Government Appoints New SIT On Ration Rice Smuggling : రాష్ట్రంలో రేషన్ బియ్యం స్మగ్ల్మింగ్‌పై విచారణకు ఏర్పాటు చేసిన సిట్ స్థానంలో ప్రభుత్వం కొత్త సిట్‌ను నియమించనుంది. ఇప్పటికే సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో ఒక ఎస్పీ, నలుగురు డీఎస్పీలతో ఈనెల 6న ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే వైఎస్సార్సీపీ అనుకూలురుగా ముద్రపడ్డ డీఎస్పీలు అశోక్‌వర్థన్ రెడ్డి, ఎం.బాలసుందరరావు, ఆర్.గోవిందరావును సభ్యులుగా నియమించడంపై విమర్శలు వచ్చాయి. దీంతో వారిని తప్పించి కొత్తగా కూర్పు చేపడుతున్నారు.
ప్రస్తుతం ముగ్గురు డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లతో పాటు పౌరసరఫరాలు, తూనికలు, కొలతల శాఖాధికారులు, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం నుంచి కొందరినీ సిట్‌లోకి తీసుకోనున్నారు. అందుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఒకటి, రెండు రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశం ఉంది. కాకినాడ కేంద్రంగా ఏర్పాటైన మాఫియాపై 13 కేసులు ఉన్నాయి. వీటితో పాటు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మరికొన్ని ముఖ్యమైన స్మగ్ల్మింగ్ కేసుల్ని సైతం సిట్ విచారించనుంది. దందా వెనక ఉన్న సూత్రధారులు, పాత్రధారులు ఎవరనే విషయాన్ని తేల్చనుంది.
బియ్యం ఎగుమతుల్లో కాకినాడ 'కీ' పోర్టు - అంతర్జాతీయస్థాయిలో రేషన్ మాఫియా!
NEW SIT Inquiry on PDS Rice Smuggling :కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కొత్త ఏర్పాటైనప్పటి నుంచి మాఫియా గుండెల్లో గుబులు మొదలైంది. ఓవైపు స్టెల్లా నౌక నుంచి సేకరించిన బియ్యం నమూనాల పరిశీలన జరగుతుండగా సిట్ విచారణ దూకుడుగా సాగే అవకాశం ఉంది. అక్రమాలకు అండదండగా ఉంటున్న పెద్దలపాత్ర తేలనుంది. రాష్ట్రంలో ఎన్ని పోర్టులున్నా వివాదాల సుడిలో చిక్కింది మాత్రం కాకినాడ పోర్టే.