Dussehra 2024 Wishes and Shlokas in Telegu : దేశంలో అత్యంత ఘనంగా జరుపుకునే ఉత్సవాల్లో.. దేవీ నవరాత్రులు ఒకటి. తొమ్మిది రోజులపాటు దుర్గామాతను పూజించి.. ఉపవాస దీక్షలు సైతం చేసి.. అమ్మవారిని కొలిచే పవిత్రమైన పండగే ఇది. ఈ సంవత్సరం.. శరన్నవరాత్రులు 2024 అక్టోబర్ 3 నుంచి మొదలై.. అక్టోబర్ 11న ముగుస్తున్నాయి. నవరాత్రులు ముగిసిన తర్వాత వచ్చే విజయదశమిని తెలుగు రాష్ట్రాల్లో.. అక్టోబర్ 12న జరుపుకుంటున్నారు. ఇక దసరా అంటే బంధువులను, ఆత్మీయులను కలుసుకుని సెలబ్రేట్ చేసుకోవడమే. కొత్త దుస్తులు ధరించి.. మిఠాయిలు, పిండి వంటలు ఆరగిస్తూ.. ఒకరికొకరు శుభాకాంక్షలు నేరుగా తెలుపుకుంటూ ఆనందంగా జరుపుకునే పండగే విజయదశమి. దగ్గర ఉన్నవారు ఒకే.. మరి .. దూరంగా ఉన్నవారికి, ఈ పండగవేళ మన వద్దకు రాలేని వారికి కూడా విషెస్ చెప్పాలిగా. అందుకే మీకోసం చక్కటి విషెస్, శ్లోకాలు తీసుకొచ్చాం.
Dussehra Wishes 2024 in Telugu:
✯ దుర్గామాత ఆశీస్సులతో అందరూ సుఖ శాంతులతో ఉండాలని కోరుకుంటూ.. దసరా శుభాకాంక్షలు
✯ ఆ తల్లి అందరినీ కాపాడాలని.. అన్నింటా విజయాలను అందించాలని కోరుతూ.. విజయదశమి శుభాకాంక్షలు
✯ శుభప్రదమైన విజయదశమి రోజున మీ ఇంట్లో సుఖశాంతులు, ఐశ్వర్యాలు కలగాలని ఆశిస్తూ.. హ్యాపీ దసరా
✯ సమస్త ప్రాణులకు.. జగజ్జనని దుర్గాదేవి ఆశీస్సులు లభించాలని కోరుతూ.. హ్యాపీ విజయ దశమి.
✯ మాతృస్వరూపిణి, శక్తి స్వరూపిణి, సకల కోర్కెలు తీర్చే చల్లని తల్లి దుర్గాదేవి మీకు.. ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగజేయాలని మనసారా కోరుకుంటూ.. విజయ దశమి శుభాకాంక్షలు..
✯ ఈ విజయ దశమి నుంచి మీకు అన్ని విజయాలే కలగాలని.. మీరు కోరుకున్నవి అన్నీ జరగాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు విజయ దశమి శుభాకాంక్షలు
✯ నవరాత్రుల పర్వదినాలు.. ప్రతి ఇంట సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టఐశ్వర్యాలు అందించాలని కోరుకుంటూ.. దసరా శుభాకాంక్షలు
✯ చెడుపై మంచి తప్పక విజయం సాధించి తీరుతుందనడానికి ప్రతీక విజయదశమి. ఆ జగన్మాత ఆశీస్సులతో సకల సుఖాలు కలగాలని ఆశిస్తూ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు
✯ ధర్మ మార్గం అనుసరించి ప్రతి విజయాన్ని సాధించాలని కోరుకుంటూ.. హ్యాపీ విజయ దశమి.
✯ ఈ నవరాత్రులు మీకు కొత్త విజయాలను, ఆనందాలను, ప్రేమలను, ఉత్సాహాలను తీసుకురావాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నవరాత్రి శుభాకాంక్షలు..
Dussehra Shlokas 2024 in Telugu:
"ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే..
శరణ్యే త్రంబకే దేవీ నారాయణి నమోస్తుతే!!"..దసరా శుభాకాంక్షలు
"ఓం సర్వరూపే సర్వేశే సర్వశక్తి సమున్నతే..
భయేభ్యసాహి నో దేవి.. దుర్గాదేవి నమోస్తుతే!!" హ్యాపీ దసరా