Guntur Young Sportsman Panadrla Bharat Kumar :చిన్నప్పటి నుంచి వ్యాయామం చేయడం భరత్ కుమార్ అలవాటుగా చేస్తున్నాడు. దీంతో పాటు వివిధ క్రీడల్లోనూ చురుగ్గా పాల్గొనేవాడు. ప్రస్తుతం అదే చురుగుతనం ప్రదర్శించి ఇటీవల చైనాలో జరిగిన ఏషియన్ పవర్‌లిఫ్టింగ్ యూనివర్శిటీ కప్ 2023-24 పోటీల్లో బంగారు పతకంతో సత్తాచాటాడు.
పందిర్ల భరత్ కుమార్‌ది గుంటూరు జిల్లా మంగళగిరి స్వస్థలం. చిన్నప్పటి నుంచే వ్యాయామం చేయడం, ఆటలు ఆడటం అలవాటుగా చేసుకున్నాడు భరత్. పాఠశాలలో చదివేటప్పుడు కబడ్డీలో రాణించేవాడు. ఇతని శక్తి సామర్థ్యాలను గుర్తించిన వ్యాయామ ఉపాద్యాయుడు పవర్ లిఫ్టింగ్ క్రీడవైపు వెళ్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సూచించాడు.
అబ్బురపరిచిన శిలంబం పోటీలు - దేశం నలుమూలల నుంచి పాల్గొన్న ఔత్సాహికులు - Ancient Martial Art Silambam
వ్యాయామ ఉపాద్యాయుడి సలహా మేరకు పవర్ లిఫ్టింగ్ సాధన చేయడం మొదలు పెట్టాడు భరత్. ఇంటర్‌లో ఉండగానే వివిధ టోర్నమెంట్లలో ప్రతిభ కనబరిచాడు. తన క్రీడా నైపుణ్యంతో విజయవాడలోని కేబీఎన్ (KBN) కళాశాలలో ఉచితంగా డిగ్రీలో ప్రవేశం పొందాడు. అయితే పవర్ లిఫ్టింగ్ ఎంచుకున్న తొలినాళ్లలో కొన్ని ఇబ్బందులు చవిచూశానని ఈ క్రీడాకారుడు అంటున్నాడు. అండర్-19 పోటీల్లో స్వర్ణం సాధించడంతో తనలో విశ్వాసం పెరిగిందని చెబుతున్నాడు.
ఐపీఎస్ కోసం పవర్ లిఫ్టింగ్‌పై దృష్టి - అంతర్జాతీయ పోటీల్లో సత్తా
ప్రస్తుతం కేబీఎన్ కాలేజీలో యోగా డిప్లమా చదువుతున్నాడు. కళాశాల పీడీ ప్రోత్సాహంతో ఎప్పటికప్పుడు తన ప్రతిభకు పదును పెడుతున్నాడు. 2022 టర్కీలో జరిగిన ఏషియన్ పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. అదే పట్టుదలతో 2 సంవత్సరాలు కఠోర సాధన చేసి ఇటీవల చైనాలో జరిగిన ఏషియన్ పవర్‌లిఫ్టింగ్ యూనివర్సిటీ కప్ 2023-24 పోటీల్లో బంగారు పతకం సాధించానని చెబుతున్నాడు
ప్రతిభకు అడ్డురాని పేదరికం - పవర్ లిఫ్టింగ్‌లో శ్రీకాకుళం యువకుడు సత్తా