ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిండుకుండలా ప్రాజెక్టులు- దిగువ ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు - HEAVY FLOOD TO PROJECTS IN AP - HEAVY FLOOD TO PROJECTS IN AP

Heavy Flood Water Flow To Irrigation Projects in AP : ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. భారీగా వరద నీరు చేరుతుండటంతో దాదాపు రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టు గెట్లు ఎత్తివేస్తున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Heavy floods to projects
Heavy floods to projects (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 1, 2024, 11:04 AM IST

Updated : Sep 1, 2024, 1:13 PM IST

Heavy Flood Water Flow To Irrigation Projects in AP : విస్తారంగా కురుస్తున్న వర్షాలకు పల్నాడు జిల్లా పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 6.82 లక్షల క్యూసెక్కులుగా ఉంది. క్యాచ్ మెంట్ ఏరియా నుంచి 76 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు మొత్తం 12 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దిగువ ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. విద్యుత్ ఉత్పత్తి కోసం 16 వేల క్యూసెక్కులు నీరు మళ్లిస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 45 టీఎంసీలు కాగా ప్రస్తుతం 42 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

Flood Flowing to Prakasam Barrage :రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరుతుంది. ప్రస్తుతం ఇన్​ఫ్లో 5,66,860 క్యూసెక్యులుగా ఉంది. దీంతో అప్రమత్తమయిన అధికారులు మొత్తం 70 గేట్లు ద్వారా వరదనీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్‌ నుంచి కాల్వలకు 500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఏపీలో విస్తారంగా వర్షాలు - అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు - Heavy Rains in AP

FLOOD TO POLAVARAM PROJECT: భారీగా కురుస్తున్న వర్షాలకు ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ఉద్ధృతి క్రమేపి పెరుగుతుంది. ఆదివారం ఉదయం నుంచి పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరికి వరద వచ్చి చేరుతుంది. స్పిల్ వే ఎగువన 30.100 మీటర్లు, స్పిల్ వే దిగువన 20.680 మీటర్లు నీటిమట్టం నమోదు కాగా, 48 రేడియల్ గేట్ల ద్వారా 5,00788 క్యూసెక్కుల గోదావరి వరద నీటిని దిగువకు అధికారులు విడుదల చేస్తున్నారు.

Flood Flood Effect in Diviseema :దివిసీమకు వరద ముప్పు పొంచి ఉంది. ప్రకాశం బ్యారేజి నుంచి నీళ్లు విడుదల చేస్తుండటంతో కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో కృష్ణా నది పక్కనే ఉన్న మండలాలు వరద బారిన పడుతున్నాయి. ఘంటసాల, చల్లపల్లి, మోపిదేవి మండలాల పరిధిలో పసుపు, అరటి, కంద, మొక్కజొన్న, బంతి, బొప్పాయి, మల్బరీతోపాటు పట్టు పురుగుల షెడ్ల నీటిపాలయ్యాయి. ఉత్తర చిరువోల్లంకలో కరకట్టపై ఉన్న లాకులు పనిచేయక నది నుంచి వరద పొలాలను ముంచేస్తోంది. రొయ్యలు, చేపలు, పీతల చెరువులకు నష్టం వాటిలింది. వరద ధాటికి అవనిగడ్డ మండలం, కోడూరు మండలాల్లోనూ రొయ్యలు, పీతలు, చేపల చెరువుల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆయా మండలాల్లో మునిగే ప్రమాదం ఉన్న గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

జలదిగ్బంధంలో విజయవాడ - గత 20 ఏళ్లలో ఎన్నడూ చూడనంత వర్షం - ఆరుగురు మృతి - HEAVY RAINS IN VIJAYAWADA

ఏపీలో భారీ వర్షాలు - సహాయక చర్యలపై సీఎం చంద్రబాబు ఆరా - CM Chandrababu Review On Rains

Last Updated : Sep 1, 2024, 1:13 PM IST

ABOUT THE AUTHOR

...view details