GV Reddy Resigns to AP Fibernet Chairman and TDP:ఏపీ ఫైబర్‌నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఫైబర్‌నెట్ ఛైర్మన్ పదవితో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వం, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవి నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుకు తన రాజీనామా లేఖను పంపించారు.
వ్యక్తిగత కారణాలతో టీడీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ఫైబర్‌నెట్ ఛైర్మన్ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు జీవీ రెడ్డి వెల్లడించారు. తనపై ఉంచిన విశ్వాసం అందించిన మద్దతుతో పాటు కీలక బాధ్యతలు నిర్వహించేందుకు అవకాశం కల్పించినందుకు సీఎం చంద్రబాబుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. టీడీపీ మరింత బలంగా ఎదిగి ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఇకపై పూర్తిగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతానని భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీలోనూ చేరే ఉద్దేశం లేదని జీవీ రెడ్డి పేర్కొన్నారు.