ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమల భక్తులకు గుడ్​న్యూస్ - వాట్సాప్ ద్వారా దర్శనం బుకింగ్ - TTD Darshan Through WhatsApp - TTD DARSHAN THROUGH WHATSAPP

Tirumala Darshan Booking System Through WhatsApp: తిరుమల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం స్వామి వారి దర్శనాన్ని మరింత సులభతరం చేసే దిశగా ఆలోచనలు చేస్తోంది. తక్కువ ఖర్చుతో భక్తులకు వీలైనన్ని ఎక్కువ సేవలు అందించే చర్యలకూ శ్రీకారం చుడుతోంది. బ్రహ్మోత్సవాలు ముగియగానే పాలకమండలిని నియమించి రానున్న 3 నెలల్లో వాట్సాప్ ద్వారా తేలిగ్గా దర్శనం బుక్ చేసుకునే విధానాన్ని తీసుకురానున్నట్లు సమాచారం.

ttd_darshan_through_whatsapp
ttd_darshan_through_whatsapp (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 2, 2024, 5:05 PM IST

Updated : Oct 2, 2024, 10:59 PM IST

Tirumala Darshan Booking System Through WhatsApp:ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందికి ఇప్పుడు నిత్యవసరంగా మారిన వాట్సాప్ సేవల్ని ఇక దైవ దర్శనాలు సులభతరం చేసేందుకూ అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వాట్సప్ ద్వారా సినిమా టిక్కెట్లు, గ్యాస్ బుకింగ్, విమాన టికెట్లు సైతం సులభంగా బుక్ చేసుకుంటున్నప్పుడు భక్తులు తమకు నచ్చిన రోజు దైవదర్శనం సులభంగా చేసుకునే వీలు కల్పించాలన్నది సీఎం చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది.

తిరుమల భక్తులకు గుడ్​న్యూస్ - వాట్సాప్ ద్వారా దర్శనం బుకింగ్ (ETV Bharat)

ఎమ్మెల్యే మొదలు సీఎం పేషీ వరకూ రోజూ తిరమల దర్శనం కోసం సిఫార్సు లేఖల ఒత్తిడి ఎక్కువగా ఉంటుండటంతో ఎలాంటి సిఫార్సులతో పనిలేకుండా సామాన్యులు సులభంగా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకునేలా ముందస్తు బుకింగ్ విధానాన్ని తీసుకురావాలని ఇటీవల జరిగిన సమీక్షలో సీఎం పలు సూచనలు ప్రతిపాదించినట్లు సమాచారం.

తిరుమల దేవస్థానం నుంచి వాట్సప్ ద్వారా దర్శనం బుకింగ్ సేవలు ప్రారంభించి క్రమేణా అన్ని దేవాలయాల్లోనూ అందుబాటులోకి తీసుకురావాలన్నది ప్రభుత్వ ఆలోచన. తిరుమల దర్శనంతో పాటు ఇతర సేవలకు ఉన్న ధరలను సైతం ప్రక్షాళన చేసి తక్కువ ఖర్చుతో వీలైనన్ని ఎక్కువ సౌకర్యాలు, సదుపాయాలు కల్పించాలన్నది సీఎం యోచనగా తెలుస్తోంది. ఇందుకనుగుణంగా స్వామివారి దర్శనాలు, సేవలు మొదలు దర్శనానికి వచ్చే భక్తులకు కల్పించే ఇతర సౌకర్యాలు, సదుపాయలకు సంబంధించి ప్రస్తుతం అందుబాటులో ఉన్న ధరలను సమీక్షించి వాటిని ప్రక్షాళన చేయనున్నట్లు సమాచారం.

కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ దూకుడు - మూడు బృందాలుగా ఏర్పడి విచారణ - Tirumala Laddu Adulteration Case

కోట్లాది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం:తిరుమల లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యల పట్ల ఎవ్వరూ అధైర్యపడాల్సిన పనిలేదన్నది ప్రభుత్వ పెద్దల ఆలోచనగా తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకొచ్చిన ఎన్నో విప్లవాత్మక మార్పులను భక్తులు గుర్తించారని చేసిన మంచి పనులు చెప్పుకోవటంలో కాస్త వెనుక పడినా భక్తులకు చేసిన మేలును గట్టిగానే చాటాలన్నది భావనగా తెలుస్తోంది. తిరుమల ఆలయానికి సరఫరా అయ్యే నెయ్యిలో కల్తీ జరిగిందని ఒక ప్రతిష్ఠాత్మక ల్యాబ్‌ నిర్ధారించిన తర్వాతే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు.

ఇంత పెద్ద అంశంలో మౌనంగా ఉండడం మంచిది కాదన్న భావంతో బాధ్యతగా ప్రజలకు వాస్తవాలు చెప్పారనే విషయాన్నే బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టే సీఎం బయటపెట్టారని విషయం తెలిశాక కూడా దానిని రహస్యంగా ఉంచి అది మరో రకంగా బయటకు వచ్చి ఉంటే ప్రభుత్వం అప్రతిష్ఠపాలయ్యేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష విరమణ - శ్రీవారి ఆలయంలో వారాహి డిక్లరేషన్ బుక్‌ - Pawan Kalyan Prayaschitta Deeksha

విద్యుత్తు కాంతుల్లో ఇంద్రకీలాద్రి - తుది దశకు చేరిన దసరా ఏర్పాట్లు - Dasara Sharan Navaratri 2024

Last Updated : Oct 2, 2024, 10:59 PM IST

ABOUT THE AUTHOR

...view details