Girl Died in Suspicious Condition: తిరుపతి జిల్లాలోని ఓ గ్రామానికి సమీపంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న అటవీ ప్రాంతంలో పదేళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బాలిక తండ్రి ఓ రైస్ మిల్లులో పని చేస్తున్నారు. ఈరోజు బాలికను ఓ యువకుడు మిల్లు నుంచి బయటకు తీసుకుని వచ్చినట్లు సీసీ కెమెరాలో నమోదైంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరించారు. బాలిక అనుమానాస్పద మృతి సంచలనంగా మారింది. బాలిక మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
తిరుపతి జిల్లాలో పదేళ్ల బాలిక అనుమానాస్పద మృతి - Girl died in suspicious condition - GIRL DIED IN SUSPICIOUS CONDITION
Girl Died in Suspicious Condition: ఏపీలో వరుసగా బాలికలు, మహిళల హత్యలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా తిరుపతి జిల్లాలో పదేళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్రంగా కలచి వేస్తోంది. బాలిక మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Girl Died in Suspicious Condition (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 17, 2024, 7:22 PM IST