Gruha Jyothi Scheme Zero Bill in Telangana :రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో(Congress Six Guarantees) ఒకటైన గృహజ్యోతి పథకం ద్వారా ప్రతి పేదవాడికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటును ప్రభుత్వం అందిస్తోంది. ఈ పథకం ప్రారంభించి నెల రోజులు అయిన కాలేదు అప్పుడే ఎన్నికల కోడ్ అంటూ గతంలో ఇచ్చిన జీరో బిల్లును వెనక్కి తీసుకుంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నా, కొందరు మాత్రం ఎన్నికల కోడ్లో భాగం అంటూ కొట్టిపడేస్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే గత నెలలో గృహజ్యోతి పథకం(Gruha Jyothi Scheme) కింద సరూర్ నగర్ సర్కిల్లో పలువురు వినియోగదారులకు సున్నా బిల్లును విద్యుత్ శాఖ జారీ చేసింది. ఈ ప్రాంతం రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉండటంతో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఇక్కడ వర్తిస్తుందని తెలియడంతో అర్ధాంతరంగా సున్నా బిల్లుల జారీ ఆపేశారు. మిగతా అర్హత ఉన్న వినియోగదారులకు బిల్లులు జారీ చేశారు. సున్నా బిల్లు వచ్చిందని సంతోషపడిన వినియోగదారులకు విద్యుత్ శాఖ ఇచ్చిన జలక్తో ఒక్కసారిగా కరెంటు షాక్ కొట్టినట్లు అయింది.
Gruha Jyothi Scheme Zero Bill in Telangana అమల్లోకి గృహజ్యోతి స్కీమ్ - అర్హులకు జీరో బిల్లులు అందజేస్తున్న మీటర్ రీడర్లు
Gruha Jyothi Scheme 2024 : గత నెల జారీ అయిన సున్నా బిల్లులన్నింటినీ వెనక్కి తీసుకున్నారు. ఈ సున్నా బిల్లుల(Zero Current Bill) మొత్తాన్ని బకాయిలుగా చూపుతూ ఈ నెల వచ్చిన బిల్లులో కలిపి వినియోగదారుడికి అందిస్తున్నారు. ఈ క్రమంలో సరూర్నగర్ సర్కిల్ అల్మాస్గూడలో ఓ వినియోదారుడికి మార్చి 2వ తేదీన జారీ అయిన బిల్లులో గృహజ్యోతి రాయితీ రూ.262గా విద్యుత్ సంస్థ చూపింది. వీరికి సున్నా బిల్లును వేశారు. ఇప్పుడు ఈ నెల వచ్చిన రూ.547 బిల్లుకు సున్నా బిల్లు బకాయి కలిపి రూ.809 చెల్లించాలని బిల్లుతో పాటు సమాచారం వచ్చింది.
Gruha Jyothi Scheme Problems : ఇప్పుడు ఈ బిల్లులు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. సాంకేతిక సమస్య కారణంగా స్పాట్ బిల్లింగ్ యంత్రం మార్చిలో సున్నా బిల్లు జారీ అయిందని విద్యుత్ సంస్థ తెలిపింది. ఈ పథకం ప్రారంభించినప్పుడు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఎన్నికల కోడ్(Election Code in Telangana) ఉందని గృహజ్యోతిని ప్రారంభించలేదు. అందుకే ఈ నెల ఎలక్ట్రానిక్ బిల్లింగ్ సిస్టమ్(EBS) ప్రకారం సాధారణ బిల్లు జారీ అయిందని డిస్కం అధికారి వివరించారు.
బిల్లు వచ్చినవారు ఆ వివరాలతో మళ్లీ దరఖాస్తు చేయాలి - గృహజ్యోతిపై భట్టి క్లారిటీ
అద్దె ఇళ్లలో నివసించే వారికి ఇక నో టెన్షన్ - గృహజ్యోతి వారికి కూడా వర్తింపు