Government has Given Orders Transferring Nine IPS Officers in State : రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అగ్నిమాపక శాఖ డీజీగా మాదిరెడ్డి ప్రతాప్‌ను బదిలీ చేసింది. శాంతి భద్రతల ఐజీగా సీ.హెచ్ శ్రీకాంత్ నియమించింది. లాజిస్టిక్స్ ఐజీగా పీహెచ్‌డి రామకృష్ణకు బాధ్యతలు అప్పగించగా, అలాగే పోలీసు నియామక బోర్డు చైర్మన్ గా పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఎస్పీఎఫ్ డీజీగా అదనపు బాధ్యతలు అంజనా సిన్హాకు అప్పగించారు. విజయవాడ సీపీగా ఎస్వీ రాజశేఖర బాబును బదిలీ చేశారు. విశాఖ రేంజ్ డీఐజీగా గోపీనాథ్ జెట్టిను నియమించారు. కర్నూలు రేంజ్ డీఐజీగా కోయ ప్రవీణ్‌ను బదిలీ చేసింది. డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని విశాల్ గున్నికి, విజయరావులకు ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు భారీగా ఐఏఎస్‌ల బదిలీ..
రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. 19 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరామును అటవీ, పర్యావరణ శాస్త్ర సాంకేతిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గా ఆర్.పి. సిసోడియా కు స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చింది. జి.జయలక్ష్మి కి సీసీఎల్‌ఏ చీఫ్ కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించింది. కాంతిలాల్ దండే ఆర్ అండ్ బీ ముఖ్యకార్యదర్శిగా బదిలీ అయ్యారు. సురేశ్ కుమార్ ను పెట్టుబడులు మౌలిక సదుపాయాల కార్యదర్శి , గ్రామవార్డు సచివాలయం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. జీఏడీ కార్యదర్శిగానూ సురేశ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. సౌరభ్ గౌర్ ఐటీశాఖ, ఆర్టీజీఎస్ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది. యువరాజ్ పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ కార్యదర్శి గా హర్షవర్ధన్ మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది. పి.భాస్కర్ వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ కార్యదర్శి, ఈడబ్ల్యూఎస్, జీఏడీ సర్వీసెస్ అదనపు బాధ్యతలు అప్పగించింది.