Group 2 Exams Instructions To Candidates : గ్రూప్- 2 పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థులకు టీజీపీఎస్సీ పలు సూచనలు చేస్తోంది. డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు జరగనున్నాయి. వ్యక్తిగతంగా సైతం మెసేజ్‌ల రూపంలో సూచనలను పంపుతోంది. పరీక్షకు హాజరయ్యే వారు తప్పని సరిగా హాల్‌టికెట్‌పై పాస్‌పోర్ట్ సైజ్ లేటెస్ట్ ఫోటోలను అతికించాలని పేర్కొంది. హాల్ టికెట్‌పై ఫోటోలేని వారిని పరీక్ష రాసేందుకు అనుమతించమని పేర్కొంది.
పరీక్షల తేదీ, సమయం :డిసెంబరు 15వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్ -1 జరగనుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2, అలాగే డిసెంబరు 16వ తేదీ ఇదే సమయాల్లో పేపర్ 3,4 పరీక్ష ఉంటుంది.
నిమిషం ఆలస్యమయినా అనుమతించరు :
- పరీక్షకు ఒకరోజు ముందే పరీక్షా కేంద్రాలకు వెళ్లి పరిశీలించుకోవాలని.. దీంతో పరీక్షరాయడానికి సెంటర్లకు సమయానికి చేరుకోవచ్చని తెలిపింది.
- ఎగ్జామ్ ప్రారంభించడానికి గంట ముందు నుంచి అభ్యర్థులను పరీక్ష కేంద్రాలలోనికి అనుమతించనున్నట్టు పేర్కొంది.
- పరీక్ష ప్రారంభమయ్యే సమయం కంటే అరగంట ముందే గేట్లు మూసివేస్తారు.
- పరీక్షా సమయానికి నిమిషం ఆలస్యమయినా పరీక్ష కేంద్రంలోనికి అనుమతించబోమని టీజీపీఎస్సీ స్ఫష్టం చేసింది.
- బ్లూ, బ్లాక్ బాల్ పాయింట్ పెన్, హాల్ టిక్కెట్, ఏదైనా గుర్తింపు కార్డులను(ఆధార్, పాన్‌కార్డు) మాత్రమే అభ్యర్థి పరీక్షా కేంద్రంలోనికి తీసుకురావాలని తెలిపింది.
- అభ్యర్థులు ఓఎంఆర్ షీట్లో బబ్లింగ్ తప్పులు లేకుండా రాయాలని సూచించింది.
- సెల్ ఫోన్లు, ట్యాబ్‌లు, పెన్‌డ్రైవ్‌లు, బ్లూటూత్‌లు, స్మార్ట్ వాచ్‌లు, హ్యాండ్ బ్యాగ్‌లు, పౌచ్‌లు, రైటింగ్ ప్యాడ్స్, నోట్స్, ఛార్ట్లు లోపలికి అనుమతించరని తెలిపారు.