TCS OPERATIONS IN VISAKHAPATNAM: దిగ్గజ ఐటీ సంస్థ టీసీఎఎస్ విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. విశాఖలో 2016లో ఐటీ హిల్స్ నెంబర్-2లో డల్లాస్ టెక్నాలజీ సెంటర్ ఎల్ఎల్పీకి అప్పుడు 7 వేల 774 చదరపు మీటర్ల స్ధలాన్ని కేటాయించారు. ఈ ప్రాంగణంలో మూడు అంతస్ధుల భవనం ఉంది. ఇందులో 1400 మంది పని చేసేందుకు అనువుగా ఉంది.
తొలిదశలో 2 వేల మందితో కార్యకలాపాలు: డల్లాస్ టెక్నాలజీ ప్రాంగణం టీసీఎస్‌కు లీజ్‌కు ఇచ్చేందుకు అనుమతిస్తూ పరిశ్రమల శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. వాస్తవంగా టీసీఎస్ తొలి దశలో రెండు వేల మందితో తన కార్యకలాపాలను ఆరంభించేందుకు సంకల్పించింది. ఈ మేరకు తమకు అనువైన ప్రాంగణాలలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ భవనాలను గుర్తించింది.