తెలంగాణ

telangana

ETV Bharat / state

వైఎస్​ జగన్​ సెక్యూరిటీ పిటిషన్ - 3 వారాలకు వాయిదా వేసిన ఏపీ హైకోర్టు - YS JAGAN SECURITY PETITION

Jagan Security Petition : భద్రత పునరుద్ధరించాలంటూ ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ వేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు, తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది.

Jagan Security Petition
YS Jagan Security Petition in High Court (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 7, 2024, 7:50 PM IST

YS Jagan Security Petition in High Court :గతంలో ఏపీ సీఎం హోదాలో ఉన్న తన భద్రతను పునరుద్ధరించాలంటూ జగన్ వేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరిపింది. జగన్‌కు ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం రీప్లేస్ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం కండిషన్‌లో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇస్తామని, జగన్ భద్రతా సిబ్బంది సమాచారమిస్తే జామర్ కూడా అందిస్తామని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. వాదనలు విన్న న్యాయస్థానం కౌంటర్ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది.

జూన్ 3వ తేదీ నాటికి (ఆ సమయంలో 900 మంది) ఉన్న భద్రతను పునరుద్ధరించాలని మాజీ సీఎం జగన్​ ఈ నెల 5న హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేయగా, జగన్​కు భద్రత తగ్గించారన్న వాదనను పోలీసు శాఖ, ప్రభుత్వ వర్గాలు కొట్టిపారేశాయి. నిబంధనల మేరకు జగన్‌కు భద్రత కేటాయించామని, ఆయనకు జెడ్ ప్లస్ భద్రత కొనసాగుతుందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. సీఎం హోదాలో అదనంగా ఇచ్చే భద్రత మాత్రమే తగ్గించామన్న పోలీసు శాఖ ముఖ్యమంత్రి హోదా భద్రత ఇవ్వడం కుదరదని వెల్లడించింది.

తాడేపల్లి ప్యాలెస్‌ చుట్టూ మూడు షిప్టుల్లో 934 మంది కాపలా : సాధారణంగా వీఐపీ భద్రత 100 మంది సిబ్బందికి మించదు. కానీ, మాజీ సీఎం జగన్, ఆయన కుటుంబసభ్యుల భద్రత వెయ్యి మంది వరకు ఉంటున్నారు. ఇది చిన్న గ్రామ జనాభాతో సమానం అని హోంమంత్రి అనిత వెల్లడించారు. గతంలో "ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌ సెక్యూరిటీ గ్రూప్‌" పేరుతో ప్రత్యేక చట్టమే తెచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం దేశంలో మరే ముఖ్యమంత్రికి లేని స్థాయిలో సెక్యూరిటీ కల్పించుకుంది.

కమాండో తరహాలో స్పెషల్‌ సెక్యూరిటీ గ్రూప్‌ ఏర్పాటు చేసి తాడేపల్లి ప్యాలెస్‌ చుట్టూ మూడు షిప్టుల్లో 934 మంది కాపలా పెట్టింది. ఒక్కో షిఫ్టులో దాదాపు 300 మంది పనిచేసేవారు. తాజాగా జగన్​ కోర్టుకెక్కిన నేపథ్యంలో ప్రభుత్వ వర్గాలు పలు విషయాలను స్పష్టం చేశాయి. ప్రస్తుతం ఉన్న బుల్లెట్​ ప్రూఫ్​ వాహనం బదులు కండిషన్​లో ఉన్న వాహనం సమకూర్చుతామని, భద్రతా సిబ్బంది కోరితే జామర్ కూడా అందిస్తామని కోర్టుకు వెల్లడించాయి.

కలవడానికి వస్తే అవమానిస్తారా - ఓడినా బుద్ధి మారలేదు : జగనన్నపై కార్యకర్తలు ఆగ్రహం - Clash at YS Jagan House

జగనన్నా ఇంత పిరికితనమా? - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయండి : షర్మిల - YS SHARMILA TWEET ON JAGAN

ABOUT THE AUTHOR

...view details