పుడు ప్రచారం చేస్తున్నారు: నిమ్మల
- బోట్లు బలంగా ఢీకొనడం వల్ల గేట్లు దింపే కౌంటర్ దెబ్బతింది: మంత్రి నిమ్మల
- కౌంటర్‌కు మరమ్మతు చేయకుంటే గేటు దింపేటప్పుడు ఇబ్బంది: నిమ్మల
- బోట్లు కొట్టుకువచ్చిన ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయిస్తాం: నిమ్మల
- బ్యారేజ్‌కు నష్టం కలిగించే ఎలాంటి చర్యనూ అంగీకరించేది లేదు: నిమ్మల
- ప్రస్తుతం వరద బాధితులను ఆదుకోవడంపైనే దృష్టి పెట్టాం: నిమ్మల
LIVE UPDATES: ప్రకాశం బ్యారేజ్ వద్ద గంటగంటకూ తగ్గుతున్న వరదనీరు - HEAVY RAINS IN ANDHRA PRADESH
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 2, 2024, 6:29 AM IST
|Updated : Sep 2, 2024, 10:58 PM IST
Heavy Rains and Floods in Andhra Pradesh: రాష్ట్రంలో కురుస్తోన్న భారీవర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల వాగులు వంకలు పొంగిపొర్లటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాగులు, వంకలు ఏకమై రహదారులను ముంచేయడంతో పలుచోట్ల రవాణా వ్యవస్థ స్తంభించింది. లోతట్టు ప్రాంతాలను ముంపు నుంచి తప్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
LIVE FEED
- విజయవాడ వరద బాధితులకు విశాఖ నుంచి ఆహారం, తాగునీరు
- విశాఖ నుంచి రెండు రైలు బోగీల్లో వెళ్తున్న ఆహారం, తాగునీరు
- బుడమేరు ముంపు ప్రాంతాల్లో పండ్లు పంపిణీ చేసిన మార్కెటింగ్ శాఖ
- చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఆదేశాలతో యాపిల్, అరటిపండ్లు పంపిణీ
- రేపు, ఎల్లుండి మరో 2.5 లక్షల అరటిపండ్లు పంపిణీ: మార్కెటిగ్ శాఖ డైరెక్టర్ సునీత
- ప్రకాశం బ్యారేజ్ వద్ద గంటగంటకూ తగ్గుతున్న వరదనీరు
- మధ్యాహ్నం 3 గంటల నుంచి క్రమంగా తగ్గుతున్న వరద
- మధ్యాహ్నం 12 గం.కు రికార్డు స్థాయిలో 11.43 లక్షల క్యూసెక్కుల వరద
- ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ ఇన్‌ఫ్లో 11.14 లక్షల క్యూసెక్కులు
- వరద ప్రవాహం మరింత తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా
- బుడమేరు ఇన్‌ఫ్లో 4 వేల క్యూసెక్కులే ఉందన్న జలవనరుల శాఖ
- సింగ్‌నగర్ ప్రాంతంలో సీఎం చంద్రబాబు మరోసారి పర్యటన
- బోట్ల ద్వారా బయటకు వచ్చిన బాధితులతో మాట్లాడిన సీఎం
- వృద్ధులు, దివ్యాంగులను అంబులెన్స్‌లో తరలించేందుకు ఏర్పాట్లు
- రెండ్రోజులుగా పడిన కష్టాలను సీఎంకు చెప్పిన వరద బాధితులు
- ఇప్పటికీ అనేకమంది జలదిగ్బంధంలోనే ఉన్నారన్న బాధితులు
- ఇవాళ ఉదయం నుంచి ఆహారం, నీళ్లు అందాయన్న బాధితులు
- ప్రకాశం బ్యారేజ్ వద్ద స్పల్పంగా తగ్గిన వరద ప్రవాహం
- ప్రకాశం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక
- ప్రకాశం బ్యారేజ్ నుంచి 11.27 లక్షల క్యూసెక్కులు విడుదల
- ప్రకాశం బ్యారేజ్ నుంచి కాలువలకు 801 క్యూసెక్కులు విడుదల
- ప్రకాశం బ్యారేజ్ మొత్తం 70 గేట్లు తెరిచి సముద్రంలోకి నీరు విడుదల
- ప్రకాశం బ్యారేజ్ వద్ద 23.7 అడుగుల మేర కొనసాగుతున్న నీటిమట్టం
- హైదరాబాద్-విజయవాడ హైవేలో వాహనాలు పునరుద్ధరణ
- హైదరాబాద్-విజయవాడ హైవేపై యథావిధిగా వాహనాల రాకపోకలు
- సుమారు 30 గంటల తర్వాత ఎన్‌హెచ్-65పై ప్రారంభమైన రాకపోకలు
- ఎన్టీఆర్ జిల్లా గరికపాడు వద్ద కొత్త వంతెన పైనుంచి వాహనాల రాకపోకలు
- వంతెనపై వాహనదారులు నెమ్మదిగా వెళ్లాలని పోలీసుల సూచన
- విజయవాడ:ప్రకాశం బ్యారేజ్ వద్దకు వచ్చిన మంత్రి నిమ్మల
- బ్యారేజ్ వద్దకు వచ్చిన జలవనరులశాఖ సలహాదారు కన్నయ్యనాయుడు
- వరద ప్రభావిత ప్రాంతాలకు ఇంధన శాఖ నుంచి వెయ్యి సోలార్ లాంతర్లు సరఫరా
- సచివాలయం సిబ్బంది ద్వారా విద్యుత్ లేని ప్రాంతాలకు సరఫరా
- మరో 4 వేల సోలార్ లాంతర్‌లు పంపిణీ చేయాలని ఆదేశాలు
ఆహారాన్ని అందించడానికి డ్రోన్‌లను ఉపయోగిస్తున్నాం: మంత్రి లోకేశ్
- వరద బాధితులకు ఆహారాన్ని అందించడానికి డ్రోన్‌లను ఉపయోగిస్తున్నాం: మంత్రి లోకేశ్
- డ్రోన్ సర్వీసు వల్ల సహాయక చర్యలు మరింత వేగవంతం అయ్యాయి: మంత్రి లోకేశ్
- వరద బాధితులకు డ్రోన్ ద్వారా సహాయక చర్యలు అందించడం ఇదే మొదటిసారి: మంత్రి లోకేశ్
- ప్రకాశం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక
- విజయవాడ: ప్రకాశం బ్యారేజీకి పెరుగుతున్న వరద ఉద్ధృతి
- ప్రకాశం బ్యారేజ్ నుంచి 11.27 లక్షల క్యూసెక్కులు విడుదల
- ప్రకాశం బ్యారేజ్ నుంచి కాలవలకు 801 క్యూసెక్కులు విడుదల
- ప్రకాశం బ్యారేజ్ మొత్తం 70 గేట్లు తెరిచి సముద్రంలోకి నీటి విడుదల
- ప్రకాశం బ్యారేజ్ వద్ద 23.7 అడుగుల మేర కొనసాగుతున్న నీటిమట్టం
- ఎన్టీఆర్ జిల్లా: నందిగామ మండలంలో తగ్గిన మున్నేరు వరద
- ఐతవరం వద్ద వాహనాల రాకపోకలకు అనుమతించిన పోలీసులు
- నిలిచిపోయిన వాహనాలను దగ్గరుండి పంపిస్తున్న పోలీసులు
- విజయవాడ-హైదరాబాద్ హైవేపై వాహనాలు పంపిస్తున్న పోలీసులు
కోతకు గురైన జాతీయ రహదారి
- ఎన్టీఆర్ జిల్లా గరికపాడు వద్ద కోతకు గురైన జాతీయ రహదారి
- ఎన్‌హెచ్-65పై నిన్న మధ్యాహ్నం నుంచి నిలిచిన రాకపోకలు
- పాలేరు వాగు ఉద్ధృతి తగ్గాక రోడ్డు మరమ్మతు చేస్తామన్న అధికారులు
- ఏపీ-తెలంగాణ రెండు రాష్ట్రాల మధ్య నిలిచిన రాకపోకలు
- ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద కొనసాగుతున్న వరద ప్రవాహం
- అత్యవసరంగా వెళ్లేవారిని రోడ్డు దాటిస్తున్న అగ్నిమాపక సిబ్బంది
- అత్యవసరమైతే నల్లబండగూడెం మీదుగా జగ్గయ్యపేట వరకు అనుమతి
- నల్లబండగూడెం, గరికపాడు వద్ద నిలిచిన వాహనాలను పంపిన పోలీసులు
- హైదరాబాద్-విజయవాడ మధ్య కోదాడ మీదుగా రాకపోకలు నిలిపివేత
- హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలు దారి మళ్లింపు
- నార్కట్‌పల్లి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా మళ్లింపు
- విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు దారి మళ్లింపు
- గుంటూరు, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ, నార్కట్‌పల్లి మీదుగా మళ్లింపు
- విజయవాడలో హెల్ప్‌లైన్ నంబర్లు: 8181960909, 0866-2424172
- విజయవాడలో హెల్ప్‌లైన్ నంబర్లు: 0866-2575833, 18004256029
- ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతిని పరిశీలించిన సీఎం చంద్రబాబు
- బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొట్టిన ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం
- గేట్ల మరమ్మతులకు చర్యలపై అధికారులతో మాట్లాడిన సీఎం
- వరద సహాయ చర్యలపై అధికారులకు బాధ్యతలు అప్పగించిన లోకేష్
- అప్పగించిన పనులను ఎలా పూర్తి చేశారన్న దానిపై ఎప్పటికప్పుడు ఆరా
- వరద బాధితుల కోసం ఉమ్మడి కృష్ణా జిల్లాలో 81 పునరావాస శిబిరాలు
- రవినగర్, వాంబే కాలనీ, జక్కంపూడిలో హెలికాప్టర్‌తో 3వేల కిలోలు సరఫరా
- మరో హెలికాప్టర్ ద్వారా 2 వేల కిలోల ఆహారం, వాటర్ బాటిళ్లు సరఫరా
- ఆహార పంపిణీ బాధ్యతను సీనియర్ ఐఏఎస్ వీరపాండ్యన్‌కు అప్పగింత
- బాపట్ల, గుంటూరు, ఏలూరు జిల్లాల నుంచి ఆహార పొట్లాలు పంపాలన్న సీఎం
- వరద ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా చూడాలని సీఎం ఆదేశం
- సింగ్‌నగర్‌లో మరోసారి క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు
- సహాయ చర్యలను దగ్గరుండి పర్యవేక్షించనున్న సీఎం చంద్రబాబు
- విజయవాడ: టీం స్వేచ్ఛ ఆధ్వర్యంలో వరద బాధితులకు ఆహారం పంపిణీ
- వందమంది వాలంటీర్ల అధ్వర్యంలో సహాయ కార్యక్రమాలు
- స్వాతి థియేటర్ రోడ్డులోని ముంపుప్రాంతాల్లో ఆహారం పంపిణీ
- ముంపు ప్రమాదంలో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు
- ట్యూబులు, బోట్ల ద్వారా సాయం చేస్తున్న పీవీపీ సిద్ధార్థ విద్యార్థులు
- వరద బాధితులకు ఆహారం అందించిన హైకోర్టు న్యాయవాది పదిరి రవితేజ
ప్రకాశం బ్యారేజ్‌కు 4 బోట్లు కొట్టుకురావటం వెనుక వైసీపీ కుట్ర ఉండొచ్చు: నిమ్మల
- అమరావతి ముంపుప్రాంతమనే జగన్ కల సాకారానికి కొందరు కృషి: నిమ్మల
- కొన్ని పేటీఎం బృందాలు, పెయిడ్ ఛానళ్లు తీవ్ర దుష్ప్రచారం: మంత్రి నిమ్మల
- 11.5 లక్షల క్యూసెక్కులు పోటెత్తినా అమరావతి చెక్కుచెదరలేదు: నిమ్మల
- అమరావతిపై ఫేక్ న్యూస్ ఎవరూ నమ్మవద్దు: మంత్రి నిమ్మల
- అమరావతిపై విషం చిమ్మడం వైసీపీకి మొదట్నుంచీ అలవాటే: నిమ్మల
- రాజధాని అమరావతికి ఎలాంటి ప్రమాదం లేదు: మంత్రి నిమ్మల
- కృష్ణా కరకట్టపై మంతెన ఆశ్రమం వద్ద షట్టర్‌కు ఐదేళ్లుగా గ్రీజ్ పెట్టలేదు: నిమ్మల
- ప్రకాశం బ్యారేజ్‌కు 4 బోట్లు కొట్టుకురావటం వెనుక వైసీపీ కుట్ర ఉండొచ్చు: నిమ్మల
- వైసీపీ నేతలు అంత దుర్మార్గం చేయగల ఘనులే: మంత్రి నిమ్మల
- బ్యారేజ్ వద్దకు గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడు వస్తున్నారు: నిమ్మల
- రాత్రికి ప్రకాశం బ్యారేజ్ వద్ద మరమ్మతు పనులు చేస్తారు: నిమ్మల
- బుడమేరుకు పడిన 3 గండ్లను ఈ రాత్రికి పూడ్చే ప్రయత్నం: నిమ్మల
- విజయవాడ: పాయకాపురంలో హోంమంత్రి అనిత పర్యటన
- వరద బాధితులకు అందుతున్న సహాయ చర్యలు పరిశీలన
- తమ సమస్యలను మంత్రి అనిత దృష్టికి తీసుకువచ్చిన స్థానికులు
- వైసీపీ నేతల విమర్శలను పట్టించుకోం: మంత్రి నిమ్మల
- వరద బాధితులను ఆదుకోవడంపైనే దృష్టి సారించాం: నిమ్మల
- కృష్ణానదిలో ఇంత వరదనీరు ఎప్పుడూ చూడలేదు: మంత్రి నిమ్మల
- వరద ప్రాంతాల్లో సమర్థంగా సహాయ చర్యలు అందిస్తున్నాం: నిమ్మల
- సీఎం స్వయంగా వరద ప్రాంతాల్లోనే ఉండి పర్యవేక్షిస్తున్నారు: నిమ్మల
- సీఎం రాత్రి కూడా ఇక్కడే ఉండి అధికారులను అప్రమత్తం చేశారు: నిమ్మల
- బుడమేరుకు గండ్లు.. గత ప్రభుత్వ పాలనా వైఫల్యం..: మంత్రి నిమ్మల
- ఐదేళ్లుగా బుడమేరులో లైనింగ్, ఎక్స్‌టెన్షన్ పనులు చేయలేదు: మంత్రి నిమ్మల
- కన్నయనాయుడును ప్రకాశం బ్యారేజ్ వద్దకు తీసుకెళ్తున్నాం: నిమ్మల
- ప్రకాశం బ్యారేజ్ వద్ద అడ్డుకున్న పడవలను తీసేందుకు చర్యలు: నిమ్మల
- సంక్షోభ సమయాల్లో ఎలా పనిచేయాలో చంద్రబాబుకు తెలుసు: నిమ్మల
- భారీవర్షాలు, వరదలతో 481 రైళ్లు రద్దు: దక్షిణమధ్య రైల్వే
- 13 రైళ్లు పాక్షికంగా రద్దు: దక్షిణమధ్య రైల్వే
- 152 రైళ్లు దారి మళ్లింపు: దక్షిణమధ్య రైల్వే
- విజయవాడ: సింగ్‌నగర్ ప్రాంతానికి చేరుకున్న మాజీ సీఎం జగన్
- వరద ప్రాంతాల్లో పర్యటింటి, బాధితులను పరామర్శించిన జగన్
- సికింద్రాబాద్-షాలిమర్, ఎస్ఎంవీటీ బెంగళూరు-హావ్‌డా రైళ్లు రద్దు
- కడప-విశాఖ, భువనేశ్వర్-కేఎస్ఆర్ బెంగళూరు రైళ్లు రద్దు
- ముంపునకు గురైన నదీ పరివాహక ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న అధికారులు
- పెదపులిపాకలోని పలు కాలనీల వాసులను బోట్ల ద్వారా తరలింపు
- ఇళ్లలో చిక్కుకున్న వారిని 2 బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలింపు
- సహాయ చర్యల్లో పాల్గొన్న మంత్రి సవిత, ఎమ్మెల్యే బోడె ప్రసాద్
- గుంటూరు: మంగళగిరి అక్షయపాత్ర సంస్థ రికార్డు
- ఒకేరోజు 3 లక్షల మందికి ఆహారం తయారుచేసిన అక్షయపాత్ర
- విజయవాడ వరద బాధితులకు ఆహార పొట్లాలు సిద్ధం చేసిన అక్షయపాత్ర
- ప్రకాశం బ్యారేజ్‌లో వరద ప్రవాహానికి అడ్డుగా ఉన్న బోట్లు
- ప్రకాశం బ్యారేజ్ 67, 68, 69 పిల్లర్ల వద్ద నిలిచిన బోట్లు
- జలవనరులశాఖ సలహాదారు కన్నయ్యనాయుడును తీసుకొస్తున్న ప్రభుత్వం
- రాత్రి 8 గం.కు ప్రకాశం బ్యారేజ్‌ను పరిశీలించనున్న కన్నయనాయుడు
- విజయవాడ: సింగ్‌నగర్ పైవంతెన వద్ద విద్యుత్‌దీపాలు ఏర్పాటు చేస్తున్న అధికారులు
- ముంపు ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణ ద్వారా సమస్యలు రాకుండా జాగ్రత్తలు
- రెస్క్యూ ఆపరేషన్ ప్రాంతాల్లో రాత్రిపూట సహాయ చర్యలకు ఫ్లాష్‌లైట్ల ఏర్పాటు
- వీఎంసీ కమాండ్ కంట్రోల్ రూమ్ నంబర్ :- +91 81819 60909
- వీఎంసీ ల్యాండ్ లైన్ నంబర్స్ :- 0866-2424172, 0866-2427485
- కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ :- 0866-2575833
- టోల్ ఫ్రీ కలెక్టరేట్ :- 18004256029
- కమాండ్ కంట్రోల్ రూమ్ నంబర్స్ :- 112 , 1070
- క్షేత్రస్థాయి పర్యటన తర్వాత అధికారులతో సీఎం సమీక్ష
- సహాయ చర్యల్లో అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సీఎం
- గత ప్రభుత్వంలో ఉన్న అలసత్వం వదిలించుకోకుంటే సహించబోదన్న సీఎం
- సహాయ చర్యల విషయంలో ఇప్పటికీ కొందరు నిర్లక్ష్యం వీడలేదని ఆగ్రహం
- అధికారుల పనితీరు ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చేలా ఉండాలన్న సీఎం
- తానే రంగంలోకి దిగినా మొద్దునిద్ర వీడకుంటే ఎలా అని సీఎం క్లాస్
- అనుకున్న స్థాయిలో ఆహారం వచ్చినా పంపిణీలో జాప్యంపై సీఎం సమీక్ష
- కొందరు ఉన్నతాధికారుల వైఖరితో పంపిణీలో జాప్యం జరిగిందన్న మంత్రి
- వైసిపీకి అంటకాగిన అధికారులు ఉన్నచోట సమస్యలు ఉన్నాయన్న మంత్రి
- పంపిణీ సక్రమంగా, వేగంగా జరగకుండా చూశారని గుర్తించామన్న మంత్రి
- క్షేత్రస్థాయి పర్యటనలో పరిశీలించిన అంశాలను సీఎంకు తెలిపిన మంత్రి
- వీఆర్‌లో ఉన్నా వరద ప్రాంతాల్లో డ్యూటీకి వచ్చిన కొందరు అధికారులు
- ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలనే సహాయ చర్యలను నిర్లక్ష్యం చేస్తున్నారని చర్చ
- మంత్రి చెప్పిన సమాచారాన్ని తీవ్రంగా తీసుకున్న సీఎం చంద్రబాబు
- ఆయా అధికారులు ఉన్నచోట పంపిణీకి ఆలస్యంపై నివేదిక ఇవ్వాలన్న సీఎం
- ఇలాంటి వైఖరిని సహించేది లేదని ఆయా అధికారులపై సీఎం ఆగ్రహం
- ఆహార పంపిణీలో మరింత సమన్వయంతో పనిచేయాలని సీఎం ఆదేశం
- మరో 3 లక్షల ఆహార ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లు తెప్పించాలన్న సీఎం
- సహాయ చర్యల పర్యవేక్షణ బాధ్యతను వార్డుకు ఒక సీనియర్ అధికారికి అప్పగింత
- వరద బాధితులకు పండ్లు అందించే విషయాన్ని పరిశీలించాలన్న సీఎం
- వివిధ ప్రాంతాల నుంచి పండ్లు తెప్పిస్తున్నామన్న అధికారులు
పోలీసుల ఆంక్షలు
- ప్రకాశం బ్యారేజ్‌కు 12 లక్షల క్యూసెక్కుల వరదనీరు చేరే అవకాశం
- ప్రస్తుతం 11.5 లక్షల ఇన్‌ఫ్లో ఔట్‌ఫ్లోతో కొనసాగుతున్న వరద ఉద్ధృతి
- పెరుగుతున్న కృష్ణా ఉద్ధృతి నదీ పరీవాహక ప్రాంత ప్రజల్లో భయాందోళన
- ప్రకాశంబ్యారేజీ వైపు వచ్చే మార్గాల్లో రాకపోకలపై పోలీసుల ఆంక్షలు
- బ్యారేజీ వద్ద 69పిల్లరును బోటు ఢీకొనడంతో దెబ్బతిన్న ఫిల్లరు
- 67,68,69 పిల్లర్ల మధ్య నీటికి కొట్టుకొచ్చి నిలిచిన ఐధు ఇసుక బోట్లు
- పశుసంవర్థకశాఖ అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష
- వరద ప్రాంతాల్లో పశువైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్న మంత్రి
- రాష్ట్రవ్యాప్తంగా 175 వెటర్నరీ అంబులెన్సులతో వైద్యం: మంత్రి అచ్చెన్నాయుడు
- విజయవాడ బుడమేరు ముంపుప్రాంతాల్లో బోట్లతో మత్స్యకారుల సేవలు
- 163 బోట్లతో 187 మంది మత్స్యకారుల సహాయ చర్యలు
- కృష్ణా పరివాహక ప్రాంతాల్లో రైతులను అప్రమత్తం చేసిన వ్యవసాయశాఖ
- కృష్ణా, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాల్లో పంటనష్టం అధికంగా ఉన్నట్లు అంచనా
- రైతులు వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లకుండా చూడాలని మంత్రి అచ్చెన్న ఆదేశం
వీలైనన్ని ఫుడ్ డెలివరీ డ్రోన్లు సిద్ధం చేసుకోవాలని సీఎం సూచన
- డ్రోన్ల ద్వారా ఆహారం సరఫరా చేసేందుకు సన్నద్ధమవుతున్న ప్రభుత్వం
- లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి డ్రోన్ల ద్వారా అందించేలా ఏర్పాట్లు
- డ్రోన్లతో ఫుడ్ బాస్కెట్స్ తీసుకెళ్లే విధానం పరిశీలించిన సీఎం చంద్రబాబు
- డ్రోన్ల ద్వారా ఫుడ్ డెలివరీ విధానాన్ని సీఎంకు వివరించిన అధికారులు
- డ్రోన్ ద్వారా 10 కిలోల వరకు ఫుడ్, మెడిసిన్, నీరు పంపవచ్చన్న అధికారులు
- వీలైనన్ని ఫుడ్ డెలివరీ డ్రోన్లు సిద్ధం చేసుకోవాలని సీఎం సూచన
- డ్రోన్ల ద్వారా ఇరుకు ప్రాంతాలకు సులువుగా ఆహారం పంపవచ్చన్న అధికారులు
ఈ నెల 5 నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచన
- ఈ నెల 5 నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచన
- అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం
- రాజస్థాన్ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా బందరు వరకు రుతుపవన ద్రోణి
సీఎం పర్యటన
- వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు
- విజయవాడ కలెక్టరేట్‌లో మంత్రులు, అధికారులతో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష
- యనమలకుదురు, పటమట ప్రాంతాల్లో పర్యటించిన సీఎం
- రామలింగేశ్వర నగర్, సితార సెంటర్, భవానీపురంలో సీఎం పర్యటన
- బ్యారేజీ దిగువ లోతట్టు ప్రాంతాలు, ఎగువ ప్రాంతాల్లో పర్యటన
- బోటు ద్వారా నేరుగా బాధితుల వద్దకు వెళ్లిన సీఎం చంద్రబాబు
- బాధితుల వద్దకు వెళ్లి వారి కష్టాలు తెలుసుకున్న సీఎం చంద్రబాబు
- బాధితుల ఫిర్యాదుల పరిష్కారానికి సీఎం చంద్రబాబు ఆదేశాలు
- ముంపు నివారణ చర్యలను క్షేత్రస్థాయి నుంచే పర్యవేక్షించిన సీఎం
అల్పాహారం, భోజనం అందిస్తున్నట్లు దివీస్ సంస్థ ఎండీ వెల్లడి
- వరద బాధితులకు దివీస్ సంస్థ చేయూత
- రోజూ 1.70 లక్షల మందికి అక్షయపాత్ర ద్వారా ఆహారం అందిస్తున్న దివీస్
- అల్పాహారం, భోజనం అందిస్తున్నట్లు దివీస్ సంస్థ ఎండీ వెల్లడి
- 5 రోజులపాటు ఆహారం అందిస్తామన్న దివీస్ సంస్థ ఎండీ మురళీకృష్ణ
- సుమారు 2.50 కోట్లు అంచనాతో ఆహారాన్ని తయారు చేయిస్తున్న దివీస్
సీఎం పర్యటన
- వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు
- విజయవాడ కలెక్టరేట్‌లో మంత్రులు, అధికారులతో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష
- యనమలకుదురు, పటమట ప్రాంతాల్లో పర్యటించిన సీఎం
- రామలింగేశ్వర నగర్, జక్కంపూడి, భవానీపురంలో సీఎం పర్యటన
- బ్యారేజీ దిగువ లోతట్టు ప్రాంతాలు, ఎగువ ప్రాంతాల్లో పర్యటన
- బోటు ద్వారా నేరుగా బాధితుల వద్దకు వెళ్లిన సీఎం చంద్రబాబు
- బాధితుల వద్దకు వెళ్లి వారి కష్టాలు తెలుసుకున్న సీఎం చంద్రబాబు
- బాధితుల ఫిర్యాదుల పరిష్కారానికి సీఎం చంద్రబాబు ఆదేశాలు
- ముంపు నివారణ చర్యలను క్షేత్రస్థాయి నుంచే పర్యవేక్షించిన సీఎం
విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజూ పర్యటించా: సీఎం
- విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజూ పర్యటించా: సీఎం
- బాధితులకు అందుతున్న సాయాన్ని స్వయంగా పర్యవేక్షించా: సీఎం
- సహాయక చర్యల్లో వేగం పెంచి ప్రజలకు భరోసా ఇచ్చాం: సీఎం
- ప్రజల భద్రత మా బాధ్యత: ముఖ్యమంత్రి చంద్రబాబు
- ఊహించని విపత్తు నుంచి ప్రజలను త్వరగా కాపాడాలి: సీఎం
- బాధితులు ధైర్యంగా ఉండాలని కోరుతున్నా: సీఎం చంద్రబాబు
తెనాలిలో నీటమునిగిన గిరిజన బాలికల హాస్టల్
- తెనాలిలో నీటమునిగిన గిరిజన బాలికల హాస్టల్‌ను పరిశీలించిన మంత్రి సంధ్యారాణి
- హాస్టల్ గదుల్లోకి చేరిన వరద నీటితో తడిసిన వంట సామాన్లు, సరకులు
- హాస్టల్లోకి వరద రావడంతో పడుకునే వీలులేక విద్యార్థినులకు ఇబ్బందులు
- తెనాలి: సమీపంలోని మున్సిపల్ స్కూలుకు విద్యార్థినుల తరలింపు
- విద్యార్థులు భయపడొద్దు.. మంచి భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చిన మంత్రి సంధ్యారాణి
మంత్రి గొట్టిపాటి రవి ఆధ్వర్యంలో సుమారు 30 వేల మందికి ఆహారం తయారీ
- అద్దంకిలోని కామేపల్లి కల్యాణ మండపంలో వరద బాధితులకు ఆహార ఏర్పాట్లు
- మంత్రి గొట్టిపాటి రవి ఆధ్వర్యంలో సుమారు 30 వేల మందికి ఆహారం తయారీ
- ఆహారంతో పాటు తాగునీటి పంపిణీకి సిద్ధం చేస్తున్న తెదేపా నాయకులు
ముంపు ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా ఆహారం, మంచినీటి సరఫరాకు చర్యలు
- వరద సహాయచర్యలకు రంగంలోకి దిగిన నేవీ హెలికాప్టర్లు
- ఇప్పటివరకు నేవీ నుంచి మూడు హెలికాప్టర్లు రాక
- హకీంపేట ఎయిర్‌బేస్ నుంచి బయల్దేరిన మరో 4 హెలికాప్టర్లు
- ముంపు ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా ఆహారం, మంచినీటి సరఫరాకు చర్యలు
- ఇప్పటివరకు 2,97,500 మందికి ఆహారం, మంచినీరు అందజేత
- నిరాశ్రయుల కోసం విజయవాడలో 78 పునరావాస శిబిరాలు ఏర్పాటు
- కృష్ణా జిల్లావ్యాప్తంగా 17 చోట్ల తెగిన రోడ్లు, పునరుద్ధరణకు చర్యలు
- వరద బాధితులకు ఆహారం, తాగునీటి సరఫరాలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
వరద ముంపు ప్రాంతాల్లో కొనసాగుతున్న సీఎం పర్యటన
- వరద ముంపు ప్రాంతాల్లో కొనసాగుతున్న సీఎం పర్యటన
- యనమలకుదురు, పటమట ప్రాంతాల్లో సీఎం పర్యటన
- రామలింగేశ్వర నగర్, జక్కంపూడి, భవానీపురంలో సీఎం పర్యటన
- బ్యారేజీ దిగువ లోతట్టు ప్రాంతాలు, ఎగువ ప్రాంతాల్లో పర్యటన
- బోటు ద్వారా నేరుగా బాధితుల వద్దకు వెళ్తున్న సీఎం చంద్రబాబు
- బాధితుల వద్దకు వెళ్లి వారి కష్టాలు తెలుసుకుంటున్న చంద్రబాబు
- బాధితుల ఫిర్యాదుల పరిష్కారానికి సీఎం చంద్రబాబు ఆదేశాలు
- ముంపు నివారణ చర్యలను క్షేత్రస్థాయి నుంచే పర్యవేక్షిస్తున్న సీఎం
వరదల్లో మృతిచెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన రాహుల్
- ఏపీ, తెలంగాణలో వరదలు, వర్షాలపై ఎక్స్‌లో స్పందించిన రాహుల్‌గాంధీ
- వరదల్లో మృతిచెందిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన రాహుల్
- వరదల దృష్ట్యా సహాయక చర్యల్లో ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త పాల్గొనాలి: రాహుల్
- విపత్తులో నష్టపోయిన వారికి అన్ని రకాలుగా ప్రభుత్వాలు ఆదుకోవాలి: రాహుల్
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు
- విజయవాడ భవానీపురంలో సీఎం చంద్రబాబు పర్యటన
- వరద బాధితులను అడిగి సమస్యలు తెలుసుకుంటున్న సీఎం
ప్రమాదకరంగా కరకట్ట
- బాపట్ల జిల్లా: కొల్లూరు మం. పెద్దపులివర్రు వద్ద ప్రమాదకరంగా కరకట్ట
- కరకట్ట పైనుంచి నీటి ప్రవాహం, పెదపులివర్రు గ్రామంలోకి వరద
- ఇసుక మూటలు అడ్డుగా పెట్టి నీటిని అదుపు చేస్తున్న అధికారులు
ప్రకాశం బ్యారేజ్ మొత్తం 70 గేట్లు తెరిచి సముద్రంలోకి నీటి విడుదల
- ప్రకాశం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక
- విజయవాడ: ప్రకాశం బ్యారేజీకి పెరుగుతున్న వరద ఉద్ధృతి
- ప్రకాశం బ్యారేజ్ నుంచి 11.42 లక్షల క్యూసెక్కులు విడుదల
- ప్రకాశం బ్యారేజ్ నుంచి కాల్వలకు 500 క్యూసెక్కులు విడుదల
- ప్రకాశం బ్యారేజ్ మొత్తం 70 గేట్లు తెరిచి సముద్రంలోకి నీటి విడుదల
- ప్రకాశం బ్యారేజ్ వద్ద 24.5 అడుగుల మేర కొనసాగుతున్న నీటిమట్టం
వివిధ శాఖల మధ్య సమన్వయ లోపం సరిదిద్దే బాధ్యతలు తీసుకున్న లోకేశ్
- వివిధ శాఖల మధ్య సమన్వయ లోపం సరిదిద్దే బాధ్యతలు తీసుకున్న లోకేశ్
- విజయవాడ కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో మాట్లాడిన మంత్రి లోకేశ్
- ఒకేచోట ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, మత్సశాఖ బోట్లు ఉండటాన్ని గుర్తించిన లోకేశ్
- ఎక్కడెక్కడ ఎలాంటి బోట్లు అవసరమో వాటిని పంపే ఏర్పాట్లు చేసిన లోకేశ్
- సొంత ఖర్చులతో అద్దంకిలో 20 వేలమందికి ఆహారం తయారుచేయిస్తున్న గొట్టిపాటి
- రాత్రి భోజనాల సరఫరాకు బాధ్యత తీసుకున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్
నాలుగు బోట్లలో ఆహార పదార్థాలు
- నాలుగు బోట్లలో ఆహార పదార్థాలు పంపాం: అచ్చెన్నాయుడు
- హెలికాప్టర్ ద్వారా కూడా ఆహారం అందిస్తున్నాం: అచ్చెన్నాయుడు
- వృద్ధులు, చిన్నారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: మంత్రి అచ్చెన్న
ప్రతి రెండు డివిజన్లకు ఓ మంత్రి బాధ్యత తీసుకుని సహాయచర్యలు: పయ్యావుల
- ప్రజల అవసరాలు తీర్చడంలో ఆర్థికశాఖకు పరిమితులొద్దని సీఎం ఆదేశించారు: పయ్యావుల
- విపత్తు నిర్వహణ శాఖ ఖర్చు విషయంలో వెనకాడవద్దని సీఎం సూచించారు: పయ్యావుల
- ప్రతి రెండు డివిజన్లకు ఓ మంత్రి బాధ్యత తీసుకుని సహాయచర్యలు: పయ్యావుల
- లోకేష్ నేతృత్వంలోని మంత్రుల బృందం బాధ్యతలు తీసుకుని వ్యవహరిస్తోంది: పయ్యావుల
- ముఖ్యమంత్రి ముందుచూపే విజయవాడ నగరాన్ని కాపాడింది: పయ్యావుల కేశవ్
- గత ఐదేళ్లు పూడికలు తీయకపోవడమే ఇంత నష్టానికి కారణం: పయ్యావుల
ప్రకాశం బ్యారేజీపై రాకపోకలు నిలిపివేసిన అధికారులు
- ప్రకాశం బ్యారేజీపై రాకపోకలు నిలిపివేసిన అధికారులు
- వరద ప్రవాహం పెరగడంతో బ్యారేజీపై రాకపోకలు నిలిపివేత
- బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేసిన పోలీసులు
హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాల మళ్లింపు
- ఎన్టీఆర్ జిల్లా గరికపాడు వద్ద తెగిపోయిన వంతెన
- హైదరాబాద్-విజయవాడ జాతీయరహదారిపై నిలిచిన రాకపోకలు
- నిన్న మధ్యాహ్నం నుంచి నిలిచిపోయిన రాకపోకలు
- పాలేరు వాగు ఉద్ధృతి కారణంగా కోతకు గురైన రహదారి
- హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వాహనాల మళ్లింపు
కరకట్ట బలహీనంగా ఉన్నచోట్ల మరమ్మతులు చేస్తున్నాం: మంత్రి మనోహర్
- గుంటూరు జిల్లా పరిధిలో కృష్ణా కరకట్టను పరిశీలించిన మంత్రి మనోహర్
- కరకట్ట బలహీనంగా ఉన్నచోట్ల మరమ్మతులు చేస్తున్నాం: మంత్రి మనోహర్
- కృష్ణానదికి వరద కారణంగా తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేశాం: మనోహర్
- మొత్తం 12 చోట్ల కరకట్ట బలహీనంగా ఉన్నట్లు గుర్తించాం: మనోహర్
- ప్రజల సహకారంతో అధికారులు కరకట్ట రక్షణ చర్యలు చేపట్టారు
- కరకట్టను కాపాడటంతో పాటు ప్రాణనష్టం జరగకుండా చూస్తాం: మంత్రి మనోహర్
పల్నాడు జిల్లా వైకుంఠపురంలో కరకట్ట వద్ద గ్రామస్థుల సహాయచర్యలు
- పల్నాడు జిల్లా వైకుంఠపురంలో కరకట్ట వద్ద గ్రామస్థుల సహాయచర్యలు
- కరకట్ట తెగితే ప్రమాదమని ముందే మట్టికట్టలు వేసిన గ్రామస్థులు
- రాత్రంతా మేల్కొని మట్టి, ఇసుక కట్టలు వేశామన్న గ్రామస్థులు
- ఇంతవరకు ఎప్పుడూ ఇంత వరద చూడలేదంటున్న గ్రామస్థులు
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు ప్రకాశం జిల్లా నుంచి సహాయబృందాలు
- కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు ప్రకాశం జిల్లా నుంచి సహాయబృందాలు
- కొత్తపట్నం, సింగరాయకొండ మండలాల నుంచి 35 బోట్లు తరలింపు
- మధ్యాహ్నానికి 25 వేలు, రాత్రికి 50 వేల భోజన ప్యాకెట్లు పంపిస్తున్నాం: కలెక్టర్
- రెవెన్యూ, ఇతర అధికారులను కూడా డిప్యుటేషన్ వేస్తున్నాం: కలెక్టర్ తమీమ్ అన్సారియా
వేల ఎకరాల్లో నీట మునిగిన పంటలు
- కృష్ణా జిల్లా: గన్నవరం మండలం ముస్తాబాదను ముంచెత్తిన వరద
- పురుషోత్తపట్నం, వెదురుపావులూరు శివారు ప్రాంతాలను ముంచెత్తిన వరద
- కృష్ణా జిల్లా: వేల ఎకరాల్లో నీట మునిగిన పంటలు
- కృష్ణా జిల్లా: ముస్తాబాద వద్ద జగనన్న కాలనీని చుట్టుముట్టిన వరద
- కృష్ణా జిల్లా: ఇళ్లలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొస్తున్న గ్రామస్థులు
- సమీపంలోని కమ్యూనిటీ హాలులో పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి తరలింపు
- ముస్తాబాదలో నిన్న విధులకు వెళ్లి చిక్కుకుపోయిన పలువురు ఉద్యోగులు
- కృష్ణా జిల్లా: ఉదయం హెలికాప్టర్ ద్వారా బాధితులకు అల్పాహారం అందజేత
ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను ఖాళీ చేయిస్తున్న అధికారులు
- విజయవాడ: ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను ఖాళీ చేయిస్తున్న అధికారులు
- పెదపులిపాకలోని పలు కాలనీల్లో ఉన్న ప్రజలను ఇంజిన్ బోట్ల ద్వారా తరలింపు
- వరద బాధితులను 2 ఇంజిన్ బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలింపు
- సహాయచర్యల్లో పాల్గొన్న పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్
హెలికాప్టర్ ద్వారా వరద బాధితులకు ఆహార పొట్లాలు అందజేత
- విజయవాడ సింగ్‌నగర్ తదితర ప్రాంతాల్లో ఆహార పొట్లాల పంపిణీ
- హెలికాప్టర్ ద్వారా వరద బాధితులకు ఆహార పొట్లాలు అందజేత
కృష్ణలంక, జక్కంపూడి ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన
- వరద ముంపు ప్రాంతాల్లో మరోసారి సీఎం చంద్రబాబు పర్యటన
- కృష్ణలంక, జక్కంపూడి ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన
- ప్రకాశం బ్యారేజీ దిగువన వరద పరిస్థితిని పరిశీలించిన సీఎం
- పటమట, యనమలకుదురు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటన
- లోతట్టు ప్రాంతాల ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న సీఎం
- ప్రజలకు ధైర్యం చెబుతూ, అధికారులను అప్రమత్తం చేసిన సీఎం
మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వద్ద నీటి లీకేజీని పరిశీలించిన మంత్రి
- కృష్ణా నది కరకట్ట వద్ద మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటన
- మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వద్ద నీటి లీకేజీని పరిశీలించిన మంత్రి
- మధ్యాహ్నంలోగా కృష్ణా నది వరద ప్రవాహం తగ్గే అవకాశం
- బ్యారేజీ గేట్ల మరమ్మతులకు కన్నయ్యనాయుడు సలహాలు తీసుకుంటున్నాం: నిమ్మల
- వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం: మంత్రి నిమ్మల
- బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి: నిమ్మల
- గండ్లకు కొట్టుకుపోయిన వంతెనకు రాత్రంతా పనిచేసి అప్రోచ్ పూర్తిచేశాం: మంత్రి నిమ్మల
వరద ముంపు ప్రాంతాల్లో మరోసారి సీఎం చంద్రబాబు పర్యటన
- వరద ముంపు ప్రాంతాల్లో మరోసారి సీఎం చంద్రబాబు పర్యటన
- కృష్ణలంక, జక్కంపూడి ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు
బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి: నిమ్మల
- ఎన్టీఆర్ జిల్లా: బుడమేరు వరదపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష
- బుడమేరు గండ్ల పూడ్చివేత పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి: నిమ్మల
- గండ్లకు కొట్టుకుపోయిన వంతెనకు రాత్రంతా పనిచేసి అప్రోచ్ పూర్తిచేశాం: మంత్రి నిమ్మల
తక్షణమే కరకట్టల మరమ్మతు పనులు చేపట్టాలి: మంత్రి అనగాని
- తక్షణమే కరకట్టల మరమ్మతు పనులు చేపట్టాలి: మంత్రి అనగాని
- కట్టలు బలహీనంగా ఉన్నచోట్ల పటిష్టతపై దృష్టిపెట్టాలి: మంత్రి అనగాని
- రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాలి: మంత్రి అనగాని
- గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కరకట్టలు దెబ్బతిన్నాయి: మంత్రి అనగాని
- కరకట్టల పటిష్టతపై ప్రత్యేక దృష్టి పెడతాం: మంత్రి అనగాని సత్యప్రసాద్
- వర్షాలకు పాము కాటుకు గురికాకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి: మంత్రి అనగాని
వరద ముంపు నుంచి ప్రజల ప్రాణాలను కాపాడటమే మా ప్రాధాన్యత: అచ్చెన్న
- వరద బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటాం: మంత్రి అచ్చెన్నాయుడు
- వరద ముంపు నుంచి ప్రజల ప్రాణాలను కాపాడటమే మా ప్రాధాన్యత: అచ్చెన్న
- ఎంత వరద వచ్చినా అందుకు అనుగుణంగా సహాయచర్యలు: మంత్రి అచ్చెన్న
రేపల్లె మండలంలో పలు గ్రామాలు జలదిగ్భందం
కృష్ణమ్మ ఉద్ధృతికి బాపట్ల జిల్లాలో పలు గ్రామాలు జలదిగ్భందమయ్యాయి. రేపల్లె మండలం పెనుమూడి , పల్లెపాలెంలోని సుమారు 90 ఇళ్లు పూర్తిగా నీటమునిగాయి. ఇప్పటికే నిర్వాసితులు పునరావాస కేంద్రాలకు చేరుకున్నారు. ఇళ్లలో నుంచి ముఖ్యమైన సామాన్లను కొందరు బోట్ల సాయంతో ఒడ్డుకు చేర్చుకుంటున్నారు. వరద ఉద్ధృతి ఇలానే కొనసాగితే ఇళ్లు కొట్టుకుపోతాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రకాశం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక
- ప్రకాశం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక
- విజయవాడ: ప్రకాశం బ్యారేజీకి పెరుగుతున్న వరద ఉద్ధృతి
- ప్రకాశం బ్యారేజ్ నుంచి 11.40 లక్షల క్యూసెక్కులు విడుదల
- ప్రకాశం బ్యారేజ్ నుంచి కాల్వలకు 500 క్యూసెక్కులు విడుదల
- ప్రకాశం బ్యారేజ్ మొత్తం 70 గేట్లు తెరిచి సముద్రంలోకి నీటి విడుదల
- ప్రకాశం బ్యారేజ్ వద్ద 24.4 అడుగుల మేర కొనసాగుతున్న నీటిమట్టం
వర్షాలు, వరదల కారణంగా 432 రైళ్లు రద్దు చేసిన ద.మ.రైల్వే
- వర్షాలు, వరదల కారణంగా 432 రైళ్లు రద్దు చేసిన ద.మ.రైల్వే
- 140 రైళ్లు దారి మళ్లింపు, మరో 13 రైళ్లు పాక్షిక రద్దు: ద.మ.రైల్వే
- కాజీపేట-డోర్నకల్, డోర్నకల్-విజయవాడ రైళ్లు రద్దు
- విజయవాడ-గుంటూరు, గుంటూరు-విజయవాడ రైళ్లు రద్దు
- విజయవాడ-డోర్నకల్, డోర్నకల్-కాజీపేట రైళ్లు రద్దు
- దిల్లీ-సెంట్రల్ చెన్నై, దానాపూర్-బెంగళూరు రైళ్లు మళ్లింపు
- రాయపురం-పటేల్ నగర్, హజ్రత్ నిజాముద్దీన్-రేణిగుంట రైళ్లు మళ్లింపు
విజయవాడకు తలెత్తిన ముంపును చూసి చలించిపోయిన అక్కాచెల్లెలు
- విజయవాడకు తలెత్తిన ముంపును చూసి చలించిపోయిన అక్కాచెల్లెలు
- ముఖ్యమంత్రి చంద్రబాబుకు విరాళం అందజేసిన విజయవాడ అక్కాచెల్లెలు
- వరద బాధితుల కోసం రూ.1.50 లక్షలు ఇచ్చిన విజయలక్ష్మి, నిర్మలా దేవి రాణి
- నగర ప్రజల బాధలు చూసి తోచిన సాయం ఇవ్వాలనిపించి వచ్చామన్న మహిళలు
- అక్కాచెల్లెళ్ల స్పూర్తిని అభినందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
ప్రకాశం బ్యారేజ్‌పై వాహనాల రాకపోకలను నిలిపివేసిన పోలీసులు
- విజయవాడ: ప్రకాశం బ్యారేజ్‌పై వాహనాల రాకపోకలను నిలిపివేసిన పోలీసులు
- ప్రకాశం బ్యారేజ్‌కి భారీగా వరద నీటి చేరికతో వాహనాలు నిలిపివేత
- విజయవాడ: ప్రకాశం బ్యారేజ్ గేట్లకు అడ్డుపడిన బోట్లు
- ప్రజలు, వాహనాలతో రద్దీగా మారిన ప్రకాశం బ్యారేజ్
కరకట్ట వద్ద గండిని వెంటనే పూడ్చివేశాం: కలెక్టర్ నాగలక్ష్మి
- గుంటూరు జిల్లా కంట్రోల్ రూమ్ నుంచి వరద పరిస్థితిపై కలెక్టర్ సమీక్ష
- గుంటూరు జిల్లా కలెక్టరేట్‌కు వస్తున్న ఫిర్యాదులపై సమీక్షిస్తున్న కలెక్టర్ నాగలక్ష్మి
- లంక ప్రాంతాల్లో ప్రజలను హెలికాప్టర్‌లో సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నాం: కలెక్టర్
- కరకట్ట వద్ద గండిని వెంటనే పూడ్చివేశాం: కలెక్టర్ నాగలక్ష్మి
- వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నాం: కలెక్టర్
- ప్రజలు ఏమైనా సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్‌కు తెలపాలి: కలెక్టర్
- పలుచోట్ల కాల్వలకు పడిన గండ్లును పూడ్చేందుకు చర్యలు: కలెక్టర్
వ్యవసాయ అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించిన మంత్రి అచ్చెన్న
- వ్యవసాయ అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించిన మంత్రి అచ్చెన్న
- కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో వ్యవసాయ క్షేత్రాలకు రైతులెవరూ వెళ్లొద్దని ఆదేశాలు
- ప్రాణహాని లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు
- తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశం
ముంపు ప్రాంతాల్లో సహాయచర్యల్లో మత్స్యశాఖ నుంచి 109 బోట్లు
- ముంపు ప్రాంతాల్లో సహాయచర్యల్లో మత్స్యశాఖ నుంచి 109 బోట్లు
- మంత్రి అచ్చెన్న ఆదేశాలతో ఇప్పటికే ముంపు ప్రాంతాలకు చేరుకున్న 56 బోట్లు
- మరో 53 బోట్లు తక్షణమే పంపాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు
- కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, కాకినాడ, ప్రకాశం జిల్లాల నుంచి బోట్లు తరలించిన అధికారులు
బుడమేరు వరద ధాటికి జలమయమైన రెండు గ్రామాలు
- కృష్ణా: బుడమేరు వరద ధాటికి జలమయమైన రెండు గ్రామాలు
- గన్నవరం మండలం ముస్తాబాద, సావరగూడెం గ్రామాలు జలమయం
- కృష్ణా: కవులూరు గేట్లు ఎత్తడంతో ముస్తాబాదను చుట్టుముట్టిన వరద
- విజయవాడ సింగ్‌నగర్ మీదుగా ఇన్నర్ రింగ్ పరిసరాల్లోకి భారీగా చేరిన వరద
- బాధితులను ట్రాక్టర్, జేసీబీల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలింపు
అధికారులు కూడా గ్రామంలోకి వెళ్లలేని పరిస్థితి
- పల్నాడు జిల్లాలో జలదిగ్బంధంలో హరిశ్చంద్రపురం
- హరిశ్చంద్రపురం గ్రామానికి బాహ్య ప్రపంచంతో తెగిన సంబంధాలు
- పల్నాడు జిల్లా: అధికారులు కూడా గ్రామంలోకి వెళ్లలేని పరిస్థితి
- పల్నాడు జిల్లా: డాబాలపైకి ఎక్కి బిక్కుబిక్కుమంటున్న గ్రామస్థులు
- అమరావతి-విజయవాడ మార్గంలో నిలిచిపోయిన రాకపోకలు
- పడవల సాయంతో గ్రామస్థులకు ఆహారం సరఫరా చేస్తున్న అధికారులు
భీమవరంలో నాలుగు చోట్ల 40 వేల ఆహార పొట్లాలు సిద్ధం
- విజయవాడ వరద బాధితుల కోసం ప.గో. జిల్లాలో ఆహారం తయారీ
- భీమవరంలో నాలుగు చోట్ల 40 వేల ఆహార పొట్లాలు సిద్ధం
- ఇప్పటికే 20 వేల పొట్లాలను విజయవాడ తరలించిన అధికారులు
జాతీయరహదారిపై 3 కి.మీ మేర నిలిచిన లారీలు
- సూర్యాపేట: కోదాడ బైపాస్ వద్ద భారీగా నిలిచిన సరకు లారీలు
- విజయవాడ-హైదరాబాద్ జాతీయరహదారిపై 3 కి.మీ మేర నిలిచిన లారీలు
- గరికపాడు వద్ద రోడ్డు కోతకు గురవడంతో నిన్నటి నుంచి ఎన్‌హెచ్‌పై లారీలు
- నిన్నటి నుంచి జాతీయరహదారిపై లారీ డ్రైవర్ల పడిగాపులు
- మిర్యాలగూడ వైపు వెళ్లే లారీలను వెనక్కి మళ్లిస్తున్న అధికారులు
కేంద్రం నుంచి విజయవాడకు ప్రత్యేకంగా 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
- కేంద్రం నుంచి విజయవాడకు ప్రత్యేకంగా 10 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
- తమిళనాడు నుంచి 3, పంజాబ్ నుంచి 4, ఒడిశా నుంచి 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
- పవర్ బోట్లు, రెస్క్యూ పరికరాలతో చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
- ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా సహాయచర్యల్లో 8 ఎన్డీఆర్ఎఫ్, 10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు
- ఇప్పటికే వాయుమార్గం ద్వారా సహాయచర్యల్లో హెలికాప్టర్లు
- కాసేపట్లో విజయవాడ రానున్న మరో 4 హెలికాప్టర్లు
ప్రకాశం బ్యారేజీకి పెరుగుతున్న వరద ఉద్ధృతి
- ప్రకాశం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక
- విజయవాడ: ప్రకాశం బ్యారేజీకి పెరుగుతున్న వరద ఉద్ధృతి
- ప్రకాశం బ్యారేజ్ నుంచి 11.38 లక్షల క్యూసెక్కులు విడుదల
- ప్రకాశం బ్యారేజ్ నుంచి కాల్వలకు 500 క్యూసెక్కులు విడుదల
- ప్రకాశం బ్యారేజ్ మొత్తం 70 గేట్లు తెరిచి సముద్రంలోకి నీటి విడుదల
- ప్రకాశం బ్యారేజ్ వద్ద 24.3 అడుగుల మేర కొనసాగుతున్న నీటిమట్టం
కాసేపట్లో విజయవాడ వరద ప్రాంతాల్లోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
- గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
- లుథియానా నుంచి ఆర్మీ విమానంలో గన్నవరానికి బృందాలు
- 100 మందితో విమానాశ్రయం చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
- ఆర్మీ హెలికాప్టర్, బోట్లతో కాసేపట్లో విజయవాడ వరద ప్రాంతాల్లోకి బృందాలు
నిన్న రాత్రి నుంచి ఆహారం అందలేదంటున్న కాలనీ వాసులు
- విజయవాడ సింగ్‌నగర్‌లో అమరావతి కాలనీ వాసుల ఆవేదన
- నిన్న రాత్రి నుంచి ఆహారం అందలేదంటున్న కాలనీ వాసులు
- పిల్లల కోసం పాలు, మందులు అందజేయాలని కోరుతున్న బాధితులు
బాహ్య ప్రపంచంతో తెగిపోయిన సంబంధాలు
- పల్నాడు జిల్లాలో జలదిగ్బంధంలో పెదమద్దూరు
- బాహ్య ప్రపంచంతో తెగిపోయిన సంబంధాలు
- అధికారులు కూడా గ్రామంలోకి వెళ్లలేని పరిస్థితి
- భవనాలపైకి ఎక్కి బిక్కుబిక్కుమంటున్న గ్రామస్థులు
సహాయచర్యలకు మంత్రుల బృందాన్ని సమన్వయం చేస్తున్న మంత్రి లోకేశ్
- విజయవాడ కలెక్టరేట్‌కు చేరుకున్న మంత్రులు లోకేశ్, అచ్చెన్న, పార్థసారథి
- సహాయచర్యలకు మంత్రుల బృందాన్ని సమన్వయం చేస్తున్న మంత్రి లోకేశ్
- ఆర్టీజీఎస్ సమాచారంతో క్షేత్రస్థాయికి బృందాలను పంపిస్తున్న మంత్రి లోకేశ్
మరమ్మతు పనుల్లో 500 మంది రైల్వే సిబ్బంది, కార్మికులు
- మహబూబాబాద్ జిల్లాలో ధ్వంసమైన రైల్వేట్రాక్‌కు మరమ్మతులు
- కేసముద్రం, ఇంటికన్నె, తాళ్లపూసలపల్లి మార్గంలో ధ్వంసమైన రైల్వేట్రాక్
- ధ్వంసమైన రైల్వేట్రాక్‌కు శరవేగంగా మరమ్మతులు చేస్తున్న సిబ్బంది
- సాయంత్రం వరకు మరమ్మతు పనులు పూర్తయ్యే అవకాశం
- మరమ్మతు పనుల్లో 500 మంది రైల్వే సిబ్బంది, కార్మికులు
- మరమ్మతులు పర్యవేక్షిస్తున్న 15 మంది సీనియర్ అధికారులు
- మరమ్మతు పనులు పరిశీలించిన ద.మ.రైల్వే జీఎం అరుణ్ కుమార్
- రేపు ఉదయం కల్లా రైళ్లు నడపడానికి చర్యలు: ద.మ.రైల్వే జీఎం
మరోసారి సీఎం చంద్రబాబు సమీక్ష
- ఉన్నతాధికారులతో మరోసారి సమీక్షించిన సీఎం చంద్రబాబు
- హెలికాప్టర్ల ద్వారా ఆహారం, నీళ్లు, పాలు అందజేయాలని సీఎం ఆదేశం
- మూడు పూటలా బాధితులకు ఆహారం అందించాలన్న సీఎం
- చిన్నారులు, గర్భిణులను పునరావాస కేంద్రాలకు తరలించాలన్న సీఎం
- బోట్లు ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో మ్యాపింగ్ చేయాలని సీఎం ఆదేశం
- ఒకే ప్రాంతంలో కాకుండా మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్లాలన్న సీఎం
- కృష్ణా నదికి వస్తున్న వరద నీటిపైనా సీఎం సమీక్ష
- మధ్యాహ్నానికి కొంతమేరకు వరద ప్రవాహం తగ్గుతుందని అంచనా
- లంకగ్రామాల్లో సమస్యలపై అధికారులను అప్రమత్తం చేయాలని కలెక్టర్లకు ఆదేశం
కృష్ణమ్మ ఉద్ధృతి
- బాపట్ల జిల్లా: పెనుమూడి వారధి వద్ద కృష్ణమ్మ ఉద్ధృతి
- బాపట్ల జిల్లా: నీటమునిగిన కరకట్ట వెంబడి చేపల చెరువులు
ప్రాణాలు కాపాడుకునేందుకు భవనాల పైకి చేరుకున్న ప్రజలు
- ఎన్టీఆర్ జిల్లా: కృష్ణా నది మునేరుకు వరద పోటు
- కంచికచర్ల మండలంలోని గ్రామాల్లోకి ప్రవేశించిన వరద ప్రవాహం
- ఎస్.అమరవరం, మొగులూరు, మున్నలూరులో వరద ప్రవాహం
- ఎన్టీఆర్ జిల్లా: చెవిటికల్లు, కొత్తపేట గ్రామాల్లోకి ప్రవేశించిన మున్నేరు వరద
- ఎన్టీఆర్ జిల్లా: ప్రాణాలు కాపాడుకునేందుకు భవనాల పైకి చేరుకున్న ప్రజలు
- కంచికచర్ల మండలంలో ఏటుపట్టు గ్రామాలకు నిలిచిన రాకపోకలు
తాడేపల్లిలో మహానాడు కాలనీని చుట్టుముట్టిన వరద నీరు
- తాడేపల్లిలో మహానాడు కాలనీని చుట్టుముట్టిన వరద నీరు
- కాలనీలో రెండు వీధులు మునిగిపోవటంతో ప్రమాదకర పరిస్థితులు
- తాడేపల్లిలో కరకట్ట వెంట ప్రమాదకరంగా పరిస్థితులు
- తాడేపల్లి మం. ఉండవల్లి కరకట్ట వెంట మంతెన ఆశ్రమం మునక
- ఆశ్రమంలో వారిని బయటకు తెచ్చేందుకు అధికారులు, పోలీసుల చర్యలు
నీటమునిగిన 400 ఇళ్లు
- గుంటూరు జిల్లా: కొల్లిపర మం. బొమ్మువానిపాలెం, అన్నవరపులంక నీటమునక
- బొమ్మువానిపాలెం, అన్నవరపులంకలో నీటమునిగిన 400 ఇళ్లు
- ఎత్తుగా ఉన్న ఇళ్లపై ఎక్కిన జనం, సురక్షిత ప్రాంతాలకు తరలించే యత్నం
సహాయచర్యలు మరింత ముమ్మరం చేస్తున్నాం: సీఎం చంద్రబాబు
- వరద బాధితులకు ఆహారం, తాగునీటి పంపిణీ జరుగుతోంది: సీఎం
- సహాయచర్యలు మరింత ముమ్మరం చేస్తున్నాం: సీఎం చంద్రబాబు
- ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. అందరికీ సాయం అందుతుంది: సీఎం
- 6 హెలికాప్టర్లు వస్తున్నాయి... బోట్ల సంఖ్య కూడా పెంచుతున్నాం: సీఎం
- వర్షం పడుతున్నా వరద బాధితులకు సాయం ఆపట్లేదు: సీఎం
- కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడమే మా మొదటి ప్రాధాన్యత: సీఎం
- ప్రకాశం బ్యారేజీ నుంచి ఎప్పటికీ రానంత వరద వస్తోంది: సీఎం
- నేనే స్వయంగా వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నా: సీఎం చంద్రబాబు
- వరద బాధితులకు అన్నిరకాల సహాయ కార్యక్రమాలు అందజేస్తున్నాం: సీఎం
విజయవాడలో నీటమునిగిన ప్రధాన రహదారులు
- విజయవాడలోని పలు కాలనీల్లో నీటమునిగిన ప్రధాన రహదారులు
- నీటమునిగిన రామలింగేశ్వర నగర్, యనమలకుదురు ప్రాంతాలు
- విజయవాడ: సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్న వందలమంది వరద బాధితులు
- వరదనీటి భయంతో యనమలకుదురులోని పలు కాలనీవాసుల ఆవేదన
- అపార్టుమెంట్ల మొదటి అంతస్తు వరకు చేరుకుంటున్న వరద నీరు
పునరావాస కేంద్రాలకు తరలివెళ్లేలా ప్రజలు సహకరించాలి: మంత్రి గొట్టిపాటి
- గతంలో ఎప్పుడూ చూడని వరద ఇప్పుడు చూస్తున్నాం: మంత్రి గొట్టిపాటి
- లంక గ్రామాల ప్రజలు అధికారులకు సహకరించాలి: మంత్రి గొట్టిపాటి
- పునరావాస కేంద్రాలకు తరలివెళ్లేలా ప్రజలు సహకరించాలి: మంత్రి గొట్టిపాటి
- బ్యారేజీ నుంచి దిగువకు వస్తున్న నీటితో ఉద్ధృతి పెరిగింది: మంత్రి గొట్టిపాటి
పోలవరం ప్రాజెక్టు వద్ద పెరుగుతోన్న గోదావరి వరద ఉద్ధృతి
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. వచ్చిపడుతున్న వరదతో 48 రేడియల్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. 6 లక్షల 29 వేల 464 క్యూసెక్కులు నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. పెరుగుతున్న గోదావరి వరదతో మత్స్యకారులను చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.
మున్నేరు వంతెన వద్ద వరద బాధితుల ఆందోళన
- ఖమ్మం: మున్నేరు వంతెన వద్ద వరద బాధితుల ఆందోళన
- ఖమ్మం కరుణగిరి వద్ద సాయికృష్ణ నగర్ వాసుల ఆందోళన
- రెండ్రోజులుగా వరదల్లో ఉన్నా ఎవరూ పట్టించుకోవట్లేదన్న స్థానికులు
- ఖమ్మం: తాగునీరు కూడా అందించట్లేదని మహిళల ఆవేదన
పాఠశాల చుట్టూ చేరిన వరద
- కృష్ణా జిల్లా: అవనిగడ్డ మం. పాత ఎడ్లంకలో పాఠశాల చుట్టూ చేరిన వరద
- రేగులంకలోకి చేరిన వరద, గ్రామాన్ని ఖాళీచేయిస్తున్న అధికారులు
కరకట్టకు కేవలం 5 అడుగుల ఎత్తులో వరద ప్రవాహం
- కృష్ణా జిల్లా: మోపిదేవి మం. కోసూరివారిపాలెం డంపింగ్ యార్డ్ సమీపంలో వరద పోటు
- కృష్ణా నది ఎడమ కరకట్ట పక్కన గండి పడటంతో స్థానికుల భయాందోళన
- కృష్ణా జిల్లా: కరకట్టకు కేవలం 5 అడుగుల ఎత్తులో వరద ప్రవాహం
- కరకట్టపై భారీగా ఉన్న గుంతలను వెంటనే పూడ్చాలని కోరుతున్న ప్రజలు
వివిధ రాష్ట్రాల నుంచి విజయవాడకు బోట్లు
- విజయవాడ చేరుకున్న పవర్ బోట్లు
- నిన్న కేంద్రంతో సీఎం మాట్లాడాక వివిధ రాష్ట్రాల నుంచి విజయవాడకు బోట్లు
- బోట్ల ద్వారా సింగ్‌నగర్ ముంపు ప్రాంతంలో ఆహారం పంపిణీ
- పెద్దఎత్తున బోట్లు రావడంతో ఇళ్లనుంచి బాధితులను బయటకు తెచ్చే పనులు వేగవంతం
- పునరావాస కేంద్రాలకు వెళ్లే వాళ్లకు దుస్తులు కూడా ఇవ్వాలన్న సీఎం
- పాల ప్యాకెట్లు, ఆహారం, తాగునీటి బాటిళ్లు అందిస్తున్న ప్రభుత్వం
- ప్రైవేటు హోటళ్లు, దుర్గగుడి, అక్షయపాత్ర ద్వారా ఆహారం సమకూర్చిన ప్రభుత్వం
- ముంపు ప్రాంతాల్లో మరోసారి పర్యటనతో సహాయచర్యలను పర్యవేక్షించిన సీఎం
వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన
- వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన
- జోరు వర్షంలో బోటు ఎక్కి విజయవాడ సింగ్‌నగర్‌కు వెళ్లిన సీఎం
- దాదాపు వంతెనకు ఆనుకుని ప్రవహిస్తున్న నీటిని పరిశీలించిన సీఎం
- బాధితులకు ఉదయమే ఆహారం అందిందా అని ఆరా తీసిన చంద్రబాబు
- ఆహారం, తాగునీరు అందాయని సీఎంకు తెలిపిన వరద బాధితులు
చెరువులో మునిగిపోతున్న గేదెను కాపాడబోయి రైతు మృతి
- అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం జేపీ అగ్రహారంలో విషాదం
- చెరువులో మునిగిపోతున్న గేదెను కాపాడబోయి రైతు సుర్ల అచ్చయ్యనాయుడు మృతి
చెట్లపై నిల్చొని సాయం కోసం ఎదురుచూపులు
- కృష్ణా జిల్లా: పునరావాస శిబిరానికి తీసుకొస్తున్న బోటు గల్లంతు
- తోట్లవల్లూరు మం. అన్నవరపులంక నుంచి బాధితులను తరలిస్తుండగా ఘటన
- పునరావాస శిబిరానికి తీసుకొస్తున్న బోటులో 8 మంది అన్నవరపు లంకవాసులు
- కృష్ణా జిల్లా: నలుగురిని కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చిన స్థానికులు
- కృష్ణా జిల్లా: చెట్లపై నిల్చొని సాయం కోసం మరో నలుగురి ఎదురుచూపులు
కరకట్టు కోతకు గురవుతుందేమోనని ఆందోళన చెందుతున్న లంక గ్రామ ప్రజలు
- గుంటూరు జిల్లా కొల్లిపర మం. పాతబొమ్మువాని పాలెంను చుట్టుముట్టిన వరద
- గ్రామ ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని అధికారుల హెచ్చరికలు
- పిడపర్తి సమీపంలో కరకట్ట పెచ్చులూడుతున్నాయని భయపడుతున్న గ్రామస్థులు
- కరకట్టు కోతకు గురవుతుందేమోనని ఆందోళన చెందుతున్న లంక గ్రామ ప్రజలు
- బ్యారేజీ నుంచి లక్షల క్యూసెక్కుల వరదతో లంక గ్రామాలకు పొంచి ఉన్న ముప్పు
కొట్టుకుపోయిన ఖమ్మం-హైదరాబాద్ జాతీయరహదారి
- కొట్టుకుపోయిన ఖమ్మం-హైదరాబాద్ జాతీయరహదారి
- పాలేరు వరద ఉద్ధృతికి కూసుమంచి వద్ద ధ్వంసమైన జాతీయరహదారి
- పాలేరు జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం
- పాలేరు జలాశయానికి చేరుతున్న 65 వేల క్యూసెక్కుల వరద
- పాలేరు జలాశయం ప్రస్తుత నీటిమట్టం 26.5 అడుగులు
- పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు దాటి ప్రవహిస్తున్న పాలేరు
- పాలేరు వరదలో కొట్టుకుపోయిన యాకూబ్ మృతదేహం లభ్యం
ప్రకాశం బ్యారేజీకి పెరుగుతున్న వరద ఉద్ధృతి
- ప్రకాశం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక
- విజయవాడ: ప్రకాశం బ్యారేజీకి పెరుగుతున్న వరద ఉద్ధృతి
- ప్రకాశం బ్యారేజ్ నుంచి 11.36 లక్షల క్యూసెక్కులు విడుదల
- ప్రకాశం బ్యారేజ్ నుంచి కాల్వలకు 500 క్యూసెక్కులు విడుదల
- ప్రకాశం బ్యారేజ్ మొత్తం 70 గేట్లు తెరిచి సముద్రంలోకి నీటి విడుదల
- ప్రకాశం బ్యారేజ్ వద్ద 24.2 అడుగుల మేర కొనసాగుతున్న నీటిమట్టం
వరద చుట్టుముట్టడంతో దిక్కుతోచని స్థితిలో రెండు గ్రామాల ప్రజలు
- కృష్ణా జిల్లా: గన్నవరం మండలంలో వరద పోటు
- జక్కులనెక్కలం, సావరగూడెం గ్రామాలను చుట్టుముట్టిన వరద
- ఏలూరు కాల్వకు గండిపడటంతో జక్కులనెక్కలంలోకి భారీగా వరద
- వరద చుట్టుముట్టడంతో దిక్కుతోచని స్థితిలో రెండు గ్రామాల ప్రజలు
- వరదల్లో చిక్కుకొని భవనం ఎక్కి సాయం కోసం ఎదురుచూపులు
- జక్కులనెక్కలం జగనన్న కాలనీకి చెందిన 8 మంది బాధితుల ఎదురుచూపులు
వర్షాలు, వరదల కారణంగా 86 రైళ్లు రద్దు చేసిన ద.మ.రైల్వే
- వర్షాలు, వరదల కారణంగా 86 రైళ్లు రద్దు చేసిన ద.మ.రైల్వే
- మరో 70కి పైగా రైళ్ల దారి మళ్లింపు: ద.మ.రైల్వే
- దిల్లీ-సెంట్రల్ చెన్నై, దానాపూర్-బెంగళూరు రైళ్లు మళ్లింపు
- రాయపురం-పటేల్ నగర్, హజ్రత్ నిజాముద్దీన్-రేణిగుంట రైళ్లు మళ్లింపు
- కాజీపేట-డోర్నకల్, డోర్నకల్-విజయవాడ రైళ్లు రద్దు
- విజయవాడ-గుంటూరు, గుంటూరు-విజయవాడ రైళ్లు రద్దు
- విజయవాడ-డోర్నకల్, డోర్నకల్-కాజీపేట రైళ్లు రద్దు
ధ్వంసమైన రైల్వేట్రాక్‌కు శరవేగంగా మరమ్మతులు చేస్తున్న సిబ్బంది
- మహబూబాబాద్ జిల్లాలో ధ్వంసమైన రైల్వేట్రాక్‌కు మరమ్మతులు
- నిన్న వరదలకు కేసముద్రం-ఇంటికన్నె మార్గంలో ధ్వంసమైన రైల్వేట్రాక్
- ధ్వంసమైన రైల్వేట్రాక్‌కు శరవేగంగా మరమ్మతులు చేస్తున్న సిబ్బంది
- మధ్యాహ్నం వరకు ఒక లైన్‌లో మరమ్మతులు పూర్తయ్యే అవకాశం
- సాయంత్రం వరకు మరమ్మతులు పూర్తయ్యే అవకాశం
- మరమ్మతు పనుల పరిశీలనకు వెళ్లిన ద.మ.రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్
పునరావాస శిబిరానికి తీసుకొస్తున్న బోటు గల్లంతు
- కృష్ణా జిల్లా: పునరావాస శిబిరానికి తీసుకొస్తున్న బోటు గల్లంతు
- తోట్లవల్లూరు మం. అన్నవరపులంక నుంచి బాధితులను తరలిస్తుండగా ఘటన
- పునరావాస శిబిరానికి తీసుకొస్తున్న బోటులో 8 మంది అన్నవరపు లంకవాసులు
- ఆరుగురిని కాపాడిన స్థానికులు, మరో ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు
ప్రకాశం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక
- ప్రకాశం బ్యారేజ్ వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక
- ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 11.36 లక్షల క్యూసెక్కులు
- నదీ పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: విపత్తు నిర్వహణ సంస్థ
- కాల్వలు, కల్వర్టులు, మ్యాన్‌హోల్స్‌కు దూరంగా ఉండాలి: విపత్తు నిర్వహణ సంస్థ
- వాగులు, కాల్వలు, రోడ్లు దాటే ప్రయత్నం చేయవద్దు: విపత్తు నిర్వహణ సంస్థ
కలెక్టరేట్‌లో సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
- విజయవాడ కలెక్టరేట్‌లో సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
- ఒక్క రాత్రి ధైర్యంగా ఉండాలని ముంపు ప్రాంతాల ప్రజలకు హామీ ఇచ్చా: సీఎం
- హామీ నిలబెట్టుకునే దిశగా యంత్రాంగం పనిచేయాలి: అధికారులతో సీఎం
- బోట్లు కూడా కొట్టుకుపోయే సవాళ్లు మన ముందున్నాయి: అధికారులతో సీఎం
- ఎంతమందిని రక్షించగలిగామన్నదే మన లక్ష్యం కావాలి: సీఎం
- ఉదయం 8కల్లా ఎంతమంది కి ఆహారం అందించారన్న సీఎం
- దాదాపు లక్షన్నరమంది వరకు ఆహారం పంపిణీ జరిగిందన్న అధికారులు
- ప్రజలను కాపాడే విషయంలో ప్రయత్నాలు ఎక్కడా ఆగకూడదు: సీఎం
- విపత్తు సమయంలో వరద బాధితులు తీసుకునే తాగునీరు ఎంతో ముఖ్యమన్న సీఎం
- అందుబాటులో ఉన్న మినరల్ వాటర్ వారికోసమే కేటాయించాలన్న సీఎం
- బోట్లలో వచ్చిన వారిని తరలించేందుకు బస్సులు సిద్ధంగా ఉంచాలన్న సీఎం
- అవసరమైతే వృద్ధులు, రోగులు ఇబ్బంది పడకుండా హోటళ్లలోనే ఉంచండి: సీఎం
- బాధితుల కోసం కల్యాణ మండపాలు, ఇతర కేంద్రాలు సిద్ధం చేయాలన్న సీఎం
- మొత్తం 47 కేంద్రాలు గుర్తించామని సీఎంకు వివరించిన అధికారులు
- కృష్ణా నది కరకట్టపై వెంకటపాలెం వద్ద గండి పడే పరిస్థితిపై సీఎం ఆరా
- గండిని పూడ్చగలిగామని సీఎం చంద్రబాబుకు వివరించిన అధికారులు
- రాజధాని రైతులు స్వచ్ఛందంగా చూపిన చొరవ అభినందనీయమన్న సీఎం
- కరకట్ట వెంబడి గండి పడే ప్రాంతాల గుర్తింపునకు ప్రత్యేక బృందం: సీఎం
- నాతో సహా అధికారులంతా బృందాలుగా ఏర్పడాలి: సీఎం చంద్రబాబు
- బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయిలో సహాయచర్యలు ముమ్మరం చేద్దామన్న సీఎం
వరద ప్రవాహనికి కొట్టుకుపోయిన 200 పాడి గేదెలు
- గుంటూరు జిల్లా తుళ్లూరు మం. రాయపూడి పెదలంకలో భారీగా వరద
- గుంటూరు జిల్లా: వరద ప్రవాహనికి కొట్టుకుపోయిన 200 పాడి గేదెలు
సామాన్లు తీసుకుని పునరావాస కేంద్రాలకు చేరిన నిర్వాసితులు
- బాపట్ల జిల్లా: జలదిగ్బంధంలో రేపల్లె మం. పెనుమూడి పల్లెపాలెం
- బాపట్ల జిల్లా: సామాన్లు తీసుకుని పునరావాస కేంద్రాలకు చేరిన నిర్వాసితులు
- లంకెవానిదిబ్బ, బొబ్బర్లంక, పిరాట్లంకలోని ఎస్టీ కాలనీలోకి చేరుతున్న వరద
- వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపు
కృష్ణా నదికి చేరుతున్న 2.5 లక్షల క్యూసెక్కుల వరద
- మున్నేరులో కొనసాగుతున్న వరద ఉద్ధృతి
- కృష్ణా నదికి చేరుతున్న 2.5 లక్షల క్యూసెక్కుల వరద
- నీటమునిగిన లింగాల, పెనుగంచిప్రోలు వంతెనలు
- జలదిగ్బంధంలో మున్నేరు పరివాహక గ్రామాలు
- ఆలూరుపాడు, వేమవరం, ముచ్చింతల, పెనుగంచిప్రోలు జలదిగ్బంధం
- అనిగండ్లపాడు, గుమ్మడదుర్రు, సుబ్బాయిగూడెం జలదిగ్బంధం
- కొలికొండ్ల, వెంగనాయకులపాలెం, శనగపాడు జలదిగ్బంధం
- పెనుగంచిప్రోలు, నవాబుపేట చెరువు నుంచి కొనసాగుతున్న వరద
- తిరుపతమ్మ ఆలయాన్ని వీడని వరద ముంపు
- తిరుపతమ్మ ఆలయం వద్ద జలదిగ్బంధంలో దుకాణాలు
ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికుల తీవ్ర ఇబ్బందులు
- విజయవాడ: యనమలకుదురులో ఇళ్లలోకి చేరిన వరద
- ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికుల తీవ్ర ఇబ్బందులు
- సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్న లోతట్టు ప్రాంత వాసులు
అమరావతి అమరేశ్వరాలయం పరిసర ప్రాంతాల్లో వరద
- పల్నాడు జిల్లా: అమరావతి అమరేశ్వరాలయం పరిసర ప్రాంతాల్లో వరద
- పాత అమరావతి పట్టణంలోని పల్లపువీధి, ముస్లింకాలనీలోకి పోటెత్తిన వరద
- పాత అమరావతి పట్టణంలోని రహదారులపై 4 అడుగుల మేర వరద
- పాత అమరావతి పట్టణంలో పడవలతో వీధుల్లో తిరుగుతున్న స్థానికులు
- పల్నాడు జిల్లా: అమరావతి పోలీసుస్టేషన్‌ను చుట్టుముట్టిన వరదనీరు
వరద సహాయచర్యలపై ఉదయం నుంచి మొదలైన సీఎం సమీక్ష
- వరద సహాయచర్యలపై ఉదయం నుంచి మొదలైన సీఎం సమీక్ష
- ఆహారం, బోట్లు ఎంతవరకు చేరుకున్నాయని సమీక్షించిన సీఎం
- ఇతర రాష్ట్రాల నుంచి విజయవాడ చేరుకుంటున్న పవర్ బోట్లు
- సింగ్‌నగర్ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితి, సహాయంపై సీఎం సమీక్ష
- తెల్లవారుజామున 4 వరకు వరద ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు
- కాసేపట్లో జిల్లా కలెక్టరేట్ నుంచి మళ్లీ క్షేత్రస్థాయికి వెళ్లనున్న సీఎం
ఉగ్రరూపం దాల్చిన దివిసీమ
- కృష్ణా నది వరదకు ఉగ్రరూపం దాల్చిన దివిసీమ
- ప్రకాశం బ్యారేజ్ నుంచి నీటి విడుదలతో వరద పోటు
- సాయంత్రానికి పులిగడ్డ అక్విడెక్ట్ వద్దకు చేరుకునే అవకాశం
- పులిగడ్డ అక్విడెక్ట్ వద్ద 25 అడుగుల మేర వరద ప్రవాహం
- అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి మండలాల్లో వరద ప్రవాహం
- కృష్ణా నది వరదకు హంసలదీవి, ఎదురుమొండి వద్ద 2 అడుగుల మేర ప్రవాహం
- మోపిదేవి మండలం మేళ్లమర్తి లంక లాకులు నుంచి గ్రామాల్లోకి వరద
- కరకట్ట బలహీనంగా ఉండటం వల్ల భయాందోళనలో ప్రజలు
- కృష్ణా జిల్లా: ఇసుక బస్తాలు ఏర్పాటు చేయాలని కోరుతున్న ప్రజలు
హోంమంత్రి అనిత నివాసాన్ని చుట్టుముట్టిన వరద
- విజయవాడలోని హోంమంత్రి అనిత నివాసాన్ని చుట్టుముట్టిన వరద
- తన పిల్లలను ఓ ట్రాక్టర్ ఎక్కించి సురక్షిత ప్రాంతానికి తరలించిన హోంమంత్రి
- రామవరప్పాడు వంతెన కింద జలదిగ్బంధంలో హోంమంత్రి ఉండే కాలనీ
- వరద ముంపులోనే సహాయచర్యల్లో పాల్గొన్న హోంమంత్రి అనిత
- మంత్రి అనిత ఇంటి వద్దకు చేరుకున్న విపత్తు నిర్వహణ శాఖ బృందం
- తన ఇంటి వద్దకంటే ముంపు ప్రాంతాల్లో సహాయచర్యలకు హోంమంత్రి ఆదేశం
- కాలనీలోని వారిని రక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాటుచేసిన హోంమంత్రి
- తన ఇంటి కోసం వచ్చిన సహాయ బృందాన్ని సింగ్‌నగర్ వైపు పంపిన హోంమంత్రి
విజయవాడ వచ్చే వాహనాలు నిలిపివేత
- విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై నిలిచిన రాకపోకలు
- జాతీయ రహదారిపై నిన్న మధ్యాహ్నం నుంచి నిలిచిన రాకపోకలు
- ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మం. గరికపాడు వద్ద కోతకు గురైన రోడ్డు
- పాలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో కోతకు గురైన రహదారి
- హైదరాబాద్ నుంచి కోదాడ మీదుగా విజయవాడకు వాహనాల మళ్లింపు
- విజయవాడ నుంచి కోదాడ మీదుగా హైదరాబాద్‌కు వాహనాల మళ్లింపు
- హైదరాబాద్ నుంచి నార్కట్‌పల్లి, నల్గొండ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా విజయవాడకు వాహనాలు
- విజయవాడ నుంచి గుంటూరు, మిర్యాలగూడ, నార్కట్‌పల్లి మీదుగా హైదరాబాద్‌కు వాహనాలు
- ఖమ్మంలో వరదకు సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్లే వాహనాలు నిలిపివేత
- సూర్యాపేట-ఖమ్మం మీదుగా విజయవాడ వచ్చే వాహనాలు నిలిపివేత
- నిన్నటి నుంచి నిలిచిపోయిన విజయవాడ వచ్చే వాహనాలు
- సూర్యాపేట-ఖమ్మం బైపాస్ మార్గంలో భారీగా నిలిచిన లారీలు
నీటి విడుదలతో ముంపునకు గురవుతున్న పలు గ్రామాలు
- ప్రకాశం బ్యారేజ్ నీటి విడుదలతో ముంపునకు గురవుతున్న పలు గ్రామాలు
- యనమలకుదురు సమీపంలో రక్షణ గోడకు సమాంతరంగా వరద ప్రవాహం
- రక్షణ గోడకు పైబడి నీరు ప్రవహిస్తే పలు కాలనీలు నీటమునిగే ప్రమాదం
- ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం చర్యలు
- పెనమలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పర్యటన
ప్రకాశం బ్యారేజీకి పెరుగుతున్న వరద ఉద్ధృతి
- విజయవాడ: ప్రకాశం బ్యారేజీకి పెరుగుతున్న వరద ఉద్ధృతి
- ప్రకాశం బ్యారేజ్ నుంచి 11.25 లక్షల క్యూసెక్కులు విడుదల
- ప్రకాశం బ్యారేజ్ మొత్తం 70 గేట్లు తెరిచి సముద్రంలోకి నీటి విడుదల
- ప్రకాశం బ్యారేజ్ వద్ద 23.6 అడుగుల మేర కొనసాగుతున్న నీటిమట్టం
- ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
- వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉందన్న అధికారులు
భారీ వర్షాలతో నందిగామకు వరద పోటు
- ఎన్టీఆర్ జిల్లా: భారీ వర్షాలతో నందిగామకు వరద పోటు
- నందిగామ మార్కెట్ యార్డులో 3 అడుగుల మేర వరద ప్రవాహం
- నందిగామ మార్కెట్ యార్డు కార్యాలయంలోకి చేరిన వరద నీరు
- నందిగామ వద్ద జాతీయ రహదారిపై మునేరు వరద ప్రవాహం
- నందిగామ-మధిర రహదారిపై వరద ప్రవాహం, నిలిచిన రాకపోకలు
- బాధితులను పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు
జాతీయరహదారిపై నిన్న మధ్యాహ్నం నుంచి నిలిచిన రాకపోకలు
- విజయవాడ-హైదరాబాద్ జాతీయరహదారిపై నిలిచిన రాకపోకలు
- జాతీయరహదారిపై నిన్న మధ్యాహ్నం నుంచి నిలిచిన రాకపోకలు
- ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మం. గరికపాడు వద్ద కోతకు గురైన రహదారి
- పాలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో కోతకు గురైన రహదారి
సహాయచర్యలకు ఆటంకాలు
- విజయవాడలోని పలు ప్రాంతాల్లో జోరు వర్షం
- వర్షం కారణంగా ముంపు ప్రాంతాల్లో సహాయచర్యలకు ఆటంకాలు
- మరోమారు క్షేత్రస్థాయి పర్యటనకు సిద్దమవుతున్న సీఎం చంద్రబాబు
కొట్టుకువచ్చిన 5 పడవలు
- విజయవాడ: ప్రకాశం బ్యారేజీకి రికార్డుస్థాయిలో వరద నీరు
- 11 లక్షల క్యూసెక్కల నీటిన సముద్రంలోకి విడుదల
- ఎగువ నుంచి బ్యారేజీ వద్దకు కొట్టుకువచ్చిన 5 పడవలు
- అర్థరాత్రి 2 గం.లకు బ్యారేజీ గేటు వద్ద చిక్కుకున్న మూడు పడవలు
- ఉదయం ఐదు గం. గేటు వద్ద చిక్కుకున్నతర్వాత మరో రెండు పడవలు
- ప్రకాశం బ్యారేజీ చరిత్రలో 11 లక్షల క్యూసెక్కల పైగా నీరు సముద్రంలోకి విడుదల కావడం ఇదే ప్రథమం
- హంసల దీవి ఎదురుమెండి వద్ద సముద్రంలోకి చేరుతున్న నీరు
- పులిగడ్డ ఎక్వడెక్ట్ వద్ద నుంచి పారుతున్న వరద నీరు
- కృష్ణానదిలో గంటగంటకు పెరుగుతున్న నీటి ప్రవాహంతో పరివాహక ప్రాంత ప్రజల్లో ఆందోళణ
- ఇప్పటికే జలదిగ్బంధంలో లంక గ్రామాలు
- నీటి మునిగిన వేల ఎకరాల వాణిజ్య , కాయగూరల పంటలు
- భయం గుప్పిట్లో దివిసీమ వాసులు
- లంక గ్రామాల్లో ప్రజలను, పశువులను శిబిరాలకు తరలించిన అధికారులు
ప్రకాశం బ్యారేజ్‌కు పెరుగుతున్న వరద ఉద్ధృతి
- విజయవాడ: ప్రకాశం బ్యారేజ్‌కు పెరుగుతున్న వరద ఉద్ధృతి
- ప్రకాశం బ్యారేజ్ నుంచి 11.20 లక్షల క్యూసెక్కులు విడుదల
- ప్రకాశం బ్యారేజ్ మొత్తం 70 గేట్లు తెరిచి సముద్రంలోకి నీరు విడుదల
- ప్రకాశం బ్యారేజ్ వద్ద 23.3 అడుగుల మేర కొనసాగుతున్న నీటిమట్టం
- ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
- వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉందన్న అధికారులు
సహాయక చర్యల్లో పాల్గొననున్న మంత్రులు
- నేడు మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జరగాల్సిన వినతుల స్వీకరణ రద్దు
- భారీ వర్షాలు, వరదల కారణంగా నేడు ప్రజావేదిక రద్దు చేసినట్లు పార్టీ వర్గాల వెల్లడి
- భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సహాయక చర్యల్లో పాల్గొననున్న మంత్రులు
నేడు, రేపు పలు రైళ్లు రద్దు
- రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో నేడు, రేపు పలు రైళ్లు రద్దు
- భారీ వర్షాలు, వరదల కారణంగా విజయవాడ డివిజన్‌లో పలు రైళ్లు రద్దు
- విజయవాడ డివిజన్‌లో అన్ని రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు
- టికెట్ల రద్దు కోసం స్టేషన్‌లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసిన అధికారులు
- సికింద్రాబాద్ మార్గంలో ట్రాక్ కొట్టుకుపోవడంతో మార్గమధ్యలో నిలిచిన పలు రైళ్లు
- ట్రాక్ దెబ్బతిన్న ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు
సమస్యలు ఉంటే టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌చేసి సమాచారం అందించాలన్న సీఎం
- తెల్లవారుజాము వరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు
- కృష్ణలంక, ఇబ్రహీంపట్నం, ఫెర్రీ, జూపూడి, మూలపాడు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం
- జూపూడి, మూలపాడులో ఇళ్లలోకి వరద చేరడంతో రోడ్లపైకి వచ్చిన జనం
- అర్ధరాత్రి సమయంలో కూడా బాధితుల వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకున్న సీఎం
- బోట్లులో వెళ్లి బాధితులకు ఆహారం, నీళ్లు సరఫరా చేసిన సీఎం చంద్రబాబు
- సమస్యలు ఉంటే టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌చేసి సమాచారం అందించాలన్న సీఎం
- ఎవరూ అధైర్య పడొద్దు.. అండగా ఉంటానని బాధితులకు భరోసా ఇచ్చిన సీఎం
- ప్రతి ఒక్కరూ ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు పాటించాలని కోరిన సీఎం చంద్రబాబు
కృష్ణలంక, ఫెర్రీ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు
- కృష్ణలంక, ఫెర్రీ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం చంద్రబాబు
- ఇబ్రహీంపట్నం, జూపూడి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం
- వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు
- అండగా ఉంటామని బాధితులకు ధైర్యం చెప్పిన సీఎం చంద్రబాబు
కృష్ణలంక పర్యటన ముగించుకుని ఇబ్రహీంపట్నం బయలుదేరిన సీఎం
- కృష్ణలంకలో ముంపు ప్రాంతాలలో పర్యటించిన సీఎం చంద్రబాబు
- కృష్ణలంక పర్యటన ముగించుకుని ఇబ్రహీంపట్నం బయలుదేరిన సీఎం
- ఇబ్రహీంపట్నం వద్ద వరద ఉద్ధృతిని స్వయంగా పరిశీలించనున్న సీఎం
అత్యవసర పరిస్థితుల దృష్ట్యా కొన్నిచోట్ల విద్యుత్ కోతలు ఉన్నాయి: గొట్టిపాటి
- విద్యుత్ శాఖ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవి సమీక్ష
- వీటీపీఎస్‌లో వరద నీటిని తోడి సాధారణ స్థితికి తీసుకొచ్చాం: మంత్రి గొట్టిపాటి
- ట్రిప్లర్ 5, 6లో ట్రయిల్‌రన్ విజయవంతంగా పూర్తి చేశాo: మంత్రి గొట్టిపాటి
- అత్యవసర పరిస్థితుల దృష్ట్యా కొన్నిచోట్ల విద్యుత్ కోతలు ఉన్నాయి: గొట్టిపాటి
- మిగతా ప్రాంతాల్లో విద్యుత్‌సరఫరాకు అంతరాయం లేదు: గొట్టిపాటి
అర్ధరాత్రి కృష్ణలంకలో ముంపు ప్రాంతాల పర్యటనకు బయలుదేరిన సీఎం
అర్ధరాత్రి కృష్ణలంకలో ముంపు ప్రాంతాల పర్యటనకు బయలుదేరిన సీఎం
వరద ముంపు సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న సీఎం చంద్రబాబు
- విజయవాడ: కలక్టరేట్‌లో అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
- వరద ముంపు సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న సీఎం చంద్రబాబు
- లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తతపై అధికారులకు సీఎం ఆదేశం
- బుడమేరు బాధితులు కట్టుబట్టలతో బయటకు వస్తున్నారు: సీఎం
- బాధితులకు దుస్తులు, దుప్పట్లు ఇవ్వాలన్న సీఎం చంద్రబాబు
వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉందన్న అధికారులు
- విజయవాడ: ప్రకాశం బ్యారేజ్‌కు పెరుగుతున్న వరద ఉద్ధృతి
- ప్రకాశం బ్యారేజ్ నుంచి 10.56 లక్షల క్యూసెక్కులు విడుదల
- ప్రకాశం బ్యారేజ్ మొత్తం 70 గేట్లు తెరిచి సముద్రంలోకి నీరు విడుదల
- ప్రకాశం బ్యారేజ్ వద్ద 21.5 అడుగుల మేర కొనసాగుతున్న నీటిమట్టం
- ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ
- వరద ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉందన్న అధికారులు
అర్ధరాత్రి అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
- విజయవాడ కలక్టరేట్‌లో అర్ధరాత్రి అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
- ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం పర్యవేక్షిస్తున్న సీఎం చంద్రబాబు
ధైర్యం చెప్పాలనే అర్ధరాత్రి అయినా బాధితుల దగ్గరకు వెళ్లా: సీఎం
- ధైర్యం చెప్పాలనే అర్ధరాత్రి అయినా బాధితుల దగ్గరకు వెళ్లా: సీఎం
- బాధితులు ఆత్మస్థైర్యం దెబ్బతినకూడదు: సీఎం చంద్రబాబు
- కొంతమంది రోగులు, వృద్ధులు కూడా ముంపులో చిక్కుకున్నారు: సీఎం
- సమయం కొంచెం ముందు వెనుక అయినా ప్రతీ ఒక్కరినీ రక్షిస్తాం: సీఎం
- ఉదయానికల్లా బోట్లు, హెలికాప్టర్ అందుబాటులోకి వస్తాయి: సీఎం చంద్రబాబు
బాధితుల ఫిర్యాదులను స్వయంగా పెన్నుతో రాసుకున్న సీఎం చంద్రబాబు
- బాధితుల ఫిర్యాదులను స్వయంగా పెన్నుతో రాసుకున్న సీఎం చంద్రబాబు
- వరదల వల్ల తలెత్తిన వివిధ సమస్యలను సీఎంకు వివరించిన బాధితులు
- సహాయక చర్యలకు తలెత్తే సాంకేతిక ఇబ్బందులు బాధితలకు వివరించిన సీఎం
- వ్యవస్థ చక్కపెట్టేందుకు ఈ ఒక్క రాత్రి తనకు సమయం ఇవ్వాలని కోరిన సీఎం
- మరో 6-7గంటల్లోనే వ్యవస్థను మెరుగ్గా చక్కదిద్దితానని సీఎం హామీ
- ఈ రాత్రికి తానూ నిద్రపోయేది లేదని తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు