వైఎస్‌ఆర్ జిల్లాలో కాల్పుల కలకలం! - 12 మందిపై కేసు నమోదు - Gun Firing in YSR District - GUN FIRING IN YSR DISTRICT
Gun Firing in YSR District: వైఎస్‌ఆర్ జిల్లాలో కాల్పుల కలకలం రేపాయి. సోలార్ ప్లాంట్‌కు గ్రావెల్ తరలించే విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తగా, పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. ఈ సమయంలో ఓ వ్యక్తి కాల్పులు జరిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో 12 మందిపై కేసు నమోదు చేశారు.

By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 29, 2024, 9:48 PM IST
|Updated : Jul 29, 2024, 9:58 PM IST
Gun Firing in YSR District: వైఎస్సార్ జిల్లా కొండాపురం మండలంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. సోలార్ ప్లాంట్‌కు గ్రావెల్ తరలించే విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. టి.కోడూరు గ్రామానికి చెందిన రాంమునిరెడ్డి, పవన్‌రెడ్డి మధ్య ఘర్షణ జరగగా, ఇరువర్గాలు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. రాళ్ల దాడిలో పోలీసు వాహనంతో పాటు 3 వాహనాల అద్దాలు ధ్వంసం అయ్యాయి. రాంమునిరెడ్డి తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపినట్లు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాల్పుల ఘటనలో 12 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.