ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరువు సీమలో కుండపోత - ఊళ్లను ముంచెత్తిన వరద - బుడమేరును తలపించిన పండమేరు - HEAVY RAINS IN ANANTAPUR

అనంతపురం జిల్లాలో కుండపోత వర్షం - జలదిగ్బంధంలో చిక్కుకున్న పలు కాలనీలు

HEAVY_RAINS_IN_ANANTAPUR
HEAVY_RAINS_IN_ANANTAPUR (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 22, 2024, 3:21 PM IST

Heavy Rain Fall in Anantapur District :బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. అనంతపురం జిల్లాలో సోమవారం కురిసిన భారీ వర్షాల కారణంగా పలు కాలనీలు నీటమునిగాయి. ఎగువ ప్రాంతాల నుంచి అధిక వరద పోటెత్తడంతో రాప్తాడు నియోజకవర్గంలోని కనగానపల్లి చెరువుకు గండిపడింది. దీంతో అనంతపురంలోని పండమేరు వంకకు పెద్ద ఎత్తున వరద వచ్చి చేరింది. ఈ క్రమంలోనే అనంతపురం గ్రామీణ పరిధిలోని కళాకారుల కాలనీ, అంబేడ్కర్​ కాలనీ, ఉప్పరపల్లి సమీపంలోని ఇందిరమ్మ కాలనీ, జగనన్న కాలనీలు నీట మునిగాయి. దీంతో ఆయా కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తమ పరిసర ప్రాంతాల్లో దాదాపు 5 అడుగుల మేర వరద నిలిచిపోవడంతో వారు ఎటు వెళ్లాలేని పరిస్థితి.

కరువు సీమలో కుండపోత - ఊళ్లను ముంచెత్తిన వరద - బుడమేరును తలపించిన పండమేరు (ETV Bharat)

నీట మునిగిన కాలనీలను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ, ధర్మవరం టీడీపీ ఇన్​ఛార్జీ పరిటాల శ్రీరామ్ పరిశీలించారు. కాలనీల ప్రజలకు సమీపంలో భోజన సదుపాయం కల్పించారు. ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామని పరిటాల శ్రీరామ్​ తెలియజేశారు. ఇవాళ సాయంత్రాని కల్లా వంక ఉద్ధృతి తగ్గేలా చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ తెలిపారు.

అల్పపీడనం ప్రభావం - మన్యం జిల్లాలో భారీ వర్షాలు - Heavy Rains in Manyam District


కనేకల్ మండలంలో భారీ వర్షం కురవడంతో హనకనహాల్​ వద్ద వంక ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో సొల్లాపురం, బెలుగుప్ప గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రైతులు ఖరీఫ్​లో సాగు చేసిన వరి, మొక్కజొన్న, వేరుశనగ, టమాట, మిరప, ఉల్లి, తమలపాకు తోటలు భారీ వర్షానికి కుళ్ళిపోయి తీవ్రమైన నష్టం వాటిల్లింది. వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని వారు కోరుకుంటున్నారు.

ఏపీలో భారీ వర్షాలు - సహాయక చర్యలపై చంద్రబాబు సమీక్ష - CM Chandrababu Review On Rains

కళ్యాణదుర్గంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. సోమవారం కురిసిన వర్షంతో కళ్యాణదుర్గంలో 89.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. పట్టణంలోని లొతట్టు ప్రాంతంలోకి వరద వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలోనే అనంతపురం వెళ్లే మార్గంలో సాయిబాబా గుడి వద్దకు వెళ్లే తారు రోడ్డు పూర్తిగా ధ్వంసం అయింది. ప్రధాన రోడ్లలోని గుంతల్లో వర్షపు నీరు చేరడంతో వాహనాల రాకపోకులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బ్రహ్మసముద్రం మండలం పాల వెంకటాపురం గ్రామంలోని సీనప్ప అనే వ్యక్తికి చెందిన పాత ఇల్లు వర్షం దాటికీ కూలిపోయింది. ఇంటిలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు గృహ నిర్మాణశాఖ అధికారులు కూలిపోయిన ఇంటిని పరిశీలించారు.
ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు - అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ - Heavy Rains in Andhra Pradesh

ABOUT THE AUTHOR

...view details