తెలంగాణ

telangana

ETV Bharat / state

గృహజ్యోతి అమలుకు సంతకం అంటూ ఎకరా భూమిపై కన్నేసిన ఉపాధి హామీ సహాయకుడు

Griha Jyoti Scheme Fraud In Medak : రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన గృహజ్యోతి పథకానికి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని తెల్లరేషన్ కార్డుతో, ఆధార్ కార్డు అనుసంధానం చేసుకోవాలి. అయితే ఇదే అదనుగా కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. కొందరు లంచం రూపంలో డబ్బును, మరికొందరు ఆస్తి పత్రాలపై సంతకాల పేరుతో తమ లాభార్జన కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా గృహజ్యోతి పథకం అమలుకు సంతకం పెట్టాలంటూ ఎకరా భూమిని కాజేయాలని వెలుగు చూసిన ఘటన మెదక్ జిల్లా శివంపేట మండలం కొంతాన్ పల్లి గ్రామంలో జరిగింది.

Griha Jyoti Scheme Fraud In Medak
Griha Jyoti Scheme Fraud

By ETV Bharat Telangana Team

Published : Mar 5, 2024, 10:38 PM IST

గృహజ్యోతి అమలుకు సంతకం అంటూ ఎకరా భూమిపై కన్నేసిన ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడు

Griha Jyoti Scheme Fraud In Medak :రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ఆరు గ్యారంటీల్లో(Congress Six Guarantees) ఒకటైన గృహజ్యోతి పథకం కూడా ఒకటి. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని తెల్లరేషన్ కార్డుతో, ఆధార్ కార్డు అనుసంధానం చేసుకున్న వారికి వారి అర్హత ఆధారంగా పథకాలకు అర్హులను ఎంపిక చేస్తున్నారు. గ్రామాల్లో నిరక్ష్యరాసుల అమాయకత్వమే అదనుగా కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. కొందరు కమీషన్ల రూపంలో డబ్బును, మరికొందరు ఆస్తి పత్రాలపై సంతకాల పేరుతో తమ లాభార్జన కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా గృహజ్యోతి పథకం అమలకు సంతకం పెట్టాలంటూ ఎకరా భూమిని కాజేయాలని వెలుగు చూసిన ఘటన మెదక్ జిల్లా శివంపేట మండలం కొంతాన్ పల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన సులోచన ప్రజా పాలనలో గృహ జ్యోతి పథకం కోసం దరఖాస్తు చేసుకుంది.

స్విగ్గీలో కొత్త స్కామ్ - నమ్మి ఆ కాల్ అటెండ్ చేస్తే రూ.లక్షలు స్వాహా - బీ అలర్ట్!

"ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడు రాములు గృహజ్యోతి పథకం అమలు కోసం సంతకాలు పెట్టాలంటూ మా అమ్మతో పాటు నాకు పలుమార్లు ఫోన్ చేశాడు. ఈరోజు సంతకం చేయడానికి వెళ్లగా అప్పటికే మా అమ్మకు చెందిన ఎకరా భూమి అమ్మినట్లు పత్రం సిద్ధం చేసి పెట్టుకున్నట్లు నాకు తెలిసింది. గృహ జ్యోతి పథకం దరఖాస్తుపై వేలిముద్ర చేసిన తర్వాత బాండ్ పేపర్లపై వేయాలంటూ మా అమ్మకు చెప్పాడు. అప్పటికే నేను అక్కడికి చేరుకొని బాండ్ పేపర్లపై సంతకాలు ఎందుకు అంటూ నిలదీయడంతో అతని మీద అనుమానం వచ్చింది. బాండ్ పేపర్​ను శివంపేట పోలీస్​ స్టేషన్​లో, ఎంపీడీవో కార్యాలయంలో ఫిర్యాదు చేశాం."-శ్రీనివాస్, బాధితురాలి కుమారుడు

లోన్​ ఇప్పిస్తామని నమ్మబలికారు - మహిళల పేరిట ఖాతాలు తెరిచి రుణం తీసుకున్న కేటుగాళ్లు

సైబర్‌ నేరాల నియంత్రణకు పోలీస్‌ శాఖ వ్యూహాత్మక అడుగులు - సిబ్బందికి ప్రత్యేక శిక్షణ

ABOUT THE AUTHOR

...view details