Gold Ornaments Worth 2 Crore Rupees Donated to Tirumala:తిరుమల శ్రీవారికి సుమారు 2 కోట్ల రూపాయల విలువైన స్వర్ణ వైజయంతీ మాలలను దాతలు విరాళంగా అందించారు. ఈ కానుకలను డీకే ఆదికేశవులు మనవరాలు చైతన్య ఉత్సవమూర్తులకు అలంకరించేందుకు విరాళంగా అందజేశారు. దాతలు శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు (TTD Chairman BR Naidu), టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి ఆభరణాలను అందించారు. శుక్రవారం తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారికి కూడా మరో వైజయంతీ మాలను విరాళంగా ఇవ్వనున్నారు.
స్వామివారికి, అమ్మవారికి వైజయంతి మాల చేయించడం అనేది జరిగింది. శివుడు సుదర్శన చక్రం విష్ణుస్వామికి సమర్పించిన రోజు ఈ రోజు. శివుడినని, వెంకటేశ్వర స్వామిని సంవత్సరంలో ఒకే రోజు పూజిచడం జరుగుతుంది. శృంగేరి శారదా పీఠం స్వామి వచ్చి ఆయన ప్రాణ ప్రతిష్ఠ చేసి హారం ఇవ్వడం అనేది జరిగింది. అలాగే పద్మావతి దేవికి కూడా శుక్రవారం హారం సమర్పిస్తాము. హారంలోని వజ్రాలు చాలా పాతకాలానికి చెందినవి. ఆ హారం విలువ సూమారు రూ. 2 కోట్లుకు పైగా ఉంటుంది. మొత్తంగా నాలుగు హారాలు ఇవ్వడం జరిగంది.- చైతన్య, డీకే. ఆదికేశవులు మనవరాలు
శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు సమయం:కాగా గడచిన రోజున(బుధవారం) తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు సమయం పట్టింది. 2 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. 66,441 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 20,639 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. మొత్తంగా తిరుమలలో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.12 కోట్లు వచ్చింది.