Government Orders for Caste Census : రాష్ట్రంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కులగణన చేయాలన్న అసెంబ్లీ తీర్మానం మేరకు రాష్ట్రప్రభుత్వం జీవో జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇందుకోసం సుమారు రూ.150 కోట్లు ఖర్చవుతుందని బీసీ కమిషన్ అంచనా వేసింది.
Caste Census in telangana : గడిచిన అసెంబ్లీ సమావేశాల్లో, రాష్ట్రంలో కులగణన చేపట్టాలని ప్రభుత్వ ప్రవేశపెట్టిన ఏకగ్రీవ తీర్మానంపై అఖిల పక్షాలు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. జనాభాకు అనుగుణంగా నిధులు కేటాయించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకే సర్వే చేపడుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth) అసెంబ్లీ వేదికగా పేర్కొన్నారు. పాలితులుగా ఉన్న వారిని పాలకులను చేయడమే తమ ఉద్దేశ్యమని ఆయన తెలిపారు.