Special Officers for Drinking Water : రాష్ట్రంలో ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు ప్రభుత్వం అప్రమత్తమైంది. వేసవి కాలంలో తాగునీటి పర్యవేక్షణ కోసం ఐఏఎస్‌లను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ రాష్ట్రప్రభుత్వం(TG GOVT) ఉత్తర్వులు జారీ చేసింది. 33 జిల్లాలకు పది మంది ఐఏఎస్‌లను ప్రత్యేక అధికారులుగా ప్రభుత్వం నియమించింది.
IAS Officers for Water Monitering : వీరిలో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు ప్రశాంత్ జీవన్ పాటిల్, కుమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాలకు కృష్ణ ఆదిత్య, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఆర్.వి.కర్ణన్, ఉమ్మడి నల్గొండ జిల్లాకు అనిత రామచంద్రన్‌ను నియమించింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఎ.శరత్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు బి.విజయేంద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు శృతి ఓజా, ఉమ్మడి వరంగల్ జిల్లాకు బి.గోపీని నియమించింది.
అలాగే ఉమ్మడి మెదక్ జిల్లాకు భారతి హొలికేరీ, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కె.సురేంద్ర మోహన్‌ను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన జిల్లాల్లో వెంటనే పర్యటించాలని ఉత్తర్వుల్లో సీఎస్ శాంతికుమారి స్పష్టం చేశారు. రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులను సమన్వయం చేసుకుంటూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ పేర్కొన్నారు. జులై చివరి వరకు ప్రత్యేక అధికారులు సెలవు పెట్టవద్దని ఉత్తర్వులు జారీ చేసింది.