ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుడ్​న్యూస్​ - వచ్చే ఏడాది జనవరిలో టెట్

ఏడాదిలోనే రెండో సారి టెట్ నోటిఫికేషన్ జారీ చేసిన తెలంగాణ సర్కార్ - 2025 జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ పరీక్ష

TET Notification 2024
TET Notification 2024 (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 4, 2024, 4:48 PM IST

TET Notification 2024 in Telangana: :తెలంగాణలోఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. అన్నట్టుగానే ప్రభుత్వం ఏడాదిలోనే రెండో సారి టెట్ నోటిఫికేషన్ ఇవ్వటం విశేషం. గత మే నెలలో తొలిసారి టెట్ నోటిఫికేషన్ ఇచ్చిన సర్కారు తాజాగా మరో మారు నోటిఫికేషన్ ను ఇచ్చింది. వచ్చే ఏడాది జనవరిలో టెట్ నిర్వహించనున్నట్టు ఈ సందర్భంగా ప్రకటించింది. 2025 జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు కంప్యూటర్ బేస్డ్ పరీక్షను నిర్వహించనున్నారు.

టెట్ రాసేందుకు ఆన్​లైన్​లో దరఖాస్తులు : అభ్యర్థులు నవంబర్ 5 నుంచి 20వ తేదీ లోపు టెట్ రాసేందుకు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చునని డైరెక్టర్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్ఫష్టం చేశారు. పాఠశాల విద్యా అధికారిక వెబ్ సైట్​లో మరింత సమాచారం పొందవచ్చని వారు పేర్కొన్నారు. ఆగస్టులో జాబ్ క్యాలెండర్ విడుదల సందర్భంగా ప్రభుత్వం ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపిన విషయం అందరికీ తెలిసిందే. ఈ విధంగా ఇప్పటికే మే నెలలో ఒకసారి టెట్ నిర్వహించగా మరో మారు నోటిఫికేషన్ విడుదల చేయటం విశేషం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఆరు సార్లు టెట్ పరీక్షలు నిర్వహించగా జనవరిలో జరిగేది ఏడోసారి కానుంది.

టెట్‌ రాసేందుకు అర్హత : టెట్‌ పేపర్‌-1కు డీఈడీ, పేపర్‌-2కు బీఈడీ పూర్తి చేసిన వారు అర్హులు. పదోన్నతి పొందేందుకు స్కూల్‌ అసిస్టెంట్లకు టెట్‌ ఎలిజిబిలిటీ ఉండాలని చెబుతుండటంతో చాలా మంది ఉపాధ్యాయులుగా కొనసాగుతున్న వారు సైతం ఎగ్జామ్​కు హాజరుకానున్నారు. టెట్‌ ప్రవేశపెట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు తొమ్మిది సార్లు పరీక్షలు నిర్వహించగా జనవరిలో పదోసారి జరగనుంది. 2014 లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిన తర్వాత గత మే నెలలో నిర్వహించిన పరీక్షతో కలుపుకొని ఏకంగా ఆరుసార్లు పరీక్షలు జరిపారు. అక్కడి కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రెండోసారి ఈ టెట్‌ను నిర్వహిస్తుండటం విశేషం.

ఏపీ టెట్ ఫలితాలు విడుదల - రిజల్ట్స్​ ఇలా చెక్​ చేస్కోండి

నేటి నుంచి 'టెట్' పరీక్షలు - అభ్యర్థులు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details